BIG Academy: యువరాజ్ గెస్ట్‌గా రేపే ‘బిగ్ అకాడమీ’ ప్రారంభం
BIG-Academy (Image source X)
Telangana News, ఆంధ్రప్రదేశ్

BIG Academy: గ్రాండ్‌గా ‘బిగ్ అకాడమీ’ ప్రారంభోత్సవం.. రేపు హైదరాబాద్‌కు యువరాజ్ సింగ్

BIG Academy: నేటి కాలంలో విద్యా బోధన అంటే పిల్లలకు ఒక చిత్రహింస అనిపించేలా పరిస్థితులు తయారయ్యాయి. ఈ ఒత్తిళ్లు తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంటున్న పిల్లల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. అయితే, పిల్లల మానసిక వికాసానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ హైదరాబాద్‌ నగరంలో నూతన తరం ఎడ్యూ టెక్ సంస్థ ‘బిగ్ అకాడమీ’ (BIG Academy) ప్రారంభానికి సిద్ధమైంది. ఐఐటీ-జేఈఈ, నీట్‌ ఎగ్జామ్స్‌కు అభ్యర్థులను సన్నద్ధం చేయనున్న ఈ సంస్థను మంగళవారం (జనవరి 6) నోవాటెల్ హెచ్ఐసీసీలో అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ ఈవెంట్‌కు భారత దిగ్గజ మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ హాజరవుతున్నాడు. కాగా, బిగ్ అకాడమీ సంస్థ హైబ్రీడ్ లెర్నింగ్‌ విధానంపై దృష్టిపెట్టి అభ్యర్థులను సన్నద్ధం చేస్తుంది. పిల్లలకు ఎలాంటి టార్చర్ ఉండదు. ఇంటెలిజెంట్ లెర్నింగ్‌పై మాత్రమే దృష్టిపెడతారు. అభ్యర్థుల మానసిక ఆరోగ్యాన్ని సమతుల్యం చేసేలా, కేంద్రీకృత విద్యా వ్యవస్థను రూపొందించాలనే లక్ష్యంతో బిగ్ అకాడమీని ఏర్పాటు చేశారు.

Read Also- Hindu Widow Attacked: హిందూ వితంతు మహిళపై సామూహిక అత్యాచారం.. చెట్టుకు కట్టేసి జట్టు కత్తిరింపు.. బంగ్లాదేశ్‌లో ఘోరం

బట్టీ పట్టే విధానానికి స్వస్తి

పిల్లలకు ఇబ్బందికరంగా మారిన బట్టీ పట్టే చదివించే విధానానికి స్వస్తి పలికి, విద్య, మానసిక ఆరోగ్యం విషయంలో అండగా నిలిచే వ్యవస్థను రూపొందించడమే తమ లక్ష్యమని బిగ్ అకాడమీ వ్యవస్థాపకులు, సీఈవో రమణ భూపతి చెప్పారు. టెక్నాలజీకి మానవీయ మార్గదర్శకత్వాన్ని జోడించి ఆత్మవిశ్వాసం కూడగట్టుకునేలా విద్యార్థులను తయారు చేస్తామని అన్నారు. విద్యార్థులను కేవలం పరీక్షలకే కాకుండా భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను సైతం ఎదుర్కొనేలా సిద్ధం చేస్తామని అన్నారు. టెక్ ఆధారిత టీచింగ్‌తో పాటు నిపుణులైన ఫ్యాకల్టీ, వ్యక్తిగత మార్గదర్శకత్వం ఉంటుందని, తద్వారా పిల్లలపై ఒత్తిడిని తగ్గించాలని బిగ్ అకాడమీ లక్ష్యంగా నిర్దేశించుకుందని రమణ భూపతి పేర్కొన్నారు. కాగా, బిగ్ అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సంస్థ బ్రాండ్ అంబాసిడర్ యువరాజ్ సింగ్‌తో పాటు తెలంగాణ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సీవీ ఆనంద్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, బిగ్ టీవీ ఫౌండర్, ఛైర్మన్ విజయ్ రెడ్డి, బిగ్ టీవీ మలయాళం ఫౌండర్ డైరెక్టర్, మేనేజింగ్ ఎడిటర్ అనిల్ అయూర్ హాజరుకానున్నారు.

Read Also- Sathupalli Medical Scam: సత్తుపల్లి మెడికల్ సిండికేట్ దందాలో బిగ్ ట్విస్ట్.. తెర వెనుక నడుస్తున్న ‘అదృశ్య వ్యవస్థ’

Just In

01

Mahabubabad News: రసవత్తరంగా మానుకోట మునిసిపాలిటీ చైర్మన్ రేస్.. సమీకరణాలు ఇవే

Love Letters: బ్యాచ్‌లర్స్ ప్రదీప్, సుడిగాలి సుధీర్‌కు ప్రేమలేఖలు.. ఆ లేఖల్లో ఏముందంటే?

Stock Markets Fall: బాబోయ్.. ఇన్వెస్టర్లకు ఒకే రోజు రూ.8.1 లక్షల కోట్లు నష్టం.. అంతా ట్రంప్ వల్లే!

YS Jagan on Amaravati: ‘రాజధాని నిర్మాణం సాధ్యమా?’.. అమరావతిపై జగన్ సంచలన వ్యాఖ్యలు

Sobhita Dhulipala: ‘చీకటిలో’ శోభిత ధూళిపాల ఏం చేస్తుందో.. ఆ ఓటీటీలో చూడండి!