DSP Recreates: ‘దేఖలేంగే సాలా’ రీ క్రియేషన్‌ రాక్‌స్టార్ అదరగొట్టాడు
dsp-re-creation
ఎంటర్‌టైన్‌మెంట్

DSP Recreates: ‘దేఖలేంగే సాలా’ పాట రీ క్రియేషన్‌తో ఊపేస్తున్న రాక్‌స్టార్.. ఏమాత్రం తగ్గలేదు..

DSP Recreates: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఇటీవల్ ఈ సినిమా నుంచి విడుదలైన దేఖలేంగే సాలా సంగ్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. తాజాగా ఈ పాటను ఆ సినిమా సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ రీ క్రియేట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అసలే ఓజీ హిట్ తో మంచి ఫామ్ లో ఉన్న పవన్ కళ్యాణ్ కు అదిరిపోయే సాంగ్ అందించారు దేవీ శ్రీ ప్రసాద్. అక్కడితో ఆగిపోకుండా ఆ పాటను రీ క్రియేట్ చేసి తనలో ఉన్న డాన్సర్ ను కూడా బయటకు తీశారు. దీంతో ఈ సాంగ్ రీక్రియేషన్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది.

Read also-Sharwanand Vishnu: శర్వానంద్ మూవీలో శ్రీ విష్ణు కామియో.. ఇక థియోటర్లో నవ్వులే..

దేవీ మ్యాజిక్

సాధారణంగా దేవి శ్రీ ప్రసాద్ సాంగ్స్ అంటేనే ఒక తెలియని ఎనర్జీ ఉంటుంది. కానీ, ఈసారి ఆయన కేవలం సంగీత దర్శకుడిగానే కాకుండా, స్క్రీన్ ముందు తన పెర్ఫార్మెన్స్‌తో కూడా అదరగొట్టారు. ‘దేఖ్లేంగే సాలా’ పాటను ప్రత్యేకంగా రీక్రియేట్ చేస్తూ ఒక ప్రమోషనల్ వీడియోను విడుదల చేశారు. ఇందులో DSP తనదైన స్టెప్పులతో, అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాటలోని జోష్‌ను రెట్టింపు చేశారు. ఈ వీడియోలో విజువల్స్ అత్యంత గ్రాండ్‌గా ఉన్నాయి. కలర్ ఫుల్ సెట్టింగ్స్, లైటింగ్ DSP ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ స్పెషల్ వీడియో కేవలం ప్రమోషన్ కోసమే కాకుండా, సినిమాలోని ఎనర్జీని ప్రేక్షకులకు ముందే పరిచయం చేసేలా ఉంది.

Read also-Anvesh Controversy: గరికిపాటిపై రెచ్చిపోయిన యూట్యూబర్ అన్వేష్.. ఏయ్ జూడ్ నెక్స్ట్ నువ్వే..

ఈప్పటికే ఈ పాట్ చాట్ బాస్టర్గా మారింది. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వేదికల్లో ఈ వీడియో చూసిన నెటిజన్లు “రాక్‌స్టార్ బ్యాక్ విత్ ఏ బ్యాంగ్” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ పాటను తమ సోషల్ మీడియా స్టేటస్‌లతో హోరెత్తిస్తున్నారు. సినిమా ఇంకా షూటింగ్ దశలో ఉన్నప్పటికీ, ఇలాంటి ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై హైప్‌ను అమాంతం పెంచేస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే మరిన్ని అప్‌డేట్స్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. DSP చేసిన ఈ రీక్రియేషన్ కేవలం ఆరంభం మాత్రమేనని, సినిమాలో అసలైన ట్రీట్ వేరే లెవల్లో ఉంటుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. మరి ఈ సారి హరీష్ శంకర్ ఏం మ్యాజిక్ చేస్తారో చూడాలి మరి.

Just In

01

GHMC: జీహెచ్‌ఎంసీలో విలీన ప్రాంతాలకు మహర్దశ.. బడ్జెట్‌లో రూ.2,260 కోట్ల కేటాయింపు!

Vedire Sriram: పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుతో ఏపీకి నీటిని తరలించింది.. పదేళ్లలో బీఆర్ఎస్ ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు!

Akhanda 2: బోయపాటి ఇంటిని చుట్టుముట్టిన బయ్యర్లు.. నష్టాన్ని భరించేది ఎవరు?

Big Academy – Yuvraj Singh: వైఫల్యం చెందకపోతే ఎలా గెలవాలో తెలియదు.. బిగ్ అకాడమీ లాంఛింగ్‌లో యువరాజ్ సందేశం

HYD Water Supply: బీ అలర్ట్.. 8, 9 తేదీల్లో ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం