Jana Nayakudu Trailer Trolled: జననాయకుడు ట్రైలర్‌లో ఏంటివి..
jana-nayakudu-trolling
ఎంటర్‌టైన్‌మెంట్

Jana Nayakudu Trailer Trolled: విజయ్ ‘జన నాయకుడు’ ట్రైలర్‌లో ఈ తప్పును చూశారా.. తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

Jana Nayakudu Trailer Trolled: దళపతి విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘జన నాయకుడు’. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది. మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతుంది. అయితే అదే స్థాయిలో ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. ఎందుకు అంటే ఈ సినిమా తెలుగు లో బాలయ్య బాబు నటించిన అనిల్ రావిపూడి దర్శకత్వలో రూపొందిన భగవంత్ కేసరి సినిమాను పోలి ఉంది. దాదాపు అన్ని పాత్రలు, సీన్లు అలాగే ఉన్నాయి. అయితే దీని గురించి ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. దీంతో ఈ సినిమా రిమేక్ అంటూ అభిప్రాయపడుతున్నారు ప్రేక్షకులు. ఇదిలా ఉంచితే ట్రైలర్ లోని ఓ సందర్భంలో ఏఐ జనరేటెడ్ వీడియో వాడేశారు. దానికి సంబంధించిన మార్క్ కూడా అలానే ఉండిపోయింది. దీనిని చూసిన నెటిజన్లు కనీసం ఏఐ కొనుక్కోవడానికి డబ్బులు కూడా లేవా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read also-Allu Lokesh: పుష్పరాజ్‌తో జతకట్టబోతున్న కనకరాజ్‌!.. ప్రొడ్యూసర్ ఎవరంటే?

‘భగవంత్ కేసరి’ పోలికలు..

ట్రైలర్ చూసిన చాలా మంది నెటిజన్లు, ఇది నందమూరి బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ చిత్రం ‘భగవంత్ కేసరి’ని పోలి ఉందని అభిప్రాయపడుతున్నారు. తండ్రిలాంటి బాధ్యత కలిగిన ఒక వ్యక్తి, ఒక అమ్మాయిని ధైర్యవంతురాలిగా మార్చడం లేదా సమాజానికి వ్యతిరేకంగా పోరాడటం వంటి అంశాలు భగవంత్ కేసరిలో ప్రధానంగా కనిపిస్తాయి. ‘జన నాయకుడు’ ట్రైలర్‌లో కూడా కొన్ని సన్నివేశాలు, విజయ్ మేనరిజమ్స్ పాత్ర నేపథ్యం అలాగే ఉన్నాయని నెటిజన్లు పోలుస్తున్నారు. అయితే, ఇది రీమేక్ అని చిత్ర బృందం అధికారికంగా ఎక్కడా ప్రకటించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

Read also-Ashish Accident: రోడ్డు ప్రమాదానికి గురైన నటుడు ఆశిష్ విద్యార్థి, ఆయన భార్య రూపాలీ.. ఇప్పుడు ఎలా ఉన్నారంటే?

జెమిని ఏఐ వివాదం..

ట్రైలర్‌లో ఒకచోట విజువల్స్ చూస్తుంటే జెమిని ఏఐ వంటి ఏఐ టూల్స్ వాడినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.300 కోట్లు బడ్జెట్ పెట్టము అంటున్నారు. అలాంటప్పుడు ఇది కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవా అంటూ వీడియో కింద కామెంట్లు పెడుతున్నారు. నేటి కాలంలో టెక్నాలజీ వాడకం తప్పు కాకపోయినా, ఇంత పెద్ద సినిమాపై ఇలాంటి చిన్న తప్పుకు కూడా బూతద్దంలో కనిపిస్తాయి. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత లేదా అంటూ విజయ్ ఫ్యాన్ మండిపడుతున్నారు. విజయ్ సినిమాలకు సాధారణంగా బాక్సాఫీస్ వద్ద భారీ డిమాండ్ ఉంటుంది. ఈ సినిమా కూడా 1000 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరుతుందని అంచనాలు ఉన్నాయి. అయితే నెటిజన్లు మాత్రం, ఇంతటి ప్రతిష్టాత్మిక సినిమాకు చీప్ ట్రిక్స్ చేస్తే బాగోదంటూ కితాబు ఇస్తున్నారు. కేవలం స్టార్ డమ్ మీద ఆధారపడి కంటెంట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జనవరి 9, 2026న విడుదల కానుంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి మరి.

Just In

01

GHMC: జీహెచ్‌ఎంసీలో విలీన ప్రాంతాలకు మహర్దశ.. బడ్జెట్‌లో రూ.2,260 కోట్ల కేటాయింపు!

Vedire Sriram: పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుతో ఏపీకి నీటిని తరలించింది.. పదేళ్లలో బీఆర్ఎస్ ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు!

Akhanda 2: బోయపాటి ఇంటిని చుట్టుముట్టిన బయ్యర్లు.. నష్టాన్ని భరించేది ఎవరు?

Big Academy – Yuvraj Singh: వైఫల్యం చెందకపోతే ఎలా గెలవాలో తెలియదు.. బిగ్ అకాడమీ లాంఛింగ్‌లో యువరాజ్ సందేశం

HYD Water Supply: బీ అలర్ట్.. 8, 9 తేదీల్లో ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం