The RajaSaab: ఎన్టీఆర్ వివాదంపై మారుతి క్లారిటీ..
maruthi-the-rajasab(X)
ఎంటర్‌టైన్‌మెంట్

The RajaSaab: ఎన్టీఆర్ వివాదంపై అసలు విషయాలు చెప్పిన దర్శకుడు మారుతి.. ఎందుకు చేశారంటే?

The RajaSaab: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘ది రాజా సాబ్’ (The Raja Saab) ఇప్పటికే భారీ అంచనాలు పెట్టుకున్నారు. ‘ది రాజా సాబ్’ సినిమా నుంచి ‘రెబల్ సాబ్’ సాంగ్‌ని గ్రాండ్‌గా లాంఛ్ చేశారు. అయితే అనుకున్న టైమ్‌కి కాకుండా కాస్త ఆలస్యం అవడంతో.. అభిమానులు బాగా డిజప్పాయింట్ అయ్యారు. ఇది గమనించిన మారుతి వారిని ఎలా గోలా మెప్పించాలని చాలానే ట్రై చేశారు. ఇక ఈ వేడుకలో అభిమానులను ఉద్దేశించి మారుతి మాట్లాడుతూ.. ‘ఈ సినిమాతో పండక్కి మీరంతా కాలర్ ఎగరేసుకుంటారు అని చెప్పను. ఎందుకంటే ఈ సినిమాకు, ప్రభాస్ కటౌట్‌కు అది చాలా చిన్న మాట అవుతుంది’ అని అన్నారు. తాజాగా ఈ వివాదానికి సంబంధించి మరోసారి క్లారిటీ ఇచ్చారు. అక్కడ ఉన్న వారు కాలర్ ఎత్తు అన్నా అని అరుస్తుంటే.. అలా అనాల్సి వచ్చిందని, తనకు ఎన్టీఆర్ అంటే చాలా అభిమానమని, అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ వివాదంలపై మారుతీ మరింత క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే ఈ వివాదంపై సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చారు. మరోసారి ఇదే వివాదంపై క్లారిటీ ఇచ్చారు.

Read also-Aadi Saikumar: రెండో సారి తండ్రి అయిన ఆది సాయికుమార్.. బేబీ బాయ్ పిక్స్ వైరల్..

‘వార్ 2’ ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ రెండు కాలర్స్ ఎగరేసిన అంశాన్ని గుర్తు చేసుకుంటూ.. కావాలని మారుతి ఇలా అన్నాడని, ఎన్టీఆర్‌ని అవమానించాడని ఫ్యాన్స్ హర్టవుతున్నారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో బాగా చర్చలు నడుస్తున్నాయి. మారుతిపై ట్రోలింగ్స్ కూడా మొదలయ్యాయి. ఇది గమనించిన మారుతి.. సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతూ.. తన ఉద్దేశ్యం అది కాదని వివరణ ఇచ్చారు. ‘‘సోషల్ మీడియాలో కాంట్రవర్సీ అవుతున్న ఈ అంశంపై వ్యక్తిగతంగా వివరణ ఇస్తున్నా. ముందుగా ప్రతి అభిమానికి నిజాయితీగా క్షమాపణలు చెబుతున్నాను. ఎవరినీ బాధపెట్టడం లేదా అగౌరవపరచడం నా ఉద్దేశ్యం కానే కాదు. కొన్నిసార్లు మాటల ప్రవాహంలో, మనం నిజంగా అర్థం చేసుకున్నదానికంటే భిన్నంగా విషయాలు బయటకు వస్తాయి. అది తప్పుగా స్వీకరించబడినా లేదా పోలికగా భావించబడినా.. అందుకు నేను చింతిస్తున్నాను. ఎన్టీఆర్, ఆయన అభిమానులందరి పట్ల నాకు ఎంతో గౌరవం ఉంది. సినిమా పట్ల, మీ హీరో పట్ల మీరు కలిగి ఉన్న ప్రేమను నేను నిజంగా విలువైనదిగా భావిస్తున్నాను. నేను ఈ విషయాన్ని పూర్తి నిజాయితీతో నా మనస్ఫూర్తిగా చెబుతున్నాను. మీరు నా పరిస్థితిని, దాని వెనుక ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా సోషల్ మీడియా వేదకగా జరిగిన్ ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయం గురించి మాట్లాడుతూ.. అక్కడ ఉన్నవారు కాలర్ ఎత్తు అంటుంటే.. వారిని ఉద్దేశించి అలా చెప్పానే తప్పతే అంతుకు మించి ఏం లేదు.. అసలు తనకు ఎన్టీఆర్ అంతే చాలా అభిమానమని, తాను అన్నది అసలు ఎన్టీఆర్ కు సంబంధం లేదని, అది ఎందుకో ఆయనకు ఆపాదించారని చెప్పుకొచ్చారు.

Read also-YouTuber Controversy: అన్వేష్ దెబ్బకు వీడియో డిలేట్ చేసిన ‘ఏయ్ జూడ్’.. రీ అప్లోడ్ వీడియోలో వేరే లెవెల్ వార్నింగ్..

Just In

01

NTR viral video: అభిమానులపై సీరియస్ అయిన జూనియర్ ఎన్టీఆర్.. ఎందుకంటే?

Seethakka: గ్రామాల్లో తాగునీటి సరఫరా పటిష్టం చేయాలి.. ఉన్నతాధికారులతో మంత్రి సీతక్క సమీక్ష!

Telangana Govt: విద్యుత్ సబ్సిడీల్లో అన్నదాతదే అగ్రభాగం.. వ్యవసాయ రంగానికి రూ.13,499 కోట్లు!

Akhil Akkineni: అఖిల్ అక్కినేని గురించి ప్రొడ్యూసర్ చెప్పింది వింటే గూస్‌బంప్స్ రావాల్సిందే..

Thummala Nageswara Rao: యూరియా కొరత లేదు.. ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తే తాట తీస్తాం.. మంత్రి తుమ్మల ఫైర్!