Srinivas Goud: చట్టసభల్లో మహిళాలకు జనాభా ప్రాతిపదికన
Srinivas Goud (image credit: swetcha reporter)
Telangana News

Srinivas Goud: చట్టసభల్లో మహిళాలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

Srinivas Goud: చట్ట సభలలో మహిళలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud)డిమాండ్ చేశారు. కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులోని నిమ్హాన్స్ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించిన కర్ణాటక మహిళా నారీ శక్తి రాష్ట్ర స్థాయి సమ్మేళనం లో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి సుమారు 80 సంవత్సరాలు గడిచినా ప్రతిరోజూ మహిళలు అగౌరవం, అత్యాచారాలు, దాడులు ఎదుర్కొంటున్నారని, మహిళా చట్టాలు ఉన్నప్పటికీ వాటి అమలు సరిగా జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల పట్ల జరిగే అనుకోని సంఘటనలు, అత్యాచారాలు, వరకట్న వేధింపులు మరియు తదితర కేసుల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి 2 నెలల వ్యవధిలో న్యాయం అందేలా చర్యలు తీసుకోనీ, కఠినమైన శిక్షలు ఉండాలని డిమాండ్ చేశారు.

Also Read: Srinivas Goud: పాలమూరు పచ్చబడితే కాంగ్రెస్ కళ్ళు ఎర్రబడ్డాయి: శ్రీనివాస్ గౌడ్

మహిళల్లో చైతన్యం తెప్పించాలి

జనాభాలో 50 శాతం మహిళలు ఉన్నప్పుడు వారికి 50% రిజర్వేషన్లు ఉండాలి, కానీ చట్టసభల్లో 33 శాతం మాత్రమే మహిళా రిజర్వేషన్లు తేవడం జరిగిందని, దానిని వెంటనే అమలులోకి తెచ్చి మహిళా సాధికారతకు అవసరమైన చట్టాలు తయారు చేసి అమలు చేయాలని పేర్కొన్నారు. అలాంటప్పుడే మహిళలు నిజమైన స్వాతంత్ర్యం పొందుతారని అన్నారు. ఇలాంటి మహిళా సమ్మేళనాలు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో జరిగి మహిళల్లో చైతన్యం తెప్పించాలని ఆకాంక్షించారు. ఇలాంటి సమ్మేళనాలు మహిళా సాధికారత, భద్రత, సమాన హక్కులపై చర్చించే వేదికగా నిలిచి, మహిళా శక్తిని బలోపేతం చేసేందుకు దోహదపడిందన్నారు.ఈ కార్యక్రమంలో కర్ణాటక రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగా రెడ్డి, విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప, ఎంపీ శ్రీనివాస్ పూజారి, కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డా. నాగలక్ష్మి, మహిళా అధ్యక్షురాలు అమిత తదితరులు పాల్గొన్నారు.

Also Read: Srinivas Goud: ఆరు గ్యారంటీలు అమలు చేయనందుకు విజయోత్సవాలా? మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్!

Just In

01

Telangana Govt: విద్యుత్ సబ్సిడీల్లో అన్నదాతదే అగ్రభాగం.. వ్యవసాయ రంగానికి రూ.13,499 కోట్లు!

Akhil Akkineni: అఖిల్ అక్కినేని గురించి ప్రొడ్యూసర్ చెప్పింది వింటే గూస్‌బంప్స్ రావాల్సిందే..

Thummala Nageswara Rao: యూరియా కొరత లేదు.. ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తే తాట తీస్తాం.. మంత్రి తుమ్మల ఫైర్!

Jana Nayagan: విజయ్ ‘జన నాయకుడికి’ చివరినిమిషంలో కొర్రీలు పెడుతున్న సెన్సార్ బోర్డ్.. ఎందుకంటే?

GHMC: జీహెచ్‌ఎంసీలో విలీన ప్రాంతాలకు మహర్దశ.. బడ్జెట్‌లో రూ.2,260 కోట్లు కేటాయింపు!