Srinivas Goud: పది శాతం పనులు పూర్తి చేస్తే పూర్తయ్యే పాలమూరు రంగారెడ్డి ని ఎందుకు పూర్తి చేయలేదో సీఎం చెప్పాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్ లో మంగళవారం మీడియాతో మాట్లాడారు. రెండేళ్ల పాలన లో చేసింది, చేయబోయేది విజయోత్సవాల్లో చెప్పాలి గానీ ఎప్పటి మాదిరిగానే కేసీఆర్ (KCR)ను తిట్టడాన్నే సీఎం పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. మంచి పనులు చేయలేదు కనుకే సీఎం సభకు జనం రాలేదన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ (Brs) పాలన లో ఏమీ చేయలేదని సీఎం పచ్చి అబద్దాలు మాట్లాడారని మండిపడ్డారు.
Also Read: Srinivas Goud: ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగడతాం : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
హామీలిచ్చి మోసం చేసినందుకా?
ఆరు గ్యారంటీలు అమలు చేయనందుకు విజయోత్సవాలు చేసుకుంటున్నారా ? అన్ని వర్గాలకు హామీలిచ్చి మోసం చేసినందుకా? డిక్లరేషన్లు అమలు చేయనందుకా? బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు ఎగ్గొట్టినందుకా? 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వనందుకా? రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు తేనందుకా? అని ప్రశ్నించారు. సీఎం ఫుట్ బాల్ ఆడటం కాదు .మంత్రులు ఆందరూ ఫుట్ బాల్ ఆడినా మాకు అభ్యంతరం లేదు.
కేసీఆర్ ,కేటీఆర్ లను తిట్టడమే పనా?
హామీలు అమలు చేసి ఆటలు ఆడుకోండి అని నిలదీశారు. హామీలు అమలు చేయకుండా ఎంత సేపు కేసీఆర్ ,కేటీఆర్ (KCR) లను తిట్టడమే పనా ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు అవగాహనా లేకుండా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో పాలమూరు అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని వెల్లడించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, మాజీ మంత్రి జోగు రామన్న ,మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ,బీ ఆర్ ఎస్ నేతలు సుమిత్రానంద్ ,సుశీలా రెడ్డి పాల్గొన్నారు.
Also Read: Srinivas Goud: ప్రజా పాలన అంటే అరెస్టులు చేయించడమా: శ్రీనివాస్ గౌడ్
