Naache Naache Song Promo: ‘ది రాజాసాబ్’ ‘నాచే నాచే’ ప్రోమో..
nache-nache
ఎంటర్‌టైన్‌మెంట్

Naache Naache Song Promo: ప్రభాస్ ‘ది రాజాసాబ్’ నుంచి వచ్చిన సాంగ్ ప్రోమో ‘నాచే నాచే’ ఎలా ఉందంటే?

Naache Naache Song Promo: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ది రాజాసాబ్’ (The Raja Saab) నుంచి ‘నాచే నాచే’  సాంగ్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. విడుదలైన రెండు పాటలు చాట్ బాస్టర్లుగా నిలిచాయి. ట్రైలర్ అయితే రికార్డులు బద్దలు గొట్టింది. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా జనవరి 9 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. మూడో సింగిల్ జనవరి 5,2026న విడుదల చేయనున్నారు నిర్మాతలు. ఈ పాటలో ప్రభాస్ లుక్ చూస్తుంటే పాత ప్రభాస్ గుర్తొస్తున్నారు. చాలా కాలం తర్వాత ప్రభాస్ ఒక ఫుల్ లెంగ్త్ కలర్‌ఫుల్ అండ్ స్టైలిష్ అవతారంలో కనిపిస్తున్నారు. ఇది చూసిన ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

Read also-Ashish Accident: రోడ్డు ప్రమాదానికి గురైన నటుడు ఆశిష్ విద్యార్థి, ఆయన భార్య రూపాలీ.. ఇప్పుడు ఎలా ఉన్నారంటే?

ఇప్పటికే ఎస్.ఎస్. థమన్ క్యాచీ అండ్ ఎనర్జిటిక్ బీట్లు అందరినీ అలరిస్తున్నాయి. విడుదలైన ‘నాచే నాచే’ అనే హుక్ లైన్ వినడానికి బాగుంది. ఇది రిమేక్ సాంగ్ అయినప్పటికీ థమన్ మరో సారి రీమిక్స్ తో మేజిక్ చేశారు. ఈ సాంగ్ ముగ్గురు హీరోయిన్లతో ప్రభాస్ దుమ్ములేపేశాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సాంగ్ వైబ్‌కి తగ్గట్టుగా ఉంది. మారుతి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా విజువల్స్ చాలా గ్రాండ్‌గా ఉన్నాయి. సెట్స్, కలర్ ప్యాలెట్ చాలా రిచ్‌గా కనిపిస్తున్నాయి. ప్రభాస్ డ్యాన్స్ మూమెంట్స్ కూడా ఈసారి గ్రేస్‌ఫుల్‌గా ఉన్నట్లు ప్రోమో చూస్తే అర్థమవుతోంది. హారర్-కామెడీ జోనర్ అయినప్పటికీ, ఇలాంటి ఒక కలర్‌ఫుల్ సాంగ్ ఉండటం సినిమాపై అంచనాలను పెంచింది. మొత్తానికి ‘నాచే నాచే’ ప్రోమో సినిమాపై ఉన్న బజ్ ని రెట్టింపు చేసింది. ప్రభాస్‌ను ఇలాంటి ఎనర్జిటిక్ రోల్‌లో చూడాలని కోరుకునే వారికి ఈ పాట ఒక విందు లాంటిదే.

Read also-Shivaji Controversy: హీరోయిన్ దుస్తుల వివాదంపై సుమన్ చెప్పింది ఇదే.. వారు ఏం చేసేవారంటే?

ఈ పాటలో ప్రభాస్ ను చూస్తుంటే.. ఫ్యాన్స్ ఎలా కోరుకుంటున్నారో అలా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఈ పాట 1993లో వచ్చిన హిందీ సినిమా డిస్కో డాన్సర్ సినిమా నుంచి రిమేక్ చేశారు. అసలు పాటను మరింత మెరుగుపరిచి ఇప్పటి యూత్ కి తగ్గట్టులగా రీమిక్స్ చేశారు. అసలే హిట్ సాంగ్.. దీంతో పాటు ముగ్గురు హీరోయిన్లు కూడా ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తున్నారు. అసలు సాంగ్ ఇక క్లబ్ లో జరిగినప్పటికే ఈ పాటన్ ఫ్రెష్ లోకేషన్లలో కంపోజ్ చేశారు. ప్రభాస్ ను  ఎప్పుడూ చూడని విధంగా కనిపిస్తున్నారు. ఈ పాట్ మొత్తంగా ప్రభాస్ అభిమానులు సంబరాలు  చేసుకునేలా ఉంది. మరిన్నివివరాలు తెలియాలి అంటే పూర్తి సాంగ్ వచ్చేవరకూ ఆగాల్సిందే. నాచే నాచే ఫుల్ సాంగ్ జనవరి 5 న విడుదల చేయనున్నారు.

 

Just In

01

Akhanda 2: బోయపాటి ఇంటిని చుట్టుముట్టిన బయ్యర్లు.. నష్టాన్ని భరించేది ఎవరు?

Big Academy – Yuvraj Singh: వైఫల్యం చెందకపోతే ఎలా గెలవాలో తెలియదు.. బిగ్ అకాడమీ లాంఛింగ్‌లో యువరాజ్ సందేశం

HYD Water Supply: బీ అలర్ట్.. 8, 9 తేదీల్లో ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం

Son after 10 Daughters: బాబోయ్.. వరుసగా 10 మంది కూతుళ్లు.. 11వ సంతానంలో నెరవేరిన ‘కొడుకు కల’

ACB Rides: ఏసీబీ వలలో చిక్కిన నాగిరెడ్డి పేట తహసీల్దార్