Ashish Accident: ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి, ఆయన భార్య రూపాలీ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటన అస్సాం రాజధాని గువహటిలోని జి.ఎస్. రోడ్ (G.S. Road) ప్రాంతంలో చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి వీరు ఒక హోటల్‌లో భోజనం ముగించుకుని బయటకు వచ్చి రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆశిష్ విద్యార్థి రూపాలీ రోడ్డు దాటుతుండగా, ఒక మోటార్ సైకిల్ వేగంగా వచ్చి వారిని ఢీకొట్టింది. ఈ ప్రభావంతో ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు. రూపాలీకి కాస్త బలమైన గాయాలే తగిలాయి, ఆశిష్ విద్యార్థికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు మరియు అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు వారిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో రకరకాలుగా రావడంతో ఆశిష్ విద్యార్థి స్వయంగా ఆసుపత్రి నుండే వీడియో విడుదల చేశారు. ఇందులో అసలు ఏం జరిగింది అన్నది చెప్పుకొచ్చారు.
Read also-Mandadi Movie: విడుదలకు సిద్ధమవుతున్న సుహాస్ ‘మండాడి’.. హైలెట్‌గా సెయిల్ బోట్ రేసింగ్..
వీడియోలో ఏం చెప్పారు అంటే “మేము క్షేమంగానే ఉన్నాము. ఇది ఒక దురదృష్టకర సంఘటన. నేను నిలబడగలను, మాట్లాడగలను” అని తన ఆరోగ్యం గురించి క్లారిటీ ఇచ్చారు. ఆయన భార్య రూపాలీ గురించి మాట్లాడుతూ.. ఆమెకు కొన్ని గాయాలయ్యాయని, వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. వీరితో పాట తమను ఢీకొట్టిన వ్యక్తి కూడా గాయపడ్డాడని, అతనికి కూడా చికిత్స అందుతోందని ఆశిష్ పేర్కొన్నారు. ఎవరినీ నిందించే ఉద్దేశం తనకు లేదని ఆయన మాటల్లో వ్యక్తమైంది. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. వైద్యుల సూచన మేరకు మరికొన్ని రోజులు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది. గువహటి పోలీసులు ఈ ఘటనపై ప్రాథమిక విచారణ చేపట్టారు. ఆశిష్ విద్యార్థి తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితులు. పోకిరి వంటి అనేక సినిమాల్లో నటించారు, కాబట్టి ఈ వార్త తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశమైంది. అభిమానులు వారు త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు.
Read also-Shivaji Controversy: హీరోయిన్ దుస్తుల వివాదంపై సుమన్ చెప్పింది ఇదే.. వారు ఏం చేసేవారంటే?
ఇక ఆయన గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే.. తండ్రి కేరళకు చెందిన మలయాళీ, తల్లి రాజస్థాన్‌కు చెందిన బెంగాలీ. అందుకే ఆయనకు వివిధ భాషలు, సంస్కృతులపై పట్టు ఉంది.
ఢిల్లీలోని హిందూ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత ప్రసిద్ధ ‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా’లో నటనలో శిక్షణ పొందారు. ఆయన దాదాపు 11 భాషల్లో (హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ తదితర) 300లకు పైగా సినిమాల్లో నటించారు. 1990లలో బాలీవుడ్ సినిమాలతో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ‘ద్రోహకాల్’ (1994) సినిమాకు గాను ఆయనకు ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డు లభించింది. తెలుగులో ఆయన ‘పాప కోసం’ సినిమాతో అడుగుపెట్టారు. కానీ, మహేష్ బాబు ‘పోకిరి’ సినిమాలో ఆయన పోషించిన అవినీతి పోలీస్ ఆఫీసర్ పాత్ర ఆయనకు విపరీతమైన గుర్తింపు తెచ్చిపెట్టింది.
Ashish Vidyarthi and wife Rupali Barua are safe and recovering after a late-night accident in Guwahati. The actor reassured fans via Instagram Live 🙏💙🚑#buzzzookaprime #RupaliBarua #AshishVidyarthi #HealthUpdate #Guwahati pic.twitter.com/qN8aViDXjJ
— Buzzzooka Prime (@Buzzzookaprime) January 3, 2026

