Mana ShankaraVaraprasad Garu: నయనతార ప్రమోషన్స్..
msp-pramotions
ఎంటర్‌టైన్‌మెంట్

Mana ShankaraVaraprasad Garu: నయన తారతో వేరే లెవెల్ ప్రమోషన్స్ చేయిస్తున్న అనిల్ రావిపూడి.. ఇప్పుడు ఏం లేదా..

Mana ShankaraVaraprasad Garu: మెగాస్టార్ హీరోగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా ఇప్పటికే పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నటి నయనతార ప్రమోషన్ వీడియోకు సంబంధించి చిత్ర యూనిట్ ఒక ప్రత్యేకమైన నూతన సంవత్సర వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో అనిల్ రావిపూడి నయనతార మధ్య సాగే సంభాషణ చాలా సరదాగా సాగింది. సినిమా ప్రమోషన్స్ కోసం నయనతార స్వయంగా అడగడం, దానికి అనిల్ రావిపూడి స్పందించే తీరు ప్రేక్షకులను అలరిస్తోంది. చిత్ర బృందం ఈ వీడియో ద్వారా ప్రేక్షకులకు హ్యాపీ న్యూ ఇయర్ (2026) శుభాకాంక్షలు తెలియజేసింది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ (Shine Screens) బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నయనతార స్టైలిష్ లుక్ అనిల్ రావిపూడి మార్క్ కామెడీ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.

Read also-Anvesh Controversy: ప్రపంచ యాత్రికుడికి కరాటే దెబ్బలు.. వెధవ అంటూ ఫైర్ అయిన కళ్యాణి..

ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన రెండు పాటలు మీసాల పిల్ల, వెంకీ మామతో చిరు చేసిన సాంగ్ హిట్ టాక్ సంపాదించుకున్నాయి. ప్రమోషన్లతో అదరగొడుతున్న అనీల్ రావిపూడి తాజాగా దీంతో మరింత ప్రమోషన్ చేశారు. చాలా కాలం తర్వాత మెగాస్టార్ దగ్గర నుంచి కామెడీ డ్రామా రావడంతో మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ ను వింటేజ్ లో చూడాలని ఆశపడే అభిమానులకు ఈ సినిమా ఫీస్ట్ కానుంది. ఇప్పటి వరకూ ఒక్క ఫ్లాప్ కూడా లేని అనీల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో ఈ సినిమా మరింత క్రేజ్ సంపాదించుకుంది. అసలే మెగాస్టార్ అందులో హిట్ దర్శకుడు కావడంతో ఈ సినిమాపై అభిమానుల అంచనాలు ఆకాశాన్నంటాయి.

Read also-Krishna Vamsi: ‘మురారి క్లైమాక్స్’పై కృష్ణవంశీ పోస్ట్ వైరల్!

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాకు ఇప్పటికే మంచి ప్రమోషన్స్ లభించింది. చిరంజీవి, నయనతార (హీరోయిన్), విక్టరీ వెంకటేష్ (అతిథి పాత్ర), కేథరిన్ థ్రెసా నటిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు తెలుగు ప్రేక్షకుల ప్లే లిస్ట్ లో చేరిపోయాయి. సాహు గారపాటి (షైన్ స్క్రీన్స్), సుష్మిత కొణిదెల (గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్) సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 12, 2026న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోంది. అనిల్ రావిపూడి తన మార్కు కామెడీ, మాస్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా ఎలా ఉండబోతుందో అని మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Just In

01

Micro Dramas: న్యూయర్‌లో కొత్త దర్శకులను అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన మంచు విష్ణు.. ఎప్పుడంటే?

Uttam Kumar Reddy: ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టులకు బ్రేక్ వేస్తాం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

Pawan Kalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్.. ఆ సినిమాలు డౌటే!

Hydraa – Kite Festival: నాడు మురికి కూపాలు.. నేడు వేడుక‌లకు వేదిక‌లు.. సంక్రాంతికి చెరువులు సిద్ధం!

Damodar Rajanarasimha: రాష్ట్రంలో కొత్త ఏడాదిలో‌ 4 కొత్త హాస్పిటల్స్: మంత్రి దామోదర రాజనర్సింహ