Parrot Deaths: నర్మదా నది ఒడ్డున తీవ్ర విషాదం..
Parrots ( Image Source: Twitter)
జాతీయం

Parrot Deaths: నర్మదా నది ఒడ్డున తీవ్ర విషాదం.. మధ్యప్రదేశ్‌లో 200 చిలుకల మృతి

Parrot Deaths: మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో జరిగిన ఓ విషాధాకర ఘటన వెలుగులోకి వచ్చింది. నర్మదా నది ఒడ్డున 200 చిలుకలు ఫుడ్ పాయిజన్ అయ్యి  చనిపోయాయని అధికారులు తెలిపారు. బద్వా ప్రాంతంలోని నది ఒడ్డున ఉన్న అక్విడక్ట్ వంతెన దగ్గర గత నాలుగు రోజుల క్రితం ఈ కళేబరాలు కనిపించాయని తెలిపారు. అయితే, పోస్ట్‌మార్టం నివేదికలో బర్డ్ ఫ్లూ కారణమని తోసిపుచ్చారని స్థానికులు అన్నారు.

కొన్ని చిలుకలు సహాయక చర్యల సమయంలో సజీవంగా ఉన్నాయి, కానీ ఆహార విషప్రభావం విపరీతంగా ఉండటంతో అవి కొద్దిసేపటికే చనిపోయాయని జిల్లా వన్యప్రాణి వార్డెన్ టోనీ శర్మ తెలిపారు. బర్డ్ ఫ్లూ భయంతో అనుమానితంగా మరణించిన తర్వాత ఈ మరణాలు ఆ ప్రాంతంలో భయాందోళనలకు దారితీశాయి. కానీ, పశువైద్య పరీక్షల్లో ఇన్ఫెక్షన్ అయితే ఎక్కడా కనిపించలేదు. అయితే, ఇక్కడ అటవీ శాఖ అధికారులు అక్విడక్ట్ వంతెన దగ్గర ఆహారం ఇవ్వడం నిషేధించారు. ఆ ప్రదేశంలో కఠినమైన ఆంక్షలు విధించారు.

మధ్య ప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో జరిగిన ఓ విషాధాకర ఘటన వెలుగులోకి వచ్చింది. నర్మదా నది ఒడ్డున కనీసం 200 చిలుకలు ఫుడ్ పాయిజన్ అని చనిపోయాయని అధికారులు తెలిపారు. బద్వా ప్రాంతంలోని నది ఒడ్డున ఉన్న అక్విడక్ట్ వంతెన దగ్గర గత నాలుగు రోజుల క్రితం ఈ కళేబరాలు కనిపించాయని తెలిపారు. అయితే, పోస్ట్‌మార్టం నివేదికలో బర్డ్ ఫ్లూ కారణమని తోసిపుచ్చారని స్థానికులు అన్నారు.

కొన్ని చిలుకలు సహాయక చర్యల సమయంలో సజీవంగా ఉన్నాయి, కానీ ఆహార విషప్రభావం విపరీతంగా ఉండటంతో అవి కొద్దిసేపటికే చనిపోయాయని జిల్లా వన్యప్రాణి వార్డెన్ టోనీ శర్మ తెలిపారు. బర్డ్ ఫ్లూ భయంతో అనుమానితంగా మరణించిన తర్వాత ఈ మరణాలు ఆ ప్రాంతంలో భయాందోళనలకు దారితీశాయి. కానీ, పశువైద్య పరీక్షల్లో ఇన్ఫెక్షన్ అయితే ఎక్కడా కనిపించలేదు. అయితే, ఇక్కడ అటవీ శాఖ అధికారులు అక్విడక్ట్ వంతెన దగ్గర ఆహారం ఇవ్వడం నిషేధించారు. ఆ ప్రదేశంలో ఆ ప్రదేశంలో కఠినమైన ఆంక్షలు విధించి సిబ్బందిని నియమించారు.

పక్షుల నమూనాలను తదుపరి పరీక్ష కోసం జబల్‌పూర్‌కు పంపినట్లు అధికారులు తెలిపారు. పశువైద్య శాఖ అధికారుల ప్రకారం, ఫుడ్ పాయిజనింగ్ జాడ కనిపించలేదు. గత నాలుగు రోజులుగా నివాసితులు అప్రమత్తం చేసిన తర్వాత పశువైద్య, అటవీ శాఖల బృందాలు, అలాగే వన్యప్రాణుల విభాగం ఈ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్నాయి. పోస్ట్‌మార్టం నిర్వహించిన పశువైద్యురాలు డాక్టర్ మనీషా చౌహాన్ మాట్లాడుతూ, చిలుకలలో ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలు కనిపించాయని, బర్డ్ ఫ్లూ సంకేతాలు లేవని చెప్పారు.

ప్రజలు తెలియకుండానే పక్షులకు జీర్ణవ్యవస్థకు ప్రాణాంతకమైన ఆహారాన్ని తినిపిస్తారని ఆమె తెలిపారు. చనిపోయిన పక్షుల కడుపులో బియ్యం, చిన్న గులకరాళ్ళు కనిపించాయని వెటర్నరీ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాఘేల్ పిటిఐకి చెప్పారు. జీర్ణం కానీ ఆహారం తినడం వల్లనే మరణం సంభవించినట్లు చెబుతున్నారు. అంతే కాదు, స్ప్రే చేసిన పొలాలలో తినడం వల్ల పురుగుమందులు చిలుకలు శరీరంలోకి వెళ్లి విషంగా మారిందని ఆయన అన్నారు. వంతెన సందర్శకులు వండిన లేదా మిగిలిపోయిన ఆహారాన్ని పక్షులకు తినిపించడం ప్రాణాంతకం అని నిరూపించారని అధికారులు తెలిపారు.

Just In

01

Urea Supply: రైతులు క్షమించరు జాగ్రత్త.. మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు.. బీఆర్ఎస్‌పై ఫైర్

RTC Bus Accident: బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం… తెల్లారిన దంపతుల బతకులు

GHMC Payments: అక్రమాలకు చెక్.. బల్దియాలో నగదు చెల్లింపులు బంద్.. కమిషనర్ సంచలన ఆదేశాలు

Musi River: త్వరలో మూసీ ప్రక్షాళన!.. మొదటి దశలో ఎన్ని కి.మీ. చేస్తారంటే?

Tiger Panic: మళ్లీ పులి కలకలం.. ఉలిక్కిపడ్డ కొత్తగూడ ఏజెన్సీ