Poonam Kaur: పూనమ్‌ని బెదిరించిన కడప వ్యక్తులెవరు?
Poonam Kaur (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Poonam Kaur: అశ్లీల వీడియోలు రిలీజ్ చేస్తామని.. పూనమ్‌ని బెదిరించిన కడప వ్యక్తులెవరు?

Poonam Kaur: చాలా గ్యాప్ తర్వాత పూనమ్ కౌర్ (Poonam Kaur) మీడియా ముందుకు వచ్చింది. తాజాగా ఆమె ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు. ఒక డైరెక్టర్ పేరు చెప్పలేదు కానీ, ‘గురు’ (Guru) అని మెన్షన్ చేస్తూ.. చాలా విషయాలను ఆమె పంచుకున్నారు. ‘జల్సా’ (Jalsa) సినిమా విషయంలో ఏవేవో క్రియేట్ చేశారని, అప్పటికి తను ఇంకా ఇండస్ట్రీలోకే రాలేదని తెలిపారు. కానీ, ఆ సినిమా పేరుతో నా కెరీర్‌ని సర్వనాశనం చేశారని పూనమ్ పేర్కొన్నారు. తన లైఫ్‌లో గురు అనే వ్యక్తి ఒక ప్రామిస్ చేసి, తప్పారని.. దానిపైనే పోరాటం చేస్తున్నానని ఆమె మరింత వివరణ ఇచ్చారు. ‘నీ లైఫ్‌లో తోడుంటా’ అని మాటిచ్చిన మనిషి.. నేను హోమ్ మేకర్‌గా ఉండాలని, పిల్లలు కావాలని అడగగానే.. ‘నువ్వు చస్తే ఒక్కరోజే గుర్తు పెట్టుకుంటారు’ అనే స్థాయికి వచ్చారని ఆమె చెబుతున్న వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇక సినిమా యాక్టర్ అంటూ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తావనను కూడా ఆమె తీసుకొచ్చింది.

Also Read- Anil Ravipudi: సెలబ్రేట్ ద మెగాస్టార్.. మెగా రైడ్ ఎలా ఉంటుందో చూస్తారు

పోసాని మాటలతో పెళ్లి ఆగిపోయింది

ఒక యాక్టర్‌ని బ్లేమ్ చేయాలని నా దగ్గరకు కొందరు వచ్చి బెదిరించారని, నా దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారని పూనమ్ చెప్పుకొచ్చింది. అయితే ఆ యాక్టర్‌పై మాత్రం ఆమె ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ చేయలేదు. కేవలం ‘గురు’ అని ఇండస్ట్రీలో పిలుచుకునే వ్యక్తి వల్లే తన కెరీర్ నాశనమైందని అన్నారు. అంతేకాకుండా, పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) మీడియా సమావేశంలో వాగిన కామెంట్స్‌తో తను కోరుకున్న పెళ్లి కూడా ఆగిపోయిందని తెలిపారు. పోసాని మీడియా సమావేశం పెట్టి, తన గురించి ఏదేదో మాట్లాడారని, అందులో నిజం ఉందా? లేదా? అనేది పక్కన పెడితే.. అదే సమయంలో కోరుకున్న వ్యక్తితో పెళ్లి ఆగిపోయిందని అన్నారు. ఇక యాక్టర్‌ని బ్లేమ్ చేయాలని తన దగ్గరకు వచ్చిన వారి గురించి పూనమ్ చెబుతూ..

Also Read- Akhanda 2 OTT: ‘అఖండ 2’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్.. పండక్కి పండగే!

అశ్లీల వీడియోలు విడుదల చేస్తాం

‘‘ఒక రోజు నా దగ్గరు కొంతమంది వచ్చి, కడప నుంచి వచ్చామని చెప్పారు. నా దగ్గరకు రాగానే మేము కడప నుంచి వచ్చామని చెప్పారు. అసలు వాళ్లెవరో, ఎందుకు వచ్చారో నాకు అర్థం కాలేదు. సరే వచ్చారు కదా.. అని నమస్కారం అని చెప్పాను. అందులో కొందరు ఇండస్ట్రీకి చెందిన వారు కూడా ఉన్నారు. ‘మాకు ప్రూఫ్స్ ఇవ్వండి. మీ దగ్గర ఏవో వీడియోలు ఉన్నాయట’ కదా అని అడిగారు. వెంటనే నమస్తే చెప్పి.. నాకు అవసరం ఉన్నప్పుడు కాల్ చేస్తానండి.. థ్యాంక్యూ వెరీ మచ్ అని చెప్పాను. వాళ్లకి ఏం కావాలి? వాళ్లని తిట్టాల్సిన అవసరం నీకు లేదు కదా! నువ్వు ఎస్ చెప్పలేదు, నో చెప్పలేదు. ఇక్కడ ఇంకో చెత్త విషయం కూడా చెప్పాలి. నాకు కాల్ చేసి, ‘మనీ కావాలా? పదవి కావాలా? అని అడిగారు’. నేను ఏం మాట్లాడపోవడంతో బెదిరించడం మొదలుపెట్టారు. ఈ మూడు తర్వాత మరింత దిగజారి మాట్లాడారు. ఈ విషయం నా ఫ్యామిలీ మెంబర్స్‌కు తప్ప.. ఇప్పటి వరకు ఎవరికీ చెప్పలేదు. ఇప్పుడే చెబుతున్నాను. ‘ఆ యాక్టర్ గురించి నువ్వు వ్యతిరేకంగా మాట్లాడకపోతే.. నీ అశ్లీల వీడియోలు సోషల్ మీడియాలో, మార్కెట్‌లో విడుదల చేస్తాం’ అని బెదిరించారు’’ అని పూనమ్ కౌర్ ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఆమె ఈ ఇంటర్వ్యూ తర్వాత కడప నుంచి వచ్చి, ఆమెను బెదిరించిన వ్యక్తులు ఎవరా? అని అంతా కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయమై ఏపీకి చెందిన ఓ రాజకీయ నాయకుడి పేరు బాగా వైరల్ అవుతోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gutha Sukender Reddy: కృష్ణా జలాలపై బీఆర్ఎస్ అశ్రద్ధ.. గోదావరిపై చూపిన శ్రద్ధ చూపలేదు : గుత్తా సుఖేందర్ రెడ్డి!

Tourism Department: హరిత హోటళ్లపై కొరవడిన పర్యవేక్షణ.. నష్టాల బాటకు కారణమవుతున్న అధికారులు?

Seetha Payanam: ‘అస్సలు సినిమా’ ముందుందంటోన్న అర్జున్ కుమార్తె..

Megastar Chiranjeevi: రామ్ చరణ్‌కు ఏదయితే చెప్పానో.. సుస్మితకు కూడా అదే చెప్పా..

Chiranjeevi: సంక్రాంతి మనదే అంటే నాది ఒక్కడిదే కాదు.. అందులో వాళ్లంతా ఉన్నారు