Fan Wars: ఈ మధ్యకాలంలో క్లాసిక్ చిత్రాలను రీ రిలీజ్ చేస్తూ, మరోసారి అందర్నీ పాత రోజులకు తీసుకెళుతోన్న విషయం తెలిసిందే. రీ రిలీజ్ ట్రెండ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan), సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) నటించిన చిత్రాలు రికార్డులు క్రియేట్ చేసి మరింత ఉత్సాహాన్నిచ్చాయి. ఈ ఉత్సాహంతో మరిన్ని ఓల్డ్ క్లాసిక్ చిత్రాలను రీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అలా ఇప్పుడీ రీ రిలీజ్ అనేది ఒక ట్రెండ్‌గా మారింది. మరోవైపు ఇదే ట్రెండ్ ఫ్యాన్ వార్స్‌కు కూడా కేరాఫ్ అడ్రస్‌గా మారుతుండటం ఆందోళన కలిగించే విషయం. తాజాగా న్యూ ఇయర్ స్పెషల్‌గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘జల్సా’ (Jalsa 4K) చిత్రాన్ని మరోసారి రీ రిలీజ్ చేశారు. మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు ‘మురారి’, విక్టరీ వెంకటేష్ ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రాలు కూడా న్యూ ఇయర్ స్పెషల్‌గా రీ రిలీజ్ అయ్యాయి. అంతా బాగానే ఉంది కానీ, ఈ రీ రిలీజ్ థియేటర్‌లో ఇప్పుడో ఊహించని ఘటన చోటు చేసుకుంది. అదేంటంటే..
Also Read- Spirit: వంగా కన్ఫర్మ్ చేశాడు.. ఫస్ట్ పోస్టర్ వచ్చేస్తోంది
మహేష్ అభిమానిపై దాడి
పవన్ కళ్యాణ్ ‘జల్సా’ సినిమాను చూసేందుకు ఓ మహేష్ బాబు అభిమాని (Mahesh Babu Fan) కూడా ఆ సినిమా రీ రిలీజ్ అయిన థియేటర్‌కు వెళ్లారు. ఆ అభిమాని గతంలో సోషల్ మీడియాలో ఇతర హీరోలను కించపరుస్తూ, మహేష్ బాబు టాప్ అంటూ కొన్ని ట్వీట్స్ చేసి ఉండటంతో.. సరిగ్గా దొరికావ్‌రా అన్నట్లుగా పవన్ కళ్యాణ్ అభిమానులు (Pawan Kalyan Fans) ప్రవర్తించారు. అవును.. మహేష్ బాబు అభిమానిపై దాడి చేసి, ‘నువ్వు ఏ హీరో అభిమానివి.. జై కళ్యాణ్ బాబు అను’ అంటూ అతడిని ఇబ్బంది పెట్టారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు, పవన్ కళ్యాణ్‌కు జై కొడుతూనే మహేష్ బాబుని తిట్టాలంటూ.. హుకుం జారీ చేస్తున్నారు. దీంతో బెదిరిపోయిన మహేష్ బాబు అభిమాని.. వాళ్లు చెప్పినట్లుగా చేస్తున్నాడు. అయినా కూడా అతనిపై దాడి చేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఆ అభిమాని అంతకు ముందు సోషల్ మీడియాలో దారుణంగా పవన్ కళ్యాణ్, ప్రభాస్‌లపై పోస్ట్‌లు పెట్టారని, అందుకే తగిన గుణపాఠం చెప్పారని కొందరంటుంటే, ‘మురారి’ సినిమా కూడా రీ రిలీజ్ అయ్యింది కదా.. ఆ సినిమాకు వెళ్లకుండా.. వేరే హీరో సినిమాకు వెళ్లి ‘జై బాబు జై బాబు’ అని అరిచినందుకే ఇలా చేశారని మరికొందరు అంటున్నారు. మొత్తంగా చూస్తే.. ఫ్యాన్ వార్స్ ఏ రేంజ్‌లో ముదురుతున్నాయనే దానికి ఈ ఘటన చిన్న ఉదాహరణ మాత్రమే అనేలా.. నెటిజన్లు కొందరు పోస్ట్‌లు పెడుతున్నారు.
Also Read- Bhartha Mahasayulaku Wignyapthi: ‘వామ్మో వాయ్యో’.. ఇదేం పాటరో! ప్రోమో అదిరింది
ఆ టైమ్ వచ్చింది
ఇక థియేటర్‌లో ఈ ఫైట్ సీన్ చూసిన ఇతర ప్రేక్షకులు కూడా భయపడిపోయినట్లుగా తెలుస్తోంది. వాళ్లు వద్దని వారించినా వినకుండా, పవన్ కళ్యాణ్ అభిమానులు చేసిన ఈ దాడిపై రకరకాలుగా నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇలాంటి సంఘటనలతో.. రీ రిలీజ్ ట్రెండ్‌కు కూడా బ్రేక్ పడే అవకాశం ఉంది. అంతేకాదు, ఏ హీరో అభిమానులైతే దాడి చేశారో, ఆయన వరకు ఈ విషయం వెళితే, ఆయన పూర్తిగా సినిమాలు మానేసినా మానేస్తారని, ఫ్యాన్స్ కొందరు భయపడుతుండటం విశేషం. ఏది ఏమైనా ఇలాంటి చర్యలు మళ్లీ పునరావృతం కాకూడదని, దీనికి సరైన మార్గం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది మాత్రం క్లారిటీగా తెలుస్తోంది. చూద్దాం.. మరి, ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ ఏమైనా రియాక్ట్ అవుతారేమో..
పవన్ కల్యాణ్ సినిమా చూడడానికి వచ్చిన మహేష్ బాబు అభిమాని పైన జనసైనికులు దాడి…
ఉన్మాదుల లాగా తయారు అయ్యారు janasainiks #Everyone pic.twitter.com/mfTSMbcSat— 𝕁𝕦𝕤𝕥 𝔸𝕤𝕜𝕚𝕟𝕘 🇮🇳 (@JustAsking2_0) December 31, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

