Xiaomi India Launch: షియోమీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో కొత్త అప్డేట్ వెర్షన్స్ ను మన ముందుకు తీసుకొచ్చింది. త్వరలో మన దేశంలో తన తర్వాత స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే, ఒక తెలిసిన సమాచారం ప్రకారం, ఈ రిలీజ్ మనం ఊహించినట్టు అసలు ఉండకపోవచ్చు. షియోమీ 17, షియోమీ 17 అల్ట్రా ఫోన్‌లు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) నుండి పొందాయని నివేదికలు సూచిస్తున్నాయి.
అంతకముందు ఉన్న నివేదికల ప్రకారం జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ రిలీజ్ అవుతుందని తెలిసింది. తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం భారతీయ వినియోగదారులు 2026లో మరికొంత కాలం వేచి ఉండాల్సి రావచ్చు. ఈ రెండు మొబైల్స్ తో పాటు షియోమీ, షియోమీ 17Tని కూడా దేశంలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది. అయితే, తాజా తెలిసిన సమాచారం ప్రకారం, ఈ మోడల్ కొత్త ఫోన్స్ తో పాటు అన్ని ఒకేసారి రిలీజ్ కాకపోవచ్చు.
Also Read: Chamala Kiran Kumar Reddy: యూరియా సరఫరా విషయంలో కేటీఆర్ విమర్శలు ఫేక్: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
షియోమీ 17 సిరీస్
టిప్‌స్టర్ లీక్ చేసిన సమాచారం ప్రకారం షియోమీ 17, షియోమీ 17 అల్ట్రా మన దేశంలో మార్చి 2026 నాటికి రిలీజ్ కావొచ్చు. షియోమీ 17T ఒక నెల తర్వాత మన ముందుకు వస్తుంది. అయితే, దీనిలో కొత్త మార్పులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ సమాచారం నిజమైతే.. షియోమీ ఈ స్మార్ట్ ఫోన్స్ ను మరో రెండు నెలల్లో భారతదేశంలో విడుదల చేస్తుందన్న మాట. ప్రస్తుతానికి, ఈ కంపెనీ మన దేశంలో ఎప్పుడు రిలీజ్ చేస్తుందనే దాని గురించి ఎటువంటి అధికారిక ప్రకటన చెయ్యలేదు.
ధర ఎంతంటే?
షియోమీ డిసెంబర్ 25న చైనాలో షియోమీ 17 అల్ట్రాను లాంచ్ చేసింది. 12GB RAM, 512GB స్టోరేజ్ మోడల్ ధర CNY 6,999 (రూ. 83,990) నుండి స్టార్ట్ అవుతుంది. 16GB RAM, 1TB స్టోరేజ్‌తో కూడిన టాప్ వేరియంట్ ధర CNY 8,499 ( రూ. 1,01,990). ఈ ఫోన్ లో 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.9-అంగుళాల 1.5K LTPO AMOLED స్క్రీన్ ఉంది. ఇది క్వాల్కమ్ యొక్క స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో వర్క్ చేస్తోంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.3-అంగుళాల 1.5K OLED డిస్‌ప్లేను కలిగి ఉండగా.. అదే స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌ను ఉపయోగిస్తుంది.

