Congress Jumbo Committees: జిల్లాలకు కాంగ్రెస్ జంబో కమిటీలు?
Congress Jumbo Committees (imagecredit:twitter)
Political News, Telangana News

Congress Jumbo Committees: నూతన సంవత్సరంలో జిల్లాలకు కాంగ్రెస్ జంబో కమిటీలు?.. పూర్తి ప్లాన్ దీని కోసమే..?

Congress Jumbo Committees: కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ పాలనతో పాటు పార్టీ సంస్థాగత బలోపేతంపై ఇప్పుడు పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. ముఖ్యంగా జిల్లాల్లో ‘జంబో కమిటీల’ ఏర్పాటు ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్‌కు కొత్త ఊపిరి పోయాలని అధిష్టానం నిర్ణయించింది. తెలంగాణలో అధికారాన్ని చేపట్టిన రెండేళ్ల తర్వాత, కాంగ్రెస్(Cobgress) పార్టీ తన సంస్థాగత నిర్మాణాన్ని ప్రక్షాళన చేసే పనిలో పడింది. కేవలం ప్రభుత్వంపైనే కాకుండా, పార్టీ పటిష్టతపై కూడా ఫోకస్ పెట్టిన అధిష్టానం.. సంక్రాంతి లోపు జిల్లాల్లో పూర్తిస్థాయి కమిటీలను నియమించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇటీవల కొత్త డీసీసీల ప్రకటించిన పార్టీ.. త్వరలో జిల్లా, మండల స్థాయి కమిటీలన్నీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నది. ఇందులో భాగంగానే అన్ని జిల్లా పార్టీల్లో కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ జరుగుతున్నది. పార్టీ కార్యాలయాల్లో అప్లికేషన్లు స్వీకరణ కొనసాగుతున్నట్లు పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత తెలిపారు.

జంబో కమిటీల వెనుక మాస్టర్ ప్లాన్..

గత పదేళ్లుగా పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు, నాయకులకు సరైన గుర్తింపు ఇవ్వాలనేది పీసీసీ ప్రధాన ఉద్దేశ్యం. అందుకే ఈసారి పరిమిత సంఖ్యలో కాకుండా, ఎక్కువ మందికి అవకాశం కల్పించేలా జిల్లాల్లో జంబో కమిటీలను రూపొందిస్తున్నారు. జిల్లా కమిటీలు, మండల, బ్లాక్ కాంగ్రెస్ కమిటీల్లో చురుకైన వారికి చోటు దక్కనుంది. ట్రెజరర్ , ప్రతినిధులు (స్పోక్‌ పర్సన్స్), ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు హోదాలో కమిటీలు ఏర్పాటు కానున్నాయి. ఇక ఈ కమిటీలు పూర్తి కాగానే ​రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకలాపాలను ముమ్మరం చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు​విపక్షాల విమర్శలను తిప్పికొట్టడం, స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడం వంటివి నిర్వహించనున్నారు.

Also Read: Delhi Fog: న్యూఇయర్ ప్రయాణికులకు షాక్.. ఢిల్లీ లో పొగమంచు కారణంగా 148 విమానాలు రద్దు

నో పైరవీ.. క్యాస్ట్ ఈక్వేషన్స్ విధానంలో..

పదవుల కోసం పైరవీలకు తావులేకుండా, నిబద్ధత గల వారికి ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నది. సామాజిక సమీకరణాలను పాటిస్తూ, మహిళలకు కూడా తగిన ప్రాధాన్యత ఇచ్చేలా కసరత్తు జరుగుతున్నది. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకుని తుది జాబితాను సిద్ధం చేస్తున్నారు. అన్ని జిల్లాల నుంచి లిస్ట్ రెడీ అయితే, సంక్రాంతి పండుగ లోపు లేదా జనవరి రెండో వారం నాటికి ఈ నియామక ప్రక్రియను పూర్తి చేయాలని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దీనివల్ల జనవరి చివరలో నిర్వహించే భారీ బహిరంగ సభలు, పాదయాత్రలకు కొత్త కమిటీలు వెన్నెముకగా నిలుస్తాయని పార్టీ భావిస్తున్నది. అయితే, పదేళ్ల నిరీక్షణ తర్వాత అధికారంలోకి వచ్చిన హుషారులో ఉన్న క్యాడర్‌కు, ఈ పదవుల పంపకం మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read: Bhartha Mahasayulaku Wignyapthi: ‘వామ్మో వాయ్యో’.. ఇదేం పాటరో! ప్రోమో అదిరింది

Just In

01

Alleti Maheshwar Reddy: కృష్ణా జలాలపై బీఆర్ఎస్ సెంటిమెంట్ రగిల్చే కుట్ర: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

TG University Recruitment: తెలంగాణ వర్సిటీలో 73% ఖాళీలు.. పట్టించుకోని సర్కార్..!

Eluru District: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్నాడని.. స్తంభానికి కట్టి చితకబాదారు

Cigarettes Price Hike: 2026 ఏడాది మొదట్లోనే కేంద్రం బిగ్ షాక్ .. ఫిబ్రవరి 1 నుంచి పెరగనున్న సిగరెట్, పాన్ మసాలా ధరలు

Crime News: మేడ్చల్లో కొకైన్ కలకలం.. ఏడుగురిని అరెస్టు చేసిన పోలీసులు