Chamala Kiran Kumar Reddy: కొత్త సంవత్సరం తొలి రోజునే బీఆర్ఎస్ నాయకులు గోబెల్స్ ప్రచారాన్ని మొదలు పెట్టారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy) స్పష్టం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, హరీశ్ రావు కృష్ణా, గోదావరి నదీ జలాలు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే రాష్ట్రంలో రైతులకు యూరియా సరఫరా విషయంలో కేటీఆర్(KTR) చేస్తున్న విమర్శలు పూర్తిగా వాస్తవ దూరమని కొట్టిపారేశారు. ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా బీఆర్ఎస్ నేతలు కేవలం డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. యూరియాను తీసుకురావడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడా విఫలం కాలేదని ఎంపీ చామల వివరించారు. తాము నేరుగా జేపీ నడ్డాతో మాట్లాడి రికార్డు స్థాయిలో యూరియా తెప్పించామని వెల్లడించారు.
Also Read: Uttam Kumar Reddy: నదీ జలాలపై బీఆర్ఎస్‌ను ఏకిపారేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి
చీకటి ఒప్పందం
2024-25 వానాకాలం పంటకు 9.66 లక్షల మెట్రిక్ టన్నులు, యాసంగికి 10.41 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను అందుబాటులో ఉంచామని తెలిపారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఈ స్థాయిలో ఎప్పుడూ యూరియా తీసుకురాలేదని, 2025-26 వానాకాలం కోసం ఇప్పటికే 9.79 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సిద్ధం చేశామని గణాంకాలతో వివరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్‌ను భూస్థాపితం చేశారని చామల విమర్శించారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తన ఓట్లను బీజేపీకి అవయవదానం చేసి, ఆ పార్టీని 8 సీట్లలో గెలిపించిందని ఆరోపించారు. అయితే ఆ బీజేపీ ఎంపీల వల్ల రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు. కేటీఆర్ తప్పుడు సమాచారంతో, రెచ్చగొట్టే మాటలతో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టాలని చూడొద్దని చామల హెచ్చరించారు.
Also Read: Gali Janardhan Reddy: గాలి జనార్థన్ రెడ్డిపై హత్యాయత్నం.. ఒకరు మృతి, 25 మందికి గాయాలు

