KTR: క్యాలెండర్లు మారుతున్నాయి జీవితాల్లో మార్పు లేదు: కేటీఆర్
KTR (imagecredit:twitter)
Political News, Telangana News

KTR: క్యాలెండర్లు మారుతున్నాయి తప్ప.. ప్రజల జీవితాల్లో మార్పు లేదు: కేటీఆర్

KTR: కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ఎలాంటి మార్పు లేదని, కేవలం తిరోగమనం మాత్రమే కనిపిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) విమర్శించారు. తెలంగాణ భవన్‌లో గురువారం భారత రాష్ట్ర సమితి నూతన సంవత్సర డైరీని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, క్యాలెండర్లు మారుతున్నాయే తప్ప, కాంగ్రెస్ ప్రభుత్వంపై గంపెడు ఆశలతో ఓటేసిన ప్రజల జీవితాల్లో ఎలాంటి సానుకూల మార్పు రాలేదని మండిపడ్డారు. గత రెండేళ్లుగా రాష్ట్రం అభివృద్ధి పథంలో కాకుండా వెనక్కు ప్రయాణిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్(KCR) సీఎం కాకముందు ఉన్న దుస్థితి మళ్లీ రాష్ట్రానికి తిరిగి వస్తోందని ఆయన హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు యూరియా కోసం లైన్లలో నిలబడాల్సిన దయనీయ పరిస్థితి మళ్లీ వచ్చిందని కేటీఆర్ ధ్వజమెత్తారు.

Also Read: Sabarimala Temple: శబరిమల ఆలయంలో భారీ బంగారం చోరీ.. సిట్ నివేదికలో సంచలన విషయాలు

కేసీఆర్ సీఎం కావడమే ధ్యేయం

పదేళ్ల కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం చరిత్రలో చెరగని ముద్రగా నిలిచిపోయాయని, ఆ ప్రగతి సంతకాన్ని ఎవరూ తుడిచిపెట్టలేరని స్పష్టం చేశారు. జెండాను మోసే కార్యకర్తలే పార్టీకి అసలైన బలమని ఆయన కొనియాడారు. గెలుపు ఓటములు తాత్కాలికమని, తెలంగాణ ప్రజల గుండెల్లో గులాబీ జెండా స్థానం శాశ్వతమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు ఒకటై బీఆర్ఎస్‌పై దాడి చేస్తున్నప్పటికీ, ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు ఎవరూ ఏమీ చేయలేరన్నారు. 2026లో ఒకవైపు పోరాటాన్ని కొనసాగిస్తూనే, మరోవైపు పటిష్టమైన సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారిస్తామని వెల్లడించారు. 2028లో తిరిగి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయడమే బీఆర్ఎస్ లక్ష్యమని స్పష్టం చేశారు. అసెంబ్లీలో నీటి జలాలపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే, తమ పార్టీకి కూడా అవకాశం ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Also Read: Ganja Cultivation: రాజేంద్రనగర్‌లో గంజాయి పెంపకం.. బిగ్ షాకింగ్ ఘటన

Just In

01

Xiaomi India Launch: భారత్‌ మార్కెట్లోకి Xiaomi 17, 17 Ultra, 17T.. లాంచ్ డేట్ ఎప్పుడంటే?

Medaram Jatara 2026: సమ్మక్క సారలమ్మలను దర్శించుకొని… కీలక ఆదేశాలు జారీ చేసిన మల్టీ జోన్ ఐజీ

New Year Party: న్యూఇయర్ పార్టీకి ఆర్టీసీ బస్ డిపోలో మేక కటింగ్.. ప్రోత్సహించిన డిపో మేనేజర్!

Xiaomi Mix 5: త్వరలో మన ముందుకు రానున్న Xiaomi కొత్త ఫోన్?

Grok Saves Man Life: వ్యక్తి ప్రాణాలు కాపాడిన గ్రోక్.. అవాక్కైన ఎలాన్ మస్క్.. నెట్టింట ఆసక్తికర పోస్ట్