Spirit: వంగా కన్ఫర్మ్ చేశాడు.. ఫస్ట్ పోస్టర్ వచ్చేస్తోంది
Spirit Movie (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Spirit: వంగా కన్ఫర్మ్ చేశాడు.. ఫస్ట్ పోస్టర్ వచ్చేస్తోంది

Spirit: టాలీవుడ్ బాహుబలి, డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఈ న్యూ ఇయర్ మామూలుగా ఉండదు. ఒకవైపు ‘ది రాజా సాబ్’ (The Raja Saab) సినిమాతో థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్న ప్రభాస్ (Prabhas), మరోవైపు తన మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ (Spirit) కు సంబంధించి ఒక భారీ సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ‘యానిమల్’ (Animal) చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక ఈ సినిమాకు సంబంధించి న్యూ ఇయర్ స్పెషల్‌గా ఓ అప్డేట్ రాబోతున్నట్లుగా వార్తలు అయితే వచ్చాయి కానీ, అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా సందీప్ రెడ్డి వంగా అది నిజమే అనేలా ఓ పోస్ట్ చేశారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read- Geetha Arts 2025: ఒక మధుర జ్ఞాపకం.. 2025 జర్నీపై గీతా ఆర్ట్స్ నుంచి ఎమోషనల్ ట్వీట్!

ఇంకొన్ని గంటల్లోనే..

ఇంతకీ సందీప్ రెడ్డి వంగా ఇచ్చిన అప్డేట్ ఏమిటంటే.. ‘ప్రేక్షకులూ.. ఇంకొన్ని గంటల్లో స్పిరిట్ ఫస్ట్ లుక్ పోస్టర్’ అని ట్వీట్ చేశారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అవధులు లేవంటే నమ్మాలి మరి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఒక షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ అయ్యిందనే విషయం తెలిసిందే. ప్రభాస్ ఇందులో ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారనేది సినిమాకు సంబంధించి వచ్చిన ఆడియో తెలియజేసింది. దీంతో ఇప్పుడు వచ్చే ఫస్ట్ లుక్ పోస్టర్ ఎలా ఉంటుందో? అని ప్రభాస్ అభిమానులు ‘వెయిటింగ్, వెయిటింగ్’ అంటూ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. మరి ఎన్ని గంటలకు ఈ పోస్టర్ వస్తుందనే దానిపై మాత్రం ఇంకా వంగా క్లారిటీ ఇవ్వలేదు. చూద్దాం.. మళ్లీ ఏమైనా అప్డేట్ ఇస్తారేమో. ఒక్కటైతే పక్కా.. కచ్చితంగా పోస్టర్ వస్తుందని తెలుస్తుంది కాబట్టి.. ఇక ఎప్పుడు వచ్చిన పర్లేదు అనేలా ఫ్యాన్స్ రియాక్ట్ అవుతుండటం విశేషం.

Also Read- Anaganaga Oka Raju: సంక్రాంతికి ఉన్న భారీ పోటీపై నవీన్ పొలిశెట్టి ఏమన్నారంటే?

రిలీజ్ అప్పుడేనా?

‘స్పిరిట్’ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ స్క్రీన్‌పై అదిరిపోతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అంతేకాకుండా, బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘యానిమల్’ చిత్రానికి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకు కూడా సంగీతం అందిస్తుండటంతో, ఆర్ఆర్ (RR) మళ్ళీ వేరే లెవల్‌లో ఉండబోతుందని స్పష్టమవుతోంది. హై ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. సందీప్ వంగా తన మునుపటి చిత్రాల కంటే ఈ సినిమాను మరింత రా అండ్ రస్టిక్ స్టైల్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2027 ప్రథమార్ధంలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రిలీజ్‌పై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ చిత్రం జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ‘స్పిరిట్’ షూటింగ్‌కు ప్రభాస్ చిన్న బ్రేక్ ఇచ్చినట్లుగా సమాచారం.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Meesaala Pilla Song: 100 మిలియన్ వ్యూస్‌తో 2025 బిగ్గెస్ట్ చార్ట్‌బస్టర్‌గా ‘మీసాల పిల్ల’!

Fan Wars: ‘జల్సా’ రీ రిలీజ్.. థియేటర్‌లో మహేష్ అభిమానిపై పవన్ ఫ్యాన్స్ దాడి!

Spirit: వంగా కన్ఫర్మ్ చేశాడు.. ఫస్ట్ పోస్టర్ వచ్చేస్తోంది

Medak SP: ఆడవాళ్ల జోలికొస్తే తాట తీస్తా.. రౌడీలకు మెదక్ ఎస్పీ వార్నింగ్

Indiramma Indlu: ఇందిరమ్మ ఇండ్లపై గుడ్ న్యూస్.. ఏప్రిల్ నుంచి షురూ.. పొంగులేటి కీలక ప్రకటన