The Paradise: జడల్ మరో పవర్ ఫుల్ అవతార్‌లో..
The Paradise Movie Poster (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

The Paradise: జడల్ మరో పవర్ ఫుల్ అవతార్‌లో.. న్యూ ఇయర్ ట్రీట్ వదిలారు

The Paradise: నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘ది పారడైజ్’ (The Paradise) మూవీ ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ఓ రేంజ్‌లో అంచనాలను పెంచేసింది. ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో SLV సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ‘దసరా’ (Dasara) బ్లాక్ బస్టర్ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబోలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం.. ఇప్పటికే అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు మేకర్స్ రిలీజ్ చేసిన నాని, మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్‌‌లు మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా, సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా? అని వెయిట్ చేసేలా చేశాయి. ఇక మేకర్స్ ఈ న్యూ ఇయర్ స్పెషల్‌గా మరో ట్రీట్ వదిలారు. నేచురల్ స్టార్ నాని అదిరిపోయే పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

Also Read- The Black Gold: సంయుక్త ‘ది బ్లాక్ గోల్డ్’ రిలీజ్‌పై మేకర్స్ ఇచ్చిన అప్డేట్ ఇదే..

న్యూ ఇయర్ ట్రీట్ అదిరింది

ఈ పోస్టర్‌లో నాని జడల్ పాత్రలో పవర్ ఫుల్‌ అవతార్‌లో, తన కెరీర్‌లో ఇప్పటివరకు ఎప్పుడూ చూడని విధంగా చాలా కొత్తగా కనిపిస్తున్నారు. స్ట్రాంగ్ ఫిజిక్, పొడవైన జడలు కట్టిన జుట్టు, రగ్గడ్ గడ్డం, మీసాలతో నాని లుక్ నిజంగానే అదిరిపోయింది. రెడ్ టింట్ గ్లాసులు, మెటల్ చైన్స్, స్లీవ్‌లెస్ బ్లాక్ అవుట్‌ఫిట్ నాని పాత్రలోని ఇంటెన్సిటీని తెలియజేస్తుంది. ఈ పోస్టర్ సినిమాలో కీలకమైన జైలు ఫైట్ సీన్‌కి సంబంధించినదని మేకర్స్ చెబుతున్నారు. ఫారిన్ ఫైటర్లతో జరిగే హై-వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ అని, కథను కీలక మలుపు తిప్పే ప్రధాన ఘట్టాల్లో ఒకటిగా నిలవనుందని చెబుతున్నారు. ‘దసరా’ మూవీతో పాత్రలను అద్భుతంగా తీర్చిదిద్దిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.. ఈ సినిమాను కూడా అదే స్థాయిలో రా, రగ్డ్, రియలిస్టిక్ టోన్‌తో తెరకెక్కిస్తున్నారని ఈ పోస్టర్ స్పష్టంగా తెలియజేస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read- Vishwak Sen: విశ్వక్ సేన్ నెక్ట్స్ ఫిల్మ్ టైటిల్ ఇదే.. అనౌన్స్‌మెంట్ టీజర్ అదిరింది

పాన్ వరల్డ్ స్పెక్టకిల్‌గా..

2026లో ఎక్కువ మంది వెయిట్ చేస్తున్న చిత్రాలలో ఒకటిగా మొదటి నుంచి ఈ సినిమా బజ్‌ని ఏర్పరచుకుంది. దానికి తగినట్లుగానే ఎప్పటికప్పుడు లుక్స్, పోస్టర్స్ వదులుతూ.. సినిమా హైప్‌ని మరింత పెంచుతున్నారు. ఈ సినిమా 2026 మార్చి 26వ తేదీన తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాళీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో విడుదల కానుంది. ‘ది ప్యారడైజ్’ ఇండియన్ సినిమాని ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకునే పాన్ వరల్డ్ స్పెక్టకిల్‌గా ఉంటుందని, ఎవరు ఎన్ని అంచనాలు పెట్టుకున్నా.. అందుకు డబుల్ రేంజ్‌లో ఈ సినిమా ఉంటుందని మొదటి నుంచి మేకర్స్ చెబుతూ వస్తున్నారు. ఈ సినిమాకు రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Star Heroines: ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ ఆశలన్నీ ఆ తమిళ సినిమాలపైనే!

Ustaad Bhagat Singh: మామా మరో పోస్టర్ వదిలారు.. ఫ్యాన్స్‌కు పూనకాలే!

Hey Bhagawan: ‘హే భగవాన్’ స్పెషల్ వీడియో చూశారా.. నవ్వకుండా ఉండలేరు!

Govt Employees: ఉద్యోగ సంఘాలకు కొత్త ఏడాది గుడ్ న్యూస్!.. సీఎం రేవంత్ కీలక సందేశం?

Uttam Kumar Reddy: నదీ జలాలపై బీఆర్ఎస్‌ను ఏకిపారేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి