Lenin Movie: అరె ‘లెనిన్’ పాట వచ్చిందిన్నావా.. వ్వా వవ్వారె వారెవా!
Lenin Movie (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Lenin Movie: అరె విన్నావా విన్నావా.. ‘లెనిన్’ పాట వచ్చిందిన్నావా.. వ్వా వవ్వారె వారెవా!

Lenin Movie: అఖిల్ అక్కినేని (Akhil Akkineni)కి ఇప్పుడు సాలిడ్ హిట్ కావాలి. చాలా కాలంగా, చాలా కాలం ఏంటి, ఆయన హీరోగా స్టార్ట్ అయినప్పటి నుంచి హిట్ మాత్రం ఆయనకు రావడం లేదు. ప్రయత్న లోపం లేకపోయినా, ఎంచుకునే కథలు అఖిల్‌కు హిట్ ఇవ్వలేకపోతున్నాయి. ఈ క్రమంలో ఎలాగైనా హిట్ కొట్టాలని, ఈ సారి ‘వినరో భాగ్యము విష్ణు కథ’ వంటి హిట్ కొట్టిన దర్శకుడితో ఆయన కొలాబరేట్ అయ్యారు. మనం ఎంట‌ర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై ముర‌ళి కిషోర్ అబ్బూరు (Murali Kishor Abburu) ద‌ర్శ‌క‌త్వంలో అక్కినేని నాగార్జున‌, సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తోన్న చిత్రం ‘లెనిన్’. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. రాబోయే సమ్మర్‌కు విడుదలకు సిద్ధమవుతోన్న ఈ మూవీ నుంచి సోమవారం ‘వారెవా వారెవా’ అంటూ సాగే పాటను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాట ఎలా ఉందంటే..

Also Read- Bhagavanth Kesari: ‘జన నాయగన్’ ఎఫెక్ట్.. బాలయ్య సినిమా కోసం ఓటీటీలో ఎగబడుతున్నారు

నాగార్జునకు ‘శివ’.. అఖిల్‌కు ‘లెనిన్’

‘వారెవా వారెవా..’ అంటూ వచ్చిన ఈ లిరిక‌ల్ సాంగ్‌ (VaareVaa VaareVaa Lyrical Video) వినగానే ఎక్కేస్తుంది. మరీ ముఖ్యంగా శ్రీలీల ప్లేస్‌లో హీరోయిన్‌గా ఎంపికైన భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) ఈ పాటలో లంగా వోణీతో చూపరులను ఆకర్షిస్తోంది. ఆమె డ్యాన్స్ మూమెంట్స్, సిగ్నేచర్ స్టెప్ అన్నీ కూడా నిజంగా వారెవా అనేలా ఉన్నాయి. అఖిల్ కూడా ఊర మాస్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే వచ్చిన టీజర్ ఆ విషయం తెలియజేయగా, తాజాగా వచ్చిన పాటలో కూడా ఆయన అదే మాస్ లుక్‌లో కనిపించి, ఈసారి కొత్తగా ట్రై చేస్తున్నాడనే ఫీల్‌ని ఇచ్చారు. ఎందుకంటే, ఇప్పటి వరకు అఖిల్ లవర్ బాయ్ పాత్రలే వేస్తూ వచ్చారు. ఈ సినిమాతో తనలోని మాస్‌ని ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు. నాగార్జునకు ‘శివ’ ఎలానో.. అఖిల్‌కు ‘లెనిన్’ అలా అవుతుందని అక్కినేని అభిమానులంతా ఎంతగానో వేచి చూస్తున్నారు.

Also Read- Ravi Teja BMW: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ట్రైలర్ రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్.. ఎప్పుడంటే?

రొమాంటిక్ ఫీల్‌‌లోకి.. వారెవా!

ఇక ఈ పాట మ్యూజిక్ ల‌వ‌ర్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్‌ను రాబడుతోంది. ఈ పాట‌కు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా.. శ్వేతా మోహ‌న్‌, జుబిన్ నౌటియాల్, థమన్ త‌మ వాయిస్‌తో పాట‌కు ఓ ఎమోష‌న‌ల్ ఫీల్‌ను తీసుకొచ్చారు. మ్యూజికల్ సెన్సేష‌న‌ల్ ఎస్‌.ఎస్‌. థమన్ సంగీతం సార‌థ్యంలో వచ్చిన ఈ పాట‌ రొమాంటిక్ ఫీల్‌ను క‌లిగిస్తోంది. సినిమాలోని భావోద్వేగాలను తెలియజేస్తూ, లీడ్ పెయిర్ ఇద్దరి మధ్య కెమిస్ట్రీని హైలైట్ చేసేలా పాట ఉంది. దీంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. ఈ పాట విడుదల సందర్భంగా అఖిల్ అక్కినేని ఇన్‌స్టా వేదికగా లిరిక్ రైటర్, సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్‌కు థ్యాంక్స్ చెప్పారు. ప్రస్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్‌ను పూర్తి చేసుకుంటోన్న ఈ సినిమా ఇప్ప‌టి వ‌ర‌కు 70 శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుందని, మూవీని సమ్మర్‌లో రిలీజ్ చేస్తామని మేక‌ర్స్ తెలిపారు. ప్రస్తుతం ఈ సాంగ్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

CM Chandrababu Naidu: పోలవరానికి అడ్డుపడడం కరెక్టేనా? గోదావరి మిగులు జలాలపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

YS Jagan on CM Chandrababu: స్వలాభం కోసం.. జన్మనిచ్చిన సీమకే అన్యాయం.. చంద్రబాబుపై జగన్ ఫైర్

SKN Comments: ఇండస్ట్రీ పెద్దలకు ఎస్కేఎన్ ఓ విన్నపం.. ‘ది రాజాసాబ్’ థియేటర్లు ఇవ్వండి..

Telangana Politics: ఆ మూడు పార్టీల్లోనూ ఇదే వైఖరి.. హద్దులు మీరుతున్న నేతల విమర్శలు!

BRS Party: గ్రామాల్లో పట్టు సడలకుండా గులాబీ నేతల విశ్వ ప్రయత్నాలు.. క్యాడర్ ఆ పార్టీ చేతికి చిక్కకుండా ప్లాన్!