Balayya Thaman: బాలయ్య బాబు అంటేనా మామూలుగా జనాలకు పూనకాలు వచ్చేస్తాయి. అలాంటిది బాలయ్య సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు అంటే ఇక చెప్పనవసరం లేదు బాక్సులు బద్దలవ్వల్సిందే. అయితే ఈ సారి బాక్సులు బద్దలు కాలేదు, ఏకంగా కారు అద్దమే బద్దలైంది. ప్రయాణంలో ఉండగా ఓ ప్రయాణికుడు తన కారులో డాకు మహారాజ్ పాటలు పెట్టుకున్నాడు. అందులోనూ ద రేంజ్ ఆఫ్ డాకు పాట పెట్టుకున్నాడు, సౌండ్ బాగా పెంచడంతో కారు అద్దం బద్దలైంది. దీనికి కారణం థమన్, బాలయ్య కాంబోయే నంటూ కారు ఓనర్ చెబుతున్నాడు. అప్పటికీ కారులో ఉన్న తన పాప చెబుతుంది. నాన్న సౌండ్ పెంచకు అద్దం బద్దలవుతుంది. అనీ కానీ వినకుండా సౌండ్ పెంచడంతో కారు అద్దం బద్దలైంది. దీనిని చూసిన బాలయ్య బాబు అభిమానులు బాలయ్యతో పెట్టుకుంటే అలాగే ఉంటుందని కామెంట్లు పెడుతున్నారు.
Read also-Vanga NewYear: సందీప్ రెడ్డి కేక్ కటింగ్ స్టైల్ చూశారా.. కొత్త ఏడాదికి వెల్కమ్ పెద్దగా పలికాడు..
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా దర్శకుడు బాబీ కొల్లి (కె.ఎస్. రవీంద్ర) తెరకెక్కించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “డాకు మహారాజ్”. జనవరి 12, 2025 సంక్రాంతి కానుకగా వచ్చి మంచి విజయం సాధించింది.
నందమూరి బాలకృష్ణ సరసన శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్, ఊర్వశి రౌతేలా నటించారు. బాబీ డియోల్ తెలుగులో విలన్ పాత్ర వేసిన మొదటి సినిమా. బాబీ కొల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరించారు. ఎస్.ఎస్. తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అందుకనే థమన్ ను నందమూరి బాలయ్య బాబు నందమూరి థమన్ అని పిలుస్తారు.
Read also-Hey Bhagawan: ‘హే భగవాన్’ స్పెషల్ వీడియో చూశారా.. నవ్వకుండా ఉండలేరు!
ఈ సినిమా కథ ప్రధానంగా ఛంబల్ ప్రాంతం చుట్టూ తిరుగుతుంది. బాలయ్య ఇందులో మూడు విభిన్న కోణాల్లో కనిపిస్తారు: నానాజీ, సీతారాం (ఇంజనీర్), శక్తివంతమైన డాకు మహారాజ్. ఓ చిన్నారిని (బేబీ వైష్ణవి) విలన్ల నుండి కాపాడే రక్షకుడిగా బాలయ్య పాత్ర సాగుతుంది. విలన్‌గా బాబీ డియోల్ క్రూరమైన నటనతో ఆకట్టుకున్నారు. ప్రజలకు నీటి సౌకర్యం అందకుండా అడ్డుకునే మైనింగ్ మాఫియాను ఎదిరించే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. పీరియడ్ యాక్షన్ డ్రామా కావడంతో బాలయ్య లుక్ చాలా కొత్తగా, పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇసుక తుఫాన్ నేపథ్యంలో వచ్చే ఫైట్స్ మరియు ఇంటర్వెల్ సీన్ థియేటర్లలో అభిమానులకు మంచి ఊపునిచ్చాయి. ‘దబిడి దిబిడి’ సాంగ్ ఎలివేషన్ సీన్లలో తమన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ సినిమా ఘనవిజయం సాధించిన నేపథ్యంలో, దీనికి ప్రీక్వెల్ ఉండే అవకాశం ఉందని నిర్మాత నాగవంశీ సక్సెస్ మీట్‌లో హింట్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా ఓటిటి లో కూడా అందుబాటులో ఉంది.
The RAGE of #DaakuMaharaaj Break The Car Glass 🥵💥💥#NandamuriBalakrishna 🦁 pic.twitter.com/KrK5yBTgpR
— Ꮇᴏʜᴀɴ🦁NBK✌️ (@CBNBK6) January 1, 2026

