Geetha Arts 2025: తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రగామి నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌కు 2025 (Geetha Arts 2025 Journey) సంవత్సరం ఒక మధుర జ్ఞాపకంగా నిలిచిపోయింది. వైవిధ్యమైన కథలు, భారీ విజయాలు, ప్రేక్షకుల అపారమైన ప్రేమతో ఈ ఏడాది తమ బ్యానర్‌కు అత్యంత ప్రత్యేకం అని గీతా ఆర్ట్స్ సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ ప్రకటనను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. ఈ ట్వీట్‌లోని సారాంశాన్ని గమనిస్తే.. ఈ ఏడాది గీతా ఆర్ట్స్ ప్రయాణం మూడు విభిన్న కోణాల్లో సాగినట్లుగా చెప్పారు. అదేంటంటే..
‘తండేల్’ (Thandel)తో భావోద్వేగాల సునామీ
సంవత్సరం ఆరంభంలోనే యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya), సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటించిన ‘తండేల్’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ సిన్సియర్ లవ్ స్టోరీ ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించడమే కాకుండా, మనసులను గెలుచుకుంది. దేవి శ్రీ ప్రసాద్ (DSP) అందించిన సోల్‌ఫుల్ మ్యూజిక్ ఈ సినిమా విజయానికి వెన్నెముకగా నిలిచింది.
Also Read- Bhartha Mahasayulaku Wignyapthi: ‘వామ్మో వాయ్యో’.. ఇదేం పాటరో! ప్రోమో అదిరింది
#Singleతో నవ్వుల విందు
సీరియస్ ఎమోషన్స్ తర్వాత, ఎంటర్‌టైన్‌మెంట్ కింగ్ శ్రీ విష్ణు (Sree Vishnu) హీరోగా వచ్చిన ‘#Single’ మూవీ థియేటర్లలో నవ్వుల పూలు పూయించింది. కార్తీక్ రాజు దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం, ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచింది. కేతిక శర్మ, ఇవానాతో పాటు వెన్నెల కిషోర్ కామెడీ ఈ సినిమాను మెమరబుల్ హిట్‌గా మార్చాయి.
‘ది గర్ల్‌ఫ్రెండ్’తో హార్ట్ టచింగ్ ఎండ్
ఈ సంవత్సరం చివరిలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) ప్రధాన పాత్రలో నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ (The Girlfriend) ఒక మధురమైన జ్ఞాపకంగా నిలిచిపోయింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సున్నితమైన కథ, సినిమా ముగిసిన తర్వాత కూడా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం, రష్మిక నటన ఈ ఏడాదికి ఒక పర్ఫెక్ట్ ఫేర్‌వెల్ ఇచ్చాయని గీతా ఆర్ట్స్ పేర్కొంది.
Also Read- Anaganaga Oka Raju: సంక్రాంతికి ఉన్న భారీ పోటీపై నవీన్ పొలిశెట్టి ఏమన్నారంటే?
‘‘మా ఈ ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ, మాపై ప్రేమ చూపించిన ప్రేక్షకులకి పేరుపేరునా ధన్యవాదాలు. 2025 మాకు ఎప్పటికీ గుర్తుండిపోయే సంవత్సరం’’ అని గీతా ఆర్ట్స్ సంస్థ అభిమానులకు, ఫాలోయర్స్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది. మొత్తంగా గమనిస్తే.. ఒక పక్క ఎమోషన్, మరోపక్క కామెడీ, ఇంకోపక్క హార్ట్ టచింగ్ డ్రామా.. ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ 2025లో గీతా ఆర్ట్స్ తమ సత్తా చాటిందని చెప్పుకోవచ్చు. వచ్చే ఏడాది కూడా మరిన్ని వినూత్న చిత్రాలతో ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నిస్తామని గీతా ఆర్ట్స్ సంస్థ తెలియజేసింది.
2025- a year we’ll always cherish.
Grateful to every artist, technician, collaborator, and every audience member who walked this path with us.
Here’s to cinema, memories, and many more stories ahead. #HappyNewYear2026 pic.twitter.com/nMGbM1Bynj
— Geetha Arts (@GeethaArts) December 31, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

