ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో భేటీ అయిన మంత్రివర్గ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. 21 అంశాలకు ఏపీ క్యాబినెట్ (AP Cabinet) ఆమోదం తెలిపింది. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఏపీ నాలెడ్జ్ సొసైటీ కెపాసిటీ బిల్డింగ్ 2025 కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సమావేశంలో పలు కీలక అంశాలపైనా మంత్రివర్గం చర్చలు జరిపింది.
క్యాబినెట్ నిర్ణయాలు…
ఎస్ఐపీబీ సమావేశంలో ఆమోదించిన పారిశ్రామిక ప్రతిపాదనలకు క్యాబినెట్ (AP Cabinet) ఆమోదం.
44,776 కోట్లతో ఏపీలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఆమోదించిన క్యాబినెట్.
పంప్డ్ స్టోరేజి, సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులకు ఆమోదం.
ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రాష్ట్రంలో సవరించిన రిజిస్ట్రేషన్ విలువలకు కేబినెట్ ఆమోదం
22 ఏ ఫ్రీ హోల్డ్ భూములపై ఆయా జిల్లాల్లో స్టేటస్ నోట్‌ను మంత్రివర్గానికి మంత్రులు సమర్పించారు.
ఉగాది నుంచి పీ4 విధానం అమలు అంశంపై కేబినెట్‌లో చర్చ.
ఉన్నత విద్యామండలికి ప్రత్యేక కమిషనరేట్ ఏర్పాటు చేసే అంశంపై కేబినెట్ ఆమోదం.
వచ్చే ఏడాది విద్యా సంవత్సరం ఆరంభంలోనే తల్లికి వందనం పథకం అమలుపై చర్చ.
సాంకేతిక విద్య, ఐసెట్, లాసెట్ లాంటి పరీక్షల నిర్వహణను అప్పగించేలా ప్రతిపాదన.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపైనా కేబినెట్‌లో చర్చ.
పోలవరం నిర్వాసితులకు రిహబిలిటేషన్ అంశంపై క్యాబినెట్లో చర్చ.
త్వరలో పునరావాసానికి మరిన్ని నిధులు విడుదలపై క్యాబినెట్ ఆమోదం.
ఏడేళ్ల క్రితం అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రూ. 800 కోట్ల నిధులను పునరావాసానికి విడుదల చేశారు.
తాజాగా కూటమి సర్కార్ మరో రూ.1000 కోట్లు పునరావాసానికి పరిహారంగా విడుదలకు గ్రీన్ సిగ్నల్.
పునరావాసాన్ని వీలైన్నంత త్వరగా పూర్తిచేసి 2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తిచేసే దిశగా చర్యలు.
నీరు చెట్టు కార్యక్రమానికి బడ్జెట్ కేటాయింపుపై క్యాబినెట్లో చర్చ.
నీరు చెట్టు బిల్లులు చెల్లింపుపైన క్యాబినెట్లో నిర్ణయం.
పట్టాదార్ పాస్ పుస్తకం చట్ట సవరణకు ప్రతిపాదనపై కేబినెట్ లో చర్చ.
మద్యం ధరలపై చర్చ.
ఏపీ మత్స్యకార భరోసాపై క్యాబినెట్లో చర్చ. కేంద్రం ఇచ్చే రూ.6 వేల తోపాటు రాష్ట్రం మరో రూ.14 వేలు ఇచ్చేలా దృష్టిపెట్టాలని సీఎం సూచన.