Magic Movie: సైకలాజికల్ త్రిల్లింగ్ ఇవ్వబోతున్న ‘మ్యాజిక్’..
magic-movie
ఎంటర్‌టైన్‌మెంట్

Magic Movie: ప్రేక్షకులకు సైకలాజికల్ త్రిల్లింగ్ ఇవ్వబోతున్న ‘మ్యాజిక్’.. రిలీజ్ ఎప్పుడంటే?

Magic Movie: టుత్రీ వెంచర్స్ బ్యానర్ మీద రాజు సత్యం నిర్మించిన మరాఠీ చిత్రం ‘మ్యాజిక్’. జితేంద్ర జోషి హీరోగా రానున్న ఈ మూవీకి రవింద్ర విజయ కర్మార్కర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని జనవరి 1న రిలీజ్ చేయబోతోన్నారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా.. మహారాష్ట్ర మండలి అధ్యక్షురాలు గీతా, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, దర్శకుడు మెహర్ రమేష్‌లు ముఖ్య అతిథులుగా మీడియా సమావేశం నిర్వహించారు. మెహర్ రమేష్ మాట్లాడుతూ .. ‘రాజు సత్యం నాకు చాలా మంచి స్నేహితుడు. స్వర్గీయ పునీత్ రాజ్ కుమార్తో నేను చేసిన ‘వీర కన్నడిగ’ చిత్రంలో రాజు నటించాడు. అప్పటి నుంచి మా స్నేహం కంటిన్యూ అవుతూనే ఉంది. ఆయన ఇప్పుడు ‘మ్యాజిక్’ మూవీని నిర్మించారు. ట్రైలర్ చూశాను. నాకెంతో గ్రిప్పింగ్‌గా అనిపించింది. పూరి గారి చిత్రాల్లో రాజ్ నటించాడు. ఇప్పుడు ప్యాషనేట్ ప్రొడ్యూసర్‌గా మారిపోయారు. బాలీవుడ్ అంతా కదిలి వచ్చి ఈ చిత్రం కోసం సపోర్ట్ చేశారు.’ అని అన్నారు.

Read also-Anvesh Controversy: యూట్యూబర్ అన్వేష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన కరాటే కళ్యాణి.. ఎందుకంటే?

మహారాష్ట్ర మండలి అధ్యక్షురాలు గీతా మాట్లాడుతూ .. ‘‘మ్యాజిక్’ ఎలా ఉండబోతోందో టీజర్, ట్రైలర్ చూస్తే అర్థమై ఉంటుంది. రాజు సత్యం ఈ మూవీని మరాఠీలో నిర్మించి ఓ గొప్ప అడుగు ముందుకు వేశారు. తెలుగు సబ్ టైటిల్స్‌‌తో ఈ చిత్రం రావాలని కోరుకుంటున్నాను. ఇలాంటి చిత్రాన్ని మీరెప్పుడూ చూసి ఉండరు’ అని అన్నారు. ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ మాట్లాడుతూ .. ‘ఇండియన్ సినిమాల్లో మరాఠీ ఇండస్ట్రీకి ప్రత్యేక స్థానం ఉంటుంది. అక్కడి నుంచి అద్భుతమైన ఆర్టిస్టులు బయటకు వచ్చారు. అలాంటి ఇండస్ట్రీ నుంచి నేరుగా ‘మ్యాజిక్’ సినిమా రాబోతోంది. రిలీజ్‌కు ముందే ప్రపంచ వ్యాప్తంగా 9 అంతర్జాతీయ అవార్డుల్ని దక్కించుకుంది. ఈ మూవీకి జెన్యూన్‌గానే హిందీ ఇండస్ట్రీ అంతా కలిసి వచ్చింది. ఇదొక మంచి చిత్రం. కేవలం మరాఠీలోనే కాకుండా అన్ని భాషల్లోకి ఈ చిత్రం వెళ్లాలి. సైకలాజికల్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం జనవరి 1న రిలీజ్ కాబోతోంది.

Read also-Trivikram Controversy: మరో సారి త్రివిక్రమ్‌ను టార్గెట్ చేసిన పూనమ్ కౌర్.. ఏం జరిగిందంటే?

నిర్మాత రాజు సత్యం.. ‘హైదరాబాద్‌లో చాలా మంది మరాఠీలు నివసిస్తున్నారు. అరుణ్ భయ్యా సహకారంతో ఈ ‘మ్యాజిక్’ మూవీని ఇక్కడ రిలీజ్ చేస్తున్నాం. నాకు అండగా నిలిచిన అరవింద్‌కు థాంక్స్. రవింద్ర చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. ఈ కథను ఏ భాషలో తీయాలనే ఆలోచన వచ్చింది. కానీ ఈ మూవీని మరాఠీలోనే ఇండిపెండెంట్ ఫిల్మ్‌గా తీయాలని అనుకున్నాను. జితేంద్ర జోషి గారు అద్భుతంగా నటించారు.’ అని అన్నారు. జితేంద్ర జోషి మాట్లాడుతూ .. ‘తెలుగు సినిమా అనేది ఎప్పటినుంచో హిందీ సినిమాని ప్రభావితం చేస్తూనే ఉంది. తెలుగు దర్శక, నిర్మాతల వల్లే టాలీవుడ్ ఈ స్థాయి వరకు వచ్చింది. ‘మ్యాజిక్’ చిత్రం అందరికీ నచ్చుతుంది. జనవరి 1న మా సినిమా రాబోతోంది. రాజు మా అందరినీ ఓ ఫ్యామిలీలా ట్రీట్ చేస్తారు. కరణ్ జోహర్, సల్మాన్ ఖాన్, బోనీ కపూర్, రణ్‌వీర్ సింగ్ ఇలా అందరూ మా కోసం ముందుకు వచ్చి సపోర్ట్ చేశారు. వారంతా రాజు సత్యంని ఎంతో ప్రేమిస్తుంటారు. ఇలా హైదరాబాద్‌కు వచ్చి మా సినిమాని ప్రమోట్ చేస్తుండటం ఆనందంగా ఉంది. రాజు భాయ్ తెలుగువారు. కానీ ముంబైలో సెటిల్ అయ్యారు. అంటూ చెప్పుకొచ్చారు.

Just In

01

Eko Streaming on Netflix: ఓటీటీలోకి వచ్చేసిన మళయాళం యాక్షన్ త్రిల్లర్ ‘ఎకో’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Bank Holidays 2026: 2026లో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు? ఆర్‌బీఐ ప్రకటించిన పూర్తి క్యాలెండర్

Wolf Supermoon: కొత్త ఏడాదిలో బిగ్ సర్‌ప్రైజ్.. ఆకాశంలో తోడేలు చందమామ.. ఇప్పుడు మిస్సయితే..

Dhurandhar Movie: అలా జరిగినందుకు రూ.90 కోట్ల వరకూ నష్టపోయిన ‘దురంధర్’ సినిమా.. ఎందుకంటే?

Anaganaga Oka Raju: సంక్రాంతికి ఉన్న భారీ పోటీపై నవీన్ పొలిశెట్టి ఏమన్నారంటే?