Land Scam: రూ.10 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జాకు ఎసరు..?
Land Scam (imagecredit:swetcha)
Telangana News, హైదరాబాద్

Land Scam: కలెక్టర్​ సంతకం ఫోర్జరీ చేసి.. రూ.10 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జాకు ఎసరు..?

Land Scam: నకిలీ పత్రాలతో కోకాపేట్లో భూ కబ్జా
–రూ.10కోట్ల విలువైన ప్రభుత్వ భూమికి ఎసరు
–అక్రమ నిర్మాణాలకు ఇంటి నెంబర్లు కేటాయింపు
–కబ్జాదారులకు అండంగా మాజీ తహశీల్ధార్​, స్ధానిక కౌన్సలర్లు
–ఏకంగా జిల్లా కలెక్టర్​ సంతకమే ఫోర్జరీ చేసిన వైనం
–తహశీల్దార్ ఫిర్యాదుతో నలుగురిపై కేసు నమోదు
రంగారెడ్డి బ్యూరో, స్వేచ్ఛ:  గ్రేటర్​ హైదరాబాద్​లో భాగమైన కోకాపేట రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 147లో సర్కార్​ భూమి కబ్జాకు గురైయింది. 2006లో గత ప్రభుత్వం 119 మంది పేదలకు 60 గజాల చోప్పున వీకర్​ సెక్షన్​ కింద భూమి కేటాయించింది. అయితే మిగిలిన స్థలాలను ప్రజల ప్రయోజనార్ధం కోసం వినియోగించుకునేందుకు ఖాళీగా వదిలేసిన స్థలంపై రెవెన్యూ శాఖలోని అధికారులు, స్ధానిక మాజీ కౌన్సలర్లు కన్నేశారు. ప్రభుత్వ ఇచ్చిన ప్లాట్లను ఆసరా చేసుకోని అక్రమణదారులు 60, 80 గజాల చోప్పున నిర్మాణాలు చేపట్టి, ఇంటి నెంబర్లు కేటాయించి విక్రయాలు చేపడుతున్నారు. ఈవిషయంపై గతేడాది డిసెంబర్​ నెలాఖారీలోనే బహిర్గతమైనప్పటికి అధికారులు నిర్లక్ష్యంగా వదిలేశారు. అయితే ఇటీవల కాలంలో అధికారులు ప్రభుత్వ భూముల రక్​షణలో భాగంగా చేపట్టిన డ్రైవ్​లో ఈ వ్యవహారం బయటికి వచ్చింది. ఈ నేపథ్యంలో అధికారులు విచారణ చేపట్టి అక్రమణలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసుకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహారించిన నలుగురిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.

జీవో 58, 59 సాకుతో కబ్జాలు..

రంగారెడ్డి(Rangareddy) జిల్లా గండిపేట్​ మండలం పరిధిలోని కోకాపేట్(Kokapet) సర్వే నెంబర్​ 147లో 2006లో ఇచ్చిన పట్టాలు తప్పా తిరిగి ఎవరికి పట్టాలు జారీ చేసిన దఖాలాలు లేవు. అయితే స్థానికంగా ఉండే అప్పటి రాజకీయ నేతలు, అప్పటి స్ధానిక తహశీల్ధార్​తో కుమ్మక్కై ఇంటి నెంబర్లు, తప్పుడు దృవపత్రాలు సృష్టించి 58, 59 జీవో కింద దరఖాస్తుల చేసుకున్నారు. దాంతో ఆ స్ధలాలను రెగ్యులరైజ్​ చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆ సమయంలో అక్రమంగా చేపట్టి నిర్మాణాలను రెవెన్యూ అధికారులు తొలగించిన సందర్భంలో కోర్టు కేసులున్న వాటిని వదిలేసి, మిగిలిన అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. ఇందులో భాంగానే ఫోర్జరీ చేసి చేపట్టి నిర్మాణాలు వదిలేశారు. ప్రస్తుత తహశీల్ధార్ కు అందిన ఫిర్యాదుల ప్రకారం విచారణ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. స్ధానికుల వివరాల ప్రకారం 12 యేండ్లు ఈ సర్వే నెంబర్​లోని భూమిని ఎవరికి కేటాయించలేదనే వాదన బలంగా అధికారికి వినిపించారు. అంతేకాకుండా అక్రమంగా నిర్మాణం చేసుకున్న స్థలాలకు సంబంధించిన భూమి పత్రాలను పరిశీలిస్తే గతంలో పనిచేసిన కలెక్టర్​ హరీష్(Collector Harish) పేరుతో జారీ చేసినట్లు ఉన్నాయి. ఆ పత్రాలను ఫోరెన్సిక్​ పంపించి సంతాకాలను పరీక్షించగా కలెక్టర్ హరీష్ సంతకం కాదని తెలియడంతో వారిపై చర్యలకు అడుగులు వేసినట్లు తెలుస్తోంది.

Also Read: Gas Leakage: కోనసీమలో అలజడి.. ఓన్‌జీసీ గ్యాస్ లీక్.. ఎగసిపడుతున్న మంటలు

క్రిమినల్​ కేసు నమోదు..

కోకాపేట(Kokapet)లోని రూ.10కోట్లకు పైగా విలువైన సర్కార్​ భూమి(Government land)ని కబ్జా చేసిన నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫ్రీ ఆప్​ కాస్ట్​ కు బదులు ట్రీ ఆఫ్​ కాస్ట్​ కింద అక్రమణదారులపై క్రిమినల్ కేసుతో ఎఫ్​ఐఆర్​. ఉన్నతాధికారుల సంతకాలనే ఏకంగా ఫోర్జరీ చేయడం దారుణం. గతంలో పనిచేసిన ఓ అధికారి ప్రమోయంతోనే ఈ తతంగానికి ఒడిగట్టినట్లు తెలుస్తోందు. గండిపేట్​ మండలం తహశీల్ధార్​ ఎన్​.శ్రీనివాస్​ రెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అక్రమాలకు పాల్పడిన కున్​రెడ్డి లక్మారెడ్డి, ఆర్​.అనిల్​, రామేశ్వరం విశ్వనాథ్, రామేశ్వరం సునిల్​ అనే నలుగురి వ్యక్తులపై కేసు నమోదు చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read: Vijay TVK-BJP: తమిళనాడులో బీజేపీ కొత్త స్కెచ్.. విజయ్ టీవీకే పార్టీ విషయంలో అమిత్ షా గేమ్ ప్లాన్!

Just In

01

Mahabubabad News: రసవత్తరంగా మానుకోట మునిసిపాలిటీ చైర్మన్ రేస్.. సమీకరణాలు ఇవే

Love Letters: బ్యాచ్‌లర్స్ ప్రదీప్, సుడిగాలి సుధీర్‌కు ప్రేమలేఖలు.. ఆ లేఖల్లో ఏముందంటే?

Stock Markets Fall: బాబోయ్.. ఇన్వెస్టర్లకు ఒకే రోజు రూ.8.1 లక్షల కోట్లు నష్టం.. అంతా ట్రంప్ వల్లే!

YS Jagan on Amaravati: ‘రాజధాని నిర్మాణం సాధ్యమా?’.. అమరావతిపై జగన్ సంచలన వ్యాఖ్యలు

Sobhita Dhulipala: ‘చీకటిలో’ శోభిత ధూళిపాల ఏం చేస్తుందో.. ఆ ఓటీటీలో చూడండి!