Air India Pilot: పండుగల ఉత్సాహం మరి ఎక్కువైతే ఇలాగే ఉంటుంది. ఓ పైలట్ సంతోషంలో తాను ఏం చేస్తున్నాడో తనకే అర్థం కాలేదు. ఇదే అతనికి సమస్యగా మారింది. డిసెంబర్ 23, 2025న ఆ పైలట్ వాంకూవర్ నుంచి వియన్నా మార్గంగా ఢిల్లీకి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానాన్ని వాంకూవర్ ఎయిర్‌పోర్టుకి తీసుకెళ్లి అధికారుల చేతికి చిక్కాడు.
Also Read: SP Sudhir Ramnath Kekan: గట్టమ్మ ఆలయం వద్ద నూతన పార్కింగ్ ఏర్పాటు: ఎస్పీ శ్రీ సుధీర్ రామనాథ్ కేకన్
పలు మీడియా కథనాల ప్రకారం, వాంకూవర్ ఎయిర్‌పోర్టులోని డ్యూటీ ఫ్రీ షాప్‌లో విధుల్లో ఉన్న సిబ్బంది, బోయింగ్ 777 విమాన పైలట్ పండుగల సందర్భంగా అందిస్తున్న వైన్‌ను సిప్ చేసినట్టు గమనించారో లేక అతని వద్ద మద్యం వాసన వస్తోందని అనుమానించారో తెలుస్తోంది. ఈ విషయాన్ని కెనడియన్ అధికారులకు తెలియజేయడంతో, వారు పైలట్‌కు అనలైజర్ పరీక్ష నిర్వహించారు. ఆ పరీక్షలో పైలట్ విఫలమవడంతో అతడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు.
అయితే, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎయిర్ ఇండియా వెంటనే ప్రత్యామ్నాయ పైలట్‌ను ఏర్పాటు చేసింది. నలుగురు పైలట్లు రెండు షిఫ్టులుగా నడిపే ఈ అల్ట్రా లాంగ్ హాల్ ఫ్లైట్, స్థానిక సమయం ప్రకారం సాయంత్రం 5 గంటల సమయంలో సుమారు రెండు గంటల ఆలస్యంగా బయలుదేరింది. అనంతరం విమానం వియన్నాకు చేరుకోగా, అక్కడ నుంచి కొత్త సిబ్బంది ఢిల్లీ ప్రయాణాన్ని కొనసాగించారు.
ఈ ఘటనపై ఎయిర్ ఇండియా తీవ్రంగా స్పందించినట్టు సమాచారం. పైలట్‌ను రెండు రోజుల తర్వాత ఢిల్లీకి తీసుకువచ్చి విచారణ చేపట్టినట్టు, అలాగే ఈ విషయాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)కు కూడా నివేదించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. DGCA కూడా ఈ ఘటనను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
దీని పై ఎయిర్ ఇండియా విడుదల చేసిన ప్రకటనలో, “డిసెంబర్ 23, 2025న వాంకూవర్ నుంచి ఢిల్లీకి వెళ్లే AI-186 విమానం టేకాఫ్‌కు ముందు ఒక కాక్‌పిట్ సిబ్బంది సభ్యుడిని విధుల నుంచి తప్పించడంతో కొంత ఆలస్యమైంది. పైలట్ విధులు నిర్వహించేందుకు అనర్హుడని కెనడియన్ అధికారులు ఆందోళన వ్యక్తం చేయడంతో, అతడి నుంచి మరింత సమాచారం కోసం విచారణకు తీసుకెళ్లారు. భద్రతా నిబంధనల ప్రకారం ప్రత్యామ్నాయ పైలట్‌ను నియమించాం” అని పేర్కొంది.

