New Year Party: ఆర్టీసీ డిపోలో న్యూఇయర్ వేడుకల కోసం మేకను కోసిన ప్రబుద్ధులు
ఈ వ్యవహారంలో డిపో మేనేజర్ పాత్ర కీలకం!
ప్రభుత్వ కార్యాలయాల్లో పదవీ విరమణ, అధికారిక గౌరవ కార్యక్రమాలు, జాతీయ పండుగలు లాంటి సందర్భాల్లో వేడుకలు నిర్వహించడానికి నిబంధనల మేరకు అనుమతి ఉంటుంది. అంతేగానీ, పార్టీలు, సిట్టింగులు వేస్తామంటూ చెల్లదు. ప్రభుత్వ ఉద్యోగులు, కార్యాలయాలు ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉంది. కానీ, సుదీర్ఘ అనుభవం ఉండి, దాదాపు రిటైర్మెంట్‌కు దగ్గరపడ్డ ఓ ఆర్టీసీ డిపో మేనేజర్ అనుచితంగా ప్రవర్తించినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
న్యూఇయర్ పార్టీ (New Year Party) జరుపుకోవడంలో ఎలాంటి ఇబ్బంది, అభ్యంతరాలు ఉండవు. కానీ, నిజమాబాద్-1 ఆర్టీసీ డిపోకు చెందిన మేనేజర్ ఏకంగా డిపోలోనే మేక పొట్టేలును కోయించారట. సిబ్బందికి అంతగా ఇష్టం లేకపోయినప్పటికీ, త్వరలోనే తన రిటైర్మెంట్ ఉండడంతో ఇటు న్యూఇయర్, అటు రిటైర్మెంట్ పార్టీ కలిసొచ్చేలా, తాను కొంత డబ్బు ఇచ్చి మరీ మేకను కోయించిన వ్యవహారంపై స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మేక కోయాలంటూ ఆర్డర్ ఇస్తున్న రేంజ్‌లో చెప్పడంతో కిందిస్థాయి ఉద్యోగులు ఏర్పాట్లు చేశారు.
డిసెంబర్ 31న రాత్రి, అనుమతి లేకపోయినా ఆర్టీసీ డిపోలోనే దావత్ కోసం ఏర్పాట్లు చేశారు. డిపోలోపలికి ప్రైవేటు వాహనాలకు అనుమతి లేకపోయినప్పటికీ ఒక ఆటలో మేకను తీసుకొచ్చి అక్కడ కోశారు. గుట్టుచప్పుకుండా మేకను కోశారు. మేకను కోశారు. మార్నింగ్ షిప్ట్ ఎంప్లాయిస్ వచ్చేలోపే అక్కడ నుంచి ఆటలో వెళ్లిపోయారు. మరుసటి రోజు మహాలక్ష్మమ్మ గుడి దగ్గర పార్టీ చేసుకున్నారనేది సమాచారం. ఈ ఘటనకు సంబంధించి వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో, డిపో ఎంప్లాయిస్ సొంతంగా చేసుకోవాల్సిన న్యూఇయర్ దావత్‌ను డిపో మేనేజర్ ఇచ్చిన కొంత డబ్బుకు మరికొంత జమ చేసి పార్టీ చేసుకున్నారు. ఇలా ప్రభుత్వ కార్యాలయంలో 31 నైట్ దావత్ కోసం మేక కోయడంపై సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. బాధ్యులపై చర్యలు తీసుకుంటారా? లేదా? అనేది వేచి చూడాలి.

