Alleti Maheshwar Reddy: బీజేపీ నేతలు సభ నుంచి వాకౌట్ చేశారు. కృష్ణా జలాల అంశంపై తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదంటూ ఎమ్మెల్యేలంతా బయటకు వచ్చేశారు. ఈ సందర్భంగా బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy) మాట్లాడుతూ, సీఎం మాట్లాడే ముందు తమకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్(Congress) తరపున 25 ఎమ్మెల్యేలు మాట్లాడారని, కానీ, బీజేపీ నుంచి ఓకే సభ్యుడికి మాట్లాడే అవకాశం ఇచ్చారని, అది కూడా15 నిమిషాలు కూడా సమయం ఇవ్వలేదన్నారు.
ఇందుకు నిరసనగా..
బీజేపీ నుంచి ఇద్దరికీ అవకాశం ఇస్తానని చివరకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో బీఆర్ఎస్ ఎలాగూ లేనే లేదని, ప్రతిపక్షంగా తమకు మాట్లాడే అవకాశం ఇవ్వచ్చు కదా? అని ఏలేటి ప్రశ్నించారు. ఎంఐఎం, సీపీఐతో కాంగ్రెస్.. డబ్బా కొట్టించుకుందని ఏలేటి ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీకి మాత్రం ఛాన్స్ ఇవ్వలేదన్నారు. ఇందుకు నిరసనగా తాము సభ నుంచి వాకౌట్ చేసినట్లు చెప్పారు. సభను భజన మండలిగా మార్చారని మహేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణకు పటేల్ వరమైతే, నెహ్రూ ఒక శాపమని మండిపడ్డారు. తెలంగాణను పటేల్ రజాకర్ల చెర నుంచి విడిపిస్తే, నెహ్రూ తెలంగాణను ఆంధ్రాలో కలిపారని, దానివల్లే జల దోపిడీ జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాటి నెహ్రూ తప్పిదాల వల్లే జల దోపిడీకి శ్రీకారం పడిందని ఏలేటి విమర్శించారు.
Also Read: GHMC Payments: అక్రమాలకు చెక్.. బల్దియాలో నగదు చెల్లింపులు బంద్.. కమిషనర్ సంచలన ఆదేశాలు
త ప్రభుత్వం తప్పిదాలు
కేసీఆర్ పాలనలో నిధులన్నీ సాగు నీటి ముసుగులో మహా దోపిడీకి గురయ్యాయన్నారు. అదే ముసుగులో కాంగ్రెస్ నడుస్తున్నదని ఫైర్ అయ్యారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని దురాశతో కేసీఆర్ సాగు నీటిని ఆంధ్రప్రదేశ్‌కు ధారాదత్తం చేస్తే, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం గుత్తేదారుల జేబులు నింపడానికి ప్రయత్నం చేస్తున్నదని ధ్వజమెత్తారు. నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాల్వలను తప్పిదంగా నిర్మించడం వల్లే జల దోపిడీ జరుగుతున్నదన్నారు. వాస్తవాలను ముఖ్యమంత్రి అంగీకరించే పరిస్థితుల్లో లేరని ఏలేటి విమర్శించారు. రేవంత్ షేర్వాణీకి భయపడుతున్నారని చురకలంటించారు. పాలమూరు, రంగారెడ్డిలో గత ప్రభుత్వం తప్పిదాలు చేస్తే, విచారణకు ఎందుకు ఆదేశించలేదని ప్రశ్నించారు. పాలమూరు, రంగారెడ్డిపై ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాస్తానని, అందుకు ఆయన సమాధానాలు చెప్పాలని ఏలేటి తెలిపారు.

