Anasuya Post: టాలీవుడ్ స్టార్ యాక్టర్ అనసూయ కొత్త ఏడాది లో పెట్టిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ఇందులో న్యూయర్ వేళ అందాలు ఆరబోస్తూ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను ఆమె షేర్ చేశారు. అంతే కాకుండా.. ‘అదే వ్యక్తిత్వం.. అదే మనోధైర్యం.. కానీ ఈ కొత్త ఏడాదిలోకి సరికొత్త ఆశయాలతో అడుగుపెడుతున్నాను.. ఎదుగుదల.. ప్రశాంతత.. మరియు ఎప్పటిలాగే అనవసరమైన విషయాలకు నా జీవితంలో తావు లేదు!! నాకు ఇష్టమైన పనులు చేస్తూ.. అపరాధభావం లేకుండా ఇష్టమైనవి తింటూ.. హద్దులు లేని ప్రయాణాలు చేస్తూ.. భయం లేకుండా నా గళాన్ని వినిపిస్తూ..!! ఈ కొత్త ఏడాదిలో మరింత ఉత్సాహంగా జీవిస్తూ, మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ, సరికొత్త కాంతితో మెరిసిపోవాలని కోరుకుంటున్నాను. ప్రతికూలతలను ఎదిరించే ధైర్యం మనందరికీ ఉండాలని ఆశిస్తూ.. అందరికీ నూతన సంవత్సర (2026) శుభాకాంక్షలు! అంటూ రాసుకొచ్చారు. దీనిని చూసిన నెటిజన్లు రకరకాలుగా తమ భావాలను కామెంట్ల రూపంలో వ్యక్తీకరిస్తున్నారు.
Read also-Pawan Movie: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మూవీ ఫిక్స్..
ఇప్పటికే అనసూయ, శివాజీ వ్యాఖ్యలకు స్పందిస్తూ.. చేసిన పోస్టులు తెగ వైరల్ అయ్యాయి. శివాజీ ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్లు పూర్తిగా చీర కట్టుకుని రండమ్మా అన్నందుకు కొంత మంది టాలీవుడ్ సెలబ్రెటీల నుంచి వ్యతిరేకత వచ్చింది. మీరు ఎవరు మాకు చెప్పడానికి అంటూ శివాజీపై కొందరు మహిళలు విరుచుకు పడిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఆ తర్వాత కూడా అనసూయ ఎక్కడా తగ్గకుండాాా.. పదే పదే పోస్టులు పెట్టి శివాజీని సమర్థించే వారిని రెచ్చగొట్టారు. ఈ విషయం కాస్త మహిళా కమీషన్ వరకూ కూడా వెళ్లింది. శివాజీ మహిళా కమీషన్ ను కలిసి వివరణ కూడా ఇవ్వాల్సి వచ్చింది. అయితే అనసూయ మాత్రం ఈ విషయాన్ని వదిలేటట్లు కనిపించడం లేదు. ఇది జరిగిన వెంటనే శివాజీ బహిరంగ క్షమాపణలు కూడా చెప్పారు.
Read also-Fan Wars: ‘జల్సా’ రీ రిలీజ్.. థియేటర్‌లో మహేష్ అభిమానిపై పవన్ ఫ్యాన్స్ దాడి!

