The RajaSaab: 'రాజాసాబ్' క్లైమాక్స్ గురించి మారుతీ ఏమన్నారంటే..
maruthi-about-climax
ఎంటర్‌టైన్‌మెంట్

The RajaSaab: ‘ది రాజాసాబ్’ క్లైమాక్స్ గురించి మారుతీ చెప్పింది ఇదే.. అది 70 రోజుల కష్టం..

The RajaSaab: డార్లింగ్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం ‘ది రాజా సాబ్’ (The RajaSaab). ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ గురించి మారుతి పంచుకున్న విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కథ విషయంతో కథనం విషయంలో ప్రభాస్ ఎలా ఇన్వాల్వ్ అవుతారో వారు ప్రతి విషయాన్నీ ఎలా చర్చించుకుంటారో వివరించారు.

Read also-Magic Movie: ప్రేక్షకులకు సైకలాజికల్ త్రిల్లింగ్ ఇవ్వబోతున్న ‘మ్యాజిక్’.. రిలీజ్ ఎప్పుడంటే?

ఈ సినిమా క్లైమాక్స్ దాదాపు 35 నుండి 40 నిమిషాల పాటు సాగుతుంది. ఇది కేవలం ఒక ముగింపు మాత్రమే కాదు, ప్రేక్షకులను ఒక సరికొత్త ఫాంటసీ ప్రపంచంలోకి తీసుకెళ్లే అద్భుతమైన అనుభవం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కథలోని అసలు సోల్ ఈ క్లైమాక్స్ లోనే ఉంటుందని, అందుకే దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు వెల్లడించారు. సాధారణంగా ఒక చిన్న సినిమా షూటింగ్ మొత్తం 60 నుండి 70 రోజుల్లో పూర్తవుతుంది. కానీ ‘రాజా సాబ్’ టీమ్ కేవలం క్లైమాక్స్ ఎపిసోడ్ కోసమే ఏకంగా 60 నుండి 70 రోజులు కేటాయించింది. ఇందులో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, విజువల్ ఎఫెక్ట్స్ (CGI), ఎమోషనల్ డ్రామా మేళవించి ఉంటాయని చెప్పుకొచ్చారు. దీనికోసం మారుతి తన సాధారణ శైలికి భిన్నంగా ఎంతో కష్టపడ్డారని తెలుస్తోంది.

Read also-Anvesh Controversy: యూట్యూబర్ అన్వేష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన కరాటే కళ్యాణి.. ఎందుకంటే?

ఈ సినిమాలో ప్రభాస్ ను గతంలో ఎన్నడూ చూడని విధంగా చాలా విభిన్నంగా చూపిస్తున్నట్లు మారుతి ప్రామిస్ చేశారు. ముఖ్యంగా ఈ సుదీర్ఘ క్లైమాక్స్ లో ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ యాక్టింగ్ నెక్స్ట్ లెవల్ లో ఉంటాయని చెప్పుకొచ్చారు. హారర్ ఫ్యాంటసీ జానర్ లో వస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. క్లైమాక్స్ లో వచ్చే వింత క్రియేచర్స్, గ్రాఫిక్స్ ప్రేక్షకులకు థియేటర్లలో సరికొత్త అనుభూతిని ఇస్తాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జనవరి 9, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలు చాట్ బాస్టర్లుగా నిలిచాయి. మొత్తానికి, ‘రాజా సాబ్’ క్లైమాక్స్ తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక బెంచ్ మార్క్ గా నిలుస్తుందని మారుతి మాటలను బట్టి అర్థమవుతోంది. మరి ఈ 40 నిమిషాల మ్యాజిక్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి మరి.

Just In

01

Meesaala Pilla Song: 100 మిలియన్ వ్యూస్‌తో 2025 బిగ్గెస్ట్ చార్ట్‌బస్టర్‌గా ‘మీసాల పిల్ల’!

Fan Wars: ‘జల్సా’ రీ రిలీజ్.. థియేటర్‌లో మహేష్ అభిమానిపై పవన్ ఫ్యాన్స్ దాడి!

Spirit: వంగా కన్ఫర్మ్ చేశాడు.. ఫస్ట్ పోస్టర్ వచ్చేస్తోంది

Medak SP: ఆడవాళ్ల జోలికొస్తే తాట తీస్తా.. రౌడీలకు మెదక్ ఎస్పీ వార్నింగ్

Indiramma Indlu: ఇందిరమ్మ ఇండ్లపై గుడ్ న్యూస్.. ఏప్రిల్ నుంచి షురూ.. పొంగులేటి కీలక ప్రకటన