Sharwanand Vishnu: టాలీవుడ్ యువ హీరోలలో విలక్షణమైన నటనతో, విభిన్నమైన కథాంశాలతో దూసుకుపోతున్న నటులు శర్వానంద్, శ్రీ విష్ణు. వీరిద్దరూ ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే ఆ వినోదం రెట్టింపు అవుతుందనడంలో సందేహం లేదు. సంక్రాంతి బరిలో నిలుస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రంతో ఈ క్రేజీ కాంబినేషన్ సాకారం కాబోతోంది. తాజాగా దీనికి సంబంధించిన స్పెషల్ వీడియోను విడుదల చేశారు నిర్మాతలు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
టెక్నికల్గా..
ఈ సినిమాలో శర్వానంద్ సరసన సంయుక్త మీనన్, సాక్షి వైద్య నటిస్తుండగా, శ్రీ విష్ణు ఒక ప్రత్యేకమైన కీలక పాత్రలో కనిపించనున్నారు. సమాచారం ప్రకారం, కథా గమనాన్ని మలుపు తిప్పే సందర్భంలో శ్రీ విష్ణు ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది. ‘సామజవరగమన’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన దర్శకుడు రామ్ అబ్బరాజు, శ్రీ విష్ణు కోసం ఒక హిలేరియస్, ఇంపాక్ట్ ఇచ్చే పాత్రను డిజైన్ చేశారట. శర్వానంద్ మార్కు టైమింగ్, శ్రీ విష్ణు సహజసిద్ధమైన కామెడీ తోడైతే థియేటర్లలో నవ్వుల పూత పూయడం ఖాయం అంటున్నారు మూవీ టీం.
Read also-Alleti Maheshwar Reddy: కృష్ణా జలాలపై మాట్లాడే అవకాశం మాకు ఇవ్వలేదు: ఏలేటి మహేశ్వర్ రెడ్డి
ప్రేమకథలో సరికొత్త మలుపు..
ఈ చిత్రం ప్రధానంగా ఒక యువకుడు తన మాజీ ప్రియురాలు, తనకు కాబోయే భార్య మధ్య నలిగిపోయే వినోదాత్మక ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతోంది. ఇద్దరు భామల మధ్య చిక్కుకున్న ‘మురారి’కి, శ్రీ విష్ణు పాత్ర ఎలాంటి సాయం చేసింది? లేదా అతని సమస్యను మరింత పెంచిందా? అన్నదే ఈ సినిమాలో అసలైన ట్విస్ట్ అన్నట్లుగా సమాచారం. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. జ్ఞానశేఖర్ వి.ఎస్ విజువల్స్ సినిమాకు రిచ్ లుక్‌ను తీసుకురానున్నాయి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14, 2026 న విడుదల చేయనున్నారు. శ్రీ విష్ణు ఈ మధ్య కాలంలో ‘ఓం భీమ్ బుష్’ వంటి చిత్రాలతో తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు శర్వానంద్ లాంటి నటుడితో జతకట్టడం ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. సంక్రాంతి సీజన్‌లో కుటుంబ సమేతంగా చూడదగ్గ పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ‘నారీ నారీ నడుమ మురారి’ నిలుస్తుందని ట్రేడ్ వర్గాల టాక్.
A special addition, a special announcement! 📢
The stage is set to welcome King of Entertainment @sreevishnuoffl into #NariNariNadumaMurari 😍❤️🔥
Get ready for laughter overload! 😂🔥
Catch it in theatres from Jan 14 | 5:49 PM onwards ✨🍿
Charming Star @ImSharwanand… pic.twitter.com/XrmD6fRh5b
— AK Entertainments (@AKentsOfficial) January 4, 2026

