Medak SP: ఆడవాళ్ల జోలికొస్తే తాట తీస్తా.. మెదక్ ఎస్పీ వార్నింగ్
Medak SP (Image Source: Twitter)
Telangana News

Medak SP: ఆడవాళ్ల జోలికొస్తే తాట తీస్తా.. రౌడీలకు మెదక్ ఎస్పీ వార్నింగ్

Medak SP: మెదక్ జిల్లాలో మహిళలు, బాలికల భద్రతకు షీ టీమ్స్ పటిష్టంగా పనిచేస్తున్నాయని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు తెలిపారు. డిసెంబర్ నెలలో ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా ఈవ్‌ టీజింగ్‌కు పాల్పడిన వారిపై 2 ఎఫ్‌ఐఆర్‌లు, 7 పెట్టి కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. తూప్రాన్ సబ్‌డివిజన్‌లో 16 మంది, మెదక్ సబ్‌డివిజన్‌లో 48 మంది మొత్తం 64 మందిని రెడ్‌ హ్యాండ్‌గా పట్టుకుని కౌన్సెలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. అలాగే ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలలు, బస్‌ స్టాప్‌లు, రద్దీ ప్రాంతాల్లో 38 అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు ఎస్పీ పేర్కొన్నారు.

Also Read: Indiramma Indlu: ఇందిరమ్మ ఇండ్లపై గుడ్ న్యూస్.. ఏప్రిల్ నుంచి షురూ.. పొంగులేటి కీలక ప్రకటన

తమను ఎవరైనా వేధిస్తే డయల్ 100 లేదా షీ–టీమ్ వాట్సాప్ నంబర్ 8712657963 కు ఫిర్యాదు చేయాలని మహిళలకు ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. 18 సంవత్సరాలు నిండకముందే బాలికల వివాహాలు జరిగితే వెంటనే 1098 చైల్డ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. మెదక్ జిల్లాలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ప్రారంభించామని మనుషుల అక్రమ రవాణా లేదా ఆర్గనైజ్డ్ నేరాలపై సమాచారం ఉంటే అందించాలని తెలిపారు.

Also Read: Wolf Supermoon: కొత్త ఏడాదిలో బిగ్ సర్‌ప్రైజ్.. ఆకాశంలో తోడేలు చందమామ.. ఇప్పుడు మిస్సయితే..

Just In

01

Bhootham Praytham: ‘భూతం ప్రేతం’ న్యూ ఇయర్ స్పెషల్‌ ‘చికెన్ పార్టీ’ సాంగ్ చూశారా?

The Raja Saab: ‘ది రాజా సాబ్’ మూవీ ‘రాజే యువరాజే’ సాంగ్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Meesaala Pilla Song: 100 మిలియన్ వ్యూస్‌తో 2025 బిగ్గెస్ట్ చార్ట్‌బస్టర్‌గా ‘మీసాల పిల్ల’!

Fan Wars: ‘జల్సా’ రీ రిలీజ్.. థియేటర్‌లో మహేష్ అభిమానిపై పవన్ ఫ్యాన్స్ దాడి!

Spirit: వంగా కన్ఫర్మ్ చేశాడు.. ఫస్ట్ పోస్టర్ వచ్చేస్తోంది