Anvesh Case: అన్వేష్ కోసం పోలీసుల అన్వేషణ.. ఇన్‌స్టాకు లేఖ..
anvesh-arrest(x)
ఎంటర్‌టైన్‌మెంట్

Anvesh Case: అన్వేష్ కోసం పోలీసుల అన్వేషణ.. వివరాలు కావాలంటూ ఇన్‌స్టాకు లేఖ..

Anvesh Case: హిందూ దేవతలను, దేవుళ్లను అవమానించాడంటూ నా అన్వేషణ ఛానల్ యూట్యూబర్ అన్వేష్ పై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదైన విషయం తెలిసిందే. అయితే అవి అక్కడితో ఆగిపోలేదు.. అన్వేష్ ఇన్‌స్టా ఐడీ కోసం పోలీసులు చర్చలు మొదలుపెట్టారు. అన్వేష్ యూజర్ ఐడీ వివరాలు కావాలని పంజాగుట్ట పోలీసులు ఇన్‌స్టాగ్రామ్‌కు లెటర్ రాశారు. అనంతరం అన్వేష్‌కు నోటీసులు ఇవ్వ బోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అన్వేష్ పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. ఇప్పటికే హిందువుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకత వల్ల అన్వేష్ చందారుల సంఖ్య రోజురోజుకూ పడిపోతుంది. యూట్యూబ్ లో అయితే లక్షల్లో యూజర్లు అన్ సబ్‌స్క్రై బ్ చేస్తున్నారు. రానున్న రోజల్లో ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి మరి.

Read also-Megastar Movie: మెగాస్టార్ ‘మన శంకరవరప్రసాద్ గారు’ ట్రైలర్ లాంచ్ అప్పుడేనా!.. ఎక్కడంటే?

యూట్యూబర్ అన్వేష్ భారత దేశం గురించి, హిందువుల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సారి బత్తయిలను బత్తాయిలతోనే కొట్టాలి అంటూ విరుచుకు పడ్డాడు. తాజాగా రిలీజ్ చేసిన ఇన్టా వీడియోలో తనకు రాత్రి కలలో ఆంజనేయ స్వామి కనిపించి వినాయకుడు తమ్ముడిని దగ్గర పెట్టుకో నీకు తోడుగా ఉంటాడు అని చెప్పాడన్నారు. అంతే కాకుండా బెట్టింగ్ మాఫియాను నిర్మూలించడంలో నీ క‌ృషి చాలా ఉంది. అందుకు నీ కోసం కొంత మంది కాసుకుని కూర్చొన్నారు. అందుకే కుమార స్వామిని తోడుగా ఉంచుకో అని చెప్పాడన్నారు. ఇక్కడితో ఆగకుండా.. కాషాయం ముసుగులో కొందలు అక్రమాలకు అన్యాయాలకు పాల్పడుతున్నారని వారి అంతు కూడా తేల్చమని దేవుడు చేప్పాడన్నారు. 2026లో అసలు బూతులు ఆడనన్నారు. కొందరు దోపిడీ, దొంగతనలు చేసి జై శ్రీరామ్ అంటున్నారని విరుకుచు పడ్డారు. ఈ ఏడాది మొత్తం దుష్టులను దుర్మార్గులనూ అంతమెందించమని హనుమాన్ చెప్పారన్నారు.

Read also-Anvesh Controversy: యూట్యూబర్ అన్వేష్ ఈ సారి పెద్ద టార్గెట్టే పెట్టుకున్నాడు.. బత్తాయిల అంతు చూస్తాడంట..

ముఖ్యంగా కాషాయం ముసుగులో ఉన్న బత్తాయిలకు తన వీడియో వస్తుందంటే వెన్నులో ఇణుకు పుట్టాలన్నారు. స్వామి మాల వేసుకుని మోసాలు చేస్తున్నారని మండిపడ్డారు. తాజాగా చేసిన ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. కరాటే కళ్యాణిని దృష్టిలో పెట్టుకుని అన్వేష్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అంతే కాకుండా తనకు కలలో కనిపించిన ఆంజనేయ స్వామి ఇక ట్రావెలింగ్ కొన్ని రోజులు పక్కన పెట్టి.. ప్రజా సమస్యలపై పోరాడాలన్నారు. అలా పోరాడితే రోజుకు రెండు కోట్లు వస్తాయి.. అందులో యాభై లక్షలు టాక్స్ కట్టినా కోటీ యాభై లక్షలు కూర్చొని సంపాదించు అని అన్నారన్నారు. ఇదిలా ఉండగా దేశ క్షేమం కోసం రోజుకు ఎనిమిది వీడియోలు చేసి దేశాన్ని రక్షించాలని హనుమాను చెప్పారన్నారు. దీనిని చూసిన కొందరు బీజేపీ కార్యకర్తలు అన్వేష్ పై మండిపగుతున్నారు.

Just In

01

Xiaomi Mix 5: త్వరలో మన ముందుకు రానున్న Xiaomi కొత్త ఫోన్?

Grok Saves Man Life: వ్యక్తి ప్రాణాలు కాపాడిన గ్రోక్.. అవాక్కైన ఎలాన్ మస్క్.. నెట్టింట ఆసక్తికర పోస్ట్

Lover Attacks Man: రాత్రి 1.30 గంటలకు ప్రియుడిని ఇంటికి పిలిచి.. ప్రైవేటు పార్ట్స్ కోసేసిన ప్రియురాలు

BSNL WiFi Calling: మెరుగైన కనెక్టివిటీ కోసం దేశమంతటా BSNL Wi-Fi కాలింగ్ లాంచ్

Harish Rao on CM Revanth: మూసి కంపు కంటే.. సీఎం నోటి కంపే ఎక్కువ.. హరీశ్ రావు స్ట్రాంగ్ కౌంటర్