The RajaSaab: ప్రభాస్ వివాదంపై డైరెక్టర్ మారుతి ఏం అన్నారంటే?
maruthi-about-climax
ఎంటర్‌టైన్‌మెంట్

The RajaSaab: ప్రభాస్ నాకు దేవుడితో సమానం.. గత వివాదంపై డైరెక్టర్ మారుతి ఏం అన్నారంటే?

The RajaSaab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్‌లో వస్తున్న ‘రాజా సాబ్’ (The Raja Saab) సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఈ సినిమా మొదలైనప్పటి నుండి ఒక చిన్న నెగిటివిటీ మారుతిని వెంటాడుతూనే ఉంది. అది ఏంటంలే ఈ ‘ది రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ ను ఉద్దేసిస్తూ.. ఒక మిడ్ రేంజ్ హీరో అని సంబోధించారు. ఈ విషయంపై అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. తాజాగా దీనికి సంబంధించి మారుతి క్లారిటీ ఇచ్చారు.

Read also-Mana ShankaraVaraprasad Garu: నయన తారతో వేరే లెవెల్ ప్రమోషన్స్ చేయిస్తున్న అనిల్ రావిపూడి.. ఇప్పుడు ఏం లేదా..

అసలేం జరిగిందంటే..

మారుతి మాట్లాడుతూ, “గతంలో నేను ఒక పదాన్ని పొరపాటుగా వాడాను. అది అనుకోకుండా వచ్చిన మాట. ఆ రోజు నేను వ్యక్తిగతంగా చాలా డిస్టర్బ్‌డ్‌గా ఉన్నాను. ఆ మానసిక స్థితిలో ‘మిడ్-రేంజ్’ బడ్జెట్ సినిమాల గురించి చెబుతూ ప్రభాస్ గారి ప్రస్తావన తెచ్చాను. నా ఉద్దేశ్యం ఏమిటంటే, రూ.50 కోట్ల లోపు బడ్జెట్ సినిమాలను కూడా ప్రభాస్ తన క్రేజ్‌తో ఈ స్థాయికి తీసుకెళ్లగలరని చెప్పడం మాత్రమే. కానీ ఆ పదం తప్పుగా అర్థం చేసుకోబడింది,” అని వివరించారు. తన మనసులో ప్రభాస్ పట్ల ఉన్న గౌరవాన్ని చాటుతూ.. “ప్రభాస్ గారు నాకు ‘డెమీ గాడ్’ (Demi God) లాంటి వారు. ఆయన ఇమేజ్ గురించి తక్కువ చేసి మాట్లాడే సాహసం నేను ఎప్పటికీ చేయను. నా నోటి నుండి పొరపాటున వచ్చిన మాటను పట్టుకుని నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం బాధాకరం. ఆయన ‘మిర్చి’ సినిమా నుండే సూపర్ స్టార్, ‘ఛత్రపతి’తోనే మాస్ హీరోగా సెటిల్ అయ్యారు. అది నాకు కూడా తెలుసు,” అని మారుతి క్లారిటీ ఇచ్చారు. దీంతో ఆయన అలా ఎందుకు అనాల్సి వచ్చిందో క్లారిటీ వచ్చింది.

Read also-Anasuya Post: అదే నేను.. అలాగే ఉంటాను.. స్విమ్ సూట్‌లో అనసూయ అందాల విందు

ప్రభాస్ సినిమా అంటే ఉండే బాధ్యత ఒత్తిడి తనకు తెలుసని మారుతి అన్నారు. ఈ సినిమా కోసం ఆయన విజువల్ ఎఫెక్ట్స్ స్క్రిప్ట్ వర్క్‌పై దాదాపు ఏడాది కాలం పాటు కష్టపడ్డారు. “ప్రభాస్ కేవలం హీరోగానే కాకుండా, విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో తనకున్న అపారమైన అనుభవంతో ఎన్నో ఇన్పుట్స్ ఇచ్చారు. మేమిద్దరం కలిసి ఒక అద్భుతమైన ఫాంటసీ ప్రపంచాన్ని సృష్టించాం,” అని ఆయన తెలిపారు. తన ఇల్లు ఆఫీస్ అడ్రస్ ఇస్తూ మారుతి చేసిన వ్యాఖ్యలు ఆయన కాన్ఫిడెన్స్‌ను సూచిస్తున్నాయి. “హీరో గారికి నచ్చిన సినిమా తీశాను, ఆయనకు నచ్చితే ఫ్యాన్స్‌కు తప్పకుండా నచ్చుతుంది. సినిమా చూసిన తర్వాత మీరే ఈ వర్క్ గురించి మాట్లాడతారు,” అని ధీమా వ్యక్తం చేశారు. మారుతి ఇచ్చిన ఈ వివరణతో ఇప్పటివరకు ఆయనపై ఉన్న నెగిటివిటీకి తెరపడినట్లే అనిపిస్తోంది. సంక్రాంతి కానుకగా రాబోతున్న ‘రాజా సాబ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.

Just In

01

Star Heroines: ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ ఆశలన్నీ ఆ తమిళ సినిమాలపైనే!

Ustaad Bhagat Singh: మామా మరో పోస్టర్ వదిలారు.. ఫ్యాన్స్‌కు పూనకాలే!

Hey Bhagawan: ‘హే భగవాన్’ స్పెషల్ వీడియో చూశారా.. నవ్వకుండా ఉండలేరు!

Govt Employees: ఉద్యోగ సంఘాలకు కొత్త ఏడాది గుడ్ న్యూస్!.. సీఎం రేవంత్ కీలక సందేశం?

Uttam Kumar Reddy: నదీ జలాలపై బీఆర్ఎస్‌ను ఏకిపారేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి