Megastar Movie: ‘మన శంకరవరప్రసాద్ గారు’ ట్రైలర్ ఎప్పుడంటే?
mana-sankara-vara-prasad
ఎంటర్‌టైన్‌మెంట్

Megastar Movie: మెగాస్టార్ ‘మన శంకరవరప్రసాద్ గారు’ ట్రైలర్ లాంచ్ అప్పుడేనా!.. ఎక్కడంటే?

Megastar Movie: కొత్త ఏడాది వచ్చేసింది.. సంక్రాంతికి ఇంకా కొన్ని రోజులే ఉంది. ఆ రోజుల్లో అరడజను సినిమాలకు పైగా విడుదలవుతున్నాయి. అందరి దృష్టీ మెగాస్టార్ హీరోగా వస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు సినిమామీదే ఎందుకంటే మెగాస్టార్ కామెడీ టైమింగ్స్ తగ్గట్లుగా అనిల్ రావిపూడి టేకింగ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జనవరి 4,2026న తిరుపతిలో జరగనుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు కావలసినంత ప్రమోషన్ వచ్చింది.ఈ సినిమా విడుదల కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు, చాట్ బాస్టర్లులగా నిలిచాయి. వచ్చే ట్రైలర్ కూడా మెగాస్టార్ కామెడీ టైమింగ్స్ ను మరింత ఎలివేట్ చేస్తుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు అధికారికంగా రావాల్సి ఉంది. సినిమా విడదల కూడా దగ్గర పడటంతో ప్రమోషన్ల వేగం మరింత పెంచారు.  దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Read also-Balayya Thaman: నందమూరి థమన్ దెబ్బకు కారు అద్దాలు బ్రేక్.. బాలయ్యతో అలాగే ఉంటది మరి..

ఇప్పటికే నయనతార చేసిన ప్రమోషనల్ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ హీరోగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా ఇప్పటికే పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నటి నయనతార ప్రమోషన్ వీడియోకు సంబంధించి చిత్ర యూనిట్ ఒక ప్రత్యేకమైన నూతన సంవత్సర వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో అనిల్ రావిపూడి నయనతార మధ్య సాగే సంభాషణ చాలా సరదాగా సాగింది. సినిమా ప్రమోషన్స్ కోసం నయనతార స్వయంగా అడగడం, దానికి అనిల్ రావిపూడి స్పందించే తీరు ప్రేక్షకులను అలరిస్తోంది. చిత్ర బృందం ఈ వీడియో ద్వారా ప్రేక్షకులకు హ్యాపీ న్యూ ఇయర్ (2026) శుభాకాంక్షలు తెలియజేసింది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ (Shine Screens) బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నయనతార స్టైలిష్ లుక్ అనిల్ రావిపూడి మార్క్ కామెడీ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.

Read also-Vanga NewYear: సందీప్ రెడ్డి కేక్ కటింగ్ స్టైల్ చూశారా.. కొత్త ఏడాదికి వెల్కమ్ పెద్దగా పలికాడు..

Just In

01

Suicide Case: title: నిజామాబాద్ జిల్లాలో దారుణం.. ఆసుపత్రి బాత్రూమ్‌లో ల్యాబ్ టెక్నీషియన్ సూసైడ్!

Musi Rejuvenation Project: మూసీ ప్రక్షాళన పక్కా.. మార్చిలో పనులు స్టార్ట్.. అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రకటన

Pawan Impact: పవన్ కళ్యాణ్ ఫ్లాప్ సినిమా రేంజ్ అలాంటిది మరి.. నిధి అగర్వాల్ ఏం చెప్పారంటే?

Mana Doctor Babe: శ్రీ స్కంద ‘మన డాక్టర్ బాబే’ సినిమా నుంచి స్పెషల్ గ్లింప్స్ వచ్చేశాయి.. ఎలా ఉందంటే?

KTR: క్యాలెండర్లు మారుతున్నాయి తప్ప.. ప్రజల జీవితాల్లో మార్పు లేదు: కేటీఆర్