Kharif Season: తొలకరి వర్షాలకు ఎన్నో ఆశలతో ఖరీఫ్ లో పంటలు సాగుచేసిన రైతన్నలకు దిగుబడులు తగ్గి దిగులే మిగిలింది. ముందస్తు వర్షాలు కురిస్తాయనే వాతావరణ శాఖ సూచనలతో కురిసిన వర్షాలకు మే నుంచి దుక్కులు దున్ని జూన్ మొదటి మాసంలోనే విత్తనాలు వేశారు. అనంతరం వర్షాలు లేక విత్తనాలు మొలకెత్తక ఇబ్బందులు పడ్డారు. ఆగస్టులో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా పంట చేలు దెబ్బతిన్నాయి. అరకొర దిగుబడి వచ్చిన పంట అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడ్డారు. సమయానికి బ్యాంకు రుణాలు అందకపోయినా అప్పులు చేసి పంటలు సాగు చేశారు. ప్రకృతి వైపరీత్యాలు పెరిగిన పెట్టుబడులు చీడపీడల వ్యాప్తి అరకొర దిగుబడితో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అధిక వర్షాలతో అతలాకుతలం
జూన్ లో నైరుతి రుతుపవనాలు జిల్లాను తాకినా ఆశించిన వర్షాలు కురవలేదు.దీంతో వివిధ రకాల పంటల మొక్కలు వడలిపోయాయి. ఎదుగుదల లోపించింది. వరి నార్లు పోసుకోలేదు. జులై,ఆగస్టు రెండో వారంలో ఎడతెరిపి భారీ వర్షాలు కురిసి వాగులు, వంకలు, చెరువులు, గుంటలు పొంగిపొర్లాయి.ఫలితంగా పత్తి,కంది,మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. పచ్చని పత్తి చేనులో నలుపు రంగులోకి మారి కాయలు రాలిపోయాయి. సెప్టెంబర్ లో పూతాకాత పొట్ట దశలో ఉండగా వర్షాలు మరోసారి దెబ్బ తీశాయి. మరోవైపు వాతావరణ మార్పులతో పత్తిలో లద్దె పురుగు, గులాబి రంగు పురుగు , అగ్గి తెగులు, సుడిదోమ తదితర చీడపీడల విజృంభణలతో పంట దిగుబడి సగానికి తగ్గిపోయింది.మూడుసార్లు కురిసిన భారీ వర్షాలతో జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాలలో రైతులు వివిధ పంటలు నష్టపోయారు.
Also Read: TG Police Reforms: ఇక రాచకొండ కమిషనరేట్ క్లోజ్.. వ్యవస్థలో భారీ మార్పులు
రకరకాల పురుగులు
2025…. వానాకాలం సీజన్ రైతుకు కన్నీరు మిగిల్చింది. 2025 ఆరంభంలో వర్షాలు కురవలేదు. ఆ తర్వాత ప్రధానంగా జూలై ఆగస్టు నెలలో కురిసిన అధిక వర్షాల ప్రభావం పంటల పై పడింది. పలుచోట్ల నీరు నిలువ అయి పంటపై ప్రభావం చూపింది. సెప్టెంబర్ లో కురిసిన వర్షాల వల్ల అన్ని రకాల పంటలకు తెగుళ్లు వైరస్లు, రకరకాల పురుగులు ఆశించాయి. ప్రధానంగా 1.55 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగుకాగా అధిక వర్షాలకు తోడు ఎర్ర తెగుళ్లు సోకింది. పంట నాణ్యత దెబ్బతింది. ఎకరానికి 15 నుంచి 18 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా కేవలం ఐదు నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. మిగిలిన పంటలు సైతం దిగుబడులు సగానికి పడిపోయాయి.
జిల్లాలో వానకాలం సాగు వివరాలు
జిల్లాలో వర్షాధారంగా 3.86 లక్షల ఎకరాల పంటలు సాగు చేశారు. అదేవిధంగా ఉద్యానవన పంటల సాగు 45 వేల ఎకరాలలో పంటలు సాగు చేశారు.ప్రధానంగా సాగయ్యే పంటలు పత్తి, వరి , కంది, మిరప పంటలు రైతులు అధికంగా సాగు చేశారు. దెబ్బ తిన్నాయి దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపాయి అంతర్జాతీయ మార్కెట్ లో పత్తి బేలకు ధర తక్కువ ఉండడంతో మద్దతు ధర కంటే ఎక్కువ రేటు కొనేందుకు ప్రైవేట్ వ్యాపారులు ముందుకు రాలేదు. దీంతో అందరి చూపు సీసీఐ పైనే పడింది. అయితే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విధించిన నిబంధనలతో రైతుల ఇబ్బందులు గురయ్యారు. కపాస్ కిసాన్ యాప్ వల్ల ఇక్కట్లు పడడంతో పాటు తేమ కొర్రీలు వెంటాడగా చాలామంది రైతులు ప్రైవేట్ లోనే మద్దతు ధర కంటే తక్కువకె విక్రయించారు.
రైతు భరోసా ఏది
పంట పెట్టుబడి కోసం రైతులకు ఇచ్చే రైతు భరోసా ఇంకా రైతుల ఖాతాలో జమకాలేదు. ఇప్పటికే రబీకి సంబంధించి సాగు పనులు మధ్య దశకు వచ్చాయి. పెట్టుబడి కోసం అన్నదాతకు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఖరీఫ్ సీజన్ లో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Also Read: Chamala Kiran Kumar Reddy: పదేళ్లు గాడిద పళ్లు తోమారా?.. బీఆర్ఎస్‌పై ఎంపీ చామల కిరణ్ ఫైర్

