BSNL WiFi Calling: మన దేశంలో రోజు రోజుకి టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోతుంది. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 2026 ఒకటో తారీఖున అన్ని టెలికాం సర్కిళ్లలో వాయిస్ ఓవర్ వై-ఫై (VoWiFi) సేవలను ఓపెన్ చేసినట్లు వెల్లడించింది. దీంతో, BSNL కూడా ఇప్పటికే ఈ సేవలను తమ కస్టమర్స్ కి అందిస్తున్న ప్రైవేట్ టెలికాం సంస్థలు అయిన ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో తో చేరింది. ఈ VoWiFi టెక్నాలజీ తో కస్టమర్స్ ఎన్నో బెనిఫిట్స్ పొందనున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం..
వై-ఫై కనెక్షన్ తో కాల్స్ చేయడం, మెసేజ్ లు సెండ్ చేయడం అంతే కాదు మొబైల్ సిగ్నల్ వీక్ గా ఉండే లొకేషన్స్ లో కనెక్టివిటీ అందించడమే దీని ముఖ్య ఉద్దేశం.
BSNL VoWiFi సేవల ముఖ్యాంశాలు
BSNL రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ ప్రకారం, ఈ కొత్త సేవలు ఇప్పుడు భారత్ మొత్తం BSNL కస్టమర్స్ కి అందుబాటులో ఉండనున్నాయి. ఇది సంస్థ చేపడుతున్న నెట్‌వర్క్ ముందడుగు వేసినట్లు BSNL వెల్లడించింది.
పల్లెటూళ్ళలో మొబైల్ నెట్‌వర్క్ తక్కువగా ఉండే ప్రదేశాల్లో VoWiFi బాగా ఉపయోగపడుతుంది. ఇది మాత్రమే కాకుండా.. అలాగే ఇళ్లలో, ఆఫీసుల్లో లేదా మొబైల్ సిగ్నల్ వీక్ గా ఉండే ప్రాంతాల్లో ఈ సేవలు మరింతగా ఉపయోగపడతాయి. ఈ సేవలు BSNL భారత్ ఫైబర్ సహా ఇతర బ్రాడ్‌బ్యాండ్ సేవలు లభించే స్థిరమైన వై-ఫై కనెక్షన్‌ను ఉపయోగిస్తుంది.
Also Read: Chamala Kiran Kumar Reddy: యూరియా సరఫరా విషయంలో కేటీఆర్ విమర్శలు ఫేక్: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
అదనపు యాప్ అవసరం లేదు
VoWiFi ఒక IMS ఆధారిత సేవ, ఇది మొబైల్ నెట్‌వర్క్, వై-ఫై మధ్య సులభంగా మార్చే సదుపాయాన్ని కలిగి ఉంటుంది. BSNL ప్రకారం, కస్టమర్లు ఇప్పుడు వాడే ఫోన్ నంబర్, డైలర్ యాప్ ద్వారానే కాల్స్ చేయెచ్చు. దీనిలో థర్డ్ పార్టీ యాప్స్ వాడాల్సిన అవసరం లేదు.
ఉచిత సేవ – అదనపు ఛార్జీలు లేవు
ఈ సేవను BSNL కస్టమర్లకు ఫ్రీ గా ఇవ్వనుంది. వై-ఫై కాల్స్‌కు ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని సంస్థ వెల్లడించింది. అంతేకాకుండా, ఇది నెట్‌వర్క్ రద్దీని కూడా పూర్తిగా తగ్గిస్తుంది.

