Gas Leakage: ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. ఓన్‌జీసీ గ్యాస్ పైప్ లీకై భారీ ఎత్తున మంటలు ఎగసిబడుతున్నాయి. మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలోని డ్రిల్ సైట్ లో ఈ ఘటన జరిగింది. గ్యాస్ పైప్ నుంచి దట్టమైన పొగరూపంలో గ్యాస్ లీకైనట్లు తెలుస్తోంది. ఆ వెంటనే పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడినట్లు సమాచారం. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి ఒక్కసారిగా పరుగులు పెట్టారు. ఓన్‌జీసీ గ్యాస్ పైప్ లీక్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
ఓన్‌జీసీ గ్యాస్ లీక్ ఘటన నేపథ్యంలో కార్మిక శాఖ మంత్రి సుభాష్ అప్రమత్తమయ్యారు. కోనసీమ జిల్లా కలెక్టర్, కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు. ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు. మరోవైపు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ ను ఆదేశించారు. మరోవైపు భారీగా ఎగసిపడుతున్న మంటలను తక్షణమే అదుపులోకి తీసుకొని రావాలని మంత్రి సుభాష్ సూచించారు.
మలికిపురం మండలంలో గ్యాస్ బ్లో అవుట్ పై కార్మిక శాఖ మంత్రి సుభాష్ ఆరా
కలెక్టర్, కంపెనీ ప్రతినిధులతో మాట్లాడిన మంత్రి సుభాష్
ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశం
సురక్షిత ప్రాంతాలకు ప్రజలు తరలించాలని కలెక్టర్ కు ఆదేశాలు
తక్షణమే మంటలు అదుపులోకి తెచ్చేలా చూడాలన్న మంత్రి… https://t.co/onrTQhi62K pic.twitter.com/TeZ5PllDAC
— BIG TV Breaking News (@bigtvtelugu) January 5, 2026
ఇరుసుమండ గ్రామంలో ఉత్పత్తిలో ఉన్న ఓఎన్‌జీసీ బావి ఆగిపోవడంతో.. మరమ్మత్తు పనులు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఒక్కసారిగా గ్యాస్ లీకైనట్లు సమాచారం. చూస్తుండగానే గ్యాస్ పొగమంచు రూపంలో గ్రామం మెుత్తం విస్తరించిందని స్థానికులు చెబుతున్నారు. సర్పంచ్ కుమారుడు రమేష్ మాట్లాడుతూ.. ఫైర్ అవ్వడానికి పెద్ద ఎత్తున పొగ కమ్మేసినట్లు పేర్కొన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని తామంతట తామే అప్రమత్తమైనట్లు తెలిపారు. ఓన్జీసీ లీకేజీకు సమీపంలో ఉన్న వారిని బైక్స్ పైన పక్క ఊర్లకు తరలించినట్లు చెప్పారు.
Also Read: TG Medical Council: మెడికల్ కౌన్సిల్, సర్కార్ మధ్య వివాదం.. చిచ్చు పెట్టిన జీవో 229.. అసలు కారణం అదేనా?
ఇరుసుమండ గ్రామంతో పాటు చుట్టుపక్కల ఊర్లను సైతం అప్రమత్తం చేసినట్లు సర్పంచ్ కుమారుడు రమేష్ తెలిపారు. ఈ క్రమంలోనే ఎంపీ కూడా వచ్చారని.. ఆయనకు సమస్యను వివరిస్తుండగా ఒక్కసారిగా బ్లాస్ట్ జరిగిందని స్పష్టం చేశారు. ఇప్పటివరకూ 300 కుటుంబాలను గ్రామం నుంచి తరలించినట్లు తెలిపారు. మెుత్తంగా ఈ ఓన్జీసీ గ్యాస్ కారణంగా తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు రమేష్ అన్నారు. ప్రజల ప్రాణాలతో ఆ కంపెనీ ఆటలాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మంటలను అదుపుచేసేందుకు ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నట్లు ఆయన వివరించారు.

