Trivikram Controversy: మరో సారి త్రివిక్రమ్‌ను టార్గెట్ చేసిన పూనమ్
poonam(x)
ఎంటర్‌టైన్‌మెంట్

Trivikram Controversy: మరో సారి త్రివిక్రమ్‌ను టార్గెట్ చేసిన పూనమ్ కౌర్.. ఏం జరిగిందంటే?

Trivikram Controversy: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ శైలి ప్రత్యేకం. ఆయన మాటల్లో లోతు, సంభాషణల్లో తాత్వికత ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తాయి. అయితే, తాజాగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఒక పాత వివాదాన్ని మళ్ళీ తెరపైకి తెచ్చాయి. ‘నువ్వు నాకు నచ్చావు’ సినిమా రీ-రిలీజ్ సందర్భంగా త్రివిక్రమ్ చేసిన వ్యాఖ్యలు, దానికి నటి పూనమ్ కౌర్ ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

Read also-Ghantasala Biopic: రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన ‘ఘంటసాల ది గ్రేట్’ మూవీ.. ఎప్పుడంటే?

త్రివిక్రమ్ ఏమన్నారు?

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ మాట్లాడుతూ.. “కొన్ని సినిమాలు డబ్బులు తెస్తాయి, కొన్ని పేరు తెస్తాయి. కానీ చాలా తక్కువ సినిమాలు మాత్రమే సమాజంలో మనకు ‘గౌరవం’ తీసుకొస్తాయి. అందులో ‘నువ్వు నాకు నచ్చావు’ ఒకటి” అని చెప్పుకొచ్చారు. సినిమా అనేది కేవలం వ్యాపారం మాత్రమే కాదని, అది ఒక మనిషికి ఇచ్చే గౌరవప్రదమైన గుర్తింపు గురించి ఆయన భావోద్వేగంగా మాట్లాడారు.

పూనమ్ కౌర్ ఘాటు స్పందన

త్రివిక్రమ్ ‘గౌరవం’ అనే పదాన్ని వాడటమే ఆలస్యం, నటి పూనమ్ కౌర్ సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. ఆమె నేరుగా త్రివిక్రమ్ పేరు ఎత్తకపోయినా, ఆయన మాటలనే ఉటంకిస్తూ అత్యంత వ్యంగ్యంగా స్పందించారు. “మీ ఆవేదన నాకు అర్థమవుతోంది. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి, వారిని మానసిక క్షోభకు గురిచేసే వారు బాధ్యత లేకుండా తప్పించుకోవడం నిజంగా దురదృష్టకరం. వ్యవస్థలు, మీడియా లేదా అసోసియేషన్లు బాధ్యతాయుతంగా వ్యవహరించనప్పుడు ఇలాంటి అన్యాయాలు జరుగుతాయి..” అంటూ పూనమ్ రాసుకొచ్చారు. త్రివిక్రమ్ మాట్లాడిన ‘గౌరవం’ అనే పదానికి, ఆయన ప్రవర్తనకు అస్సలు పొంతన లేదని ఆమె పరోక్షంగా ఎద్దేవా చేశారు.

Read also-Maruthi Surprise: అడ్రస్ ఇచ్చినందుకు మారుతీ ఇంటికి ప్రభాస్ ఫ్యాన్స్ ఏం పంపారో తెలుసా?.. ఇది వేరే లెవెల్..

వివాదం వెనుక అసలు కథ

పూనమ్ కౌర్ ఆవేదన వెనుక సుదీర్ఘ కాలంగా సాగుతున్న ఒక నిశ్శబ్ద పోరాటం ఉంది. పరిశ్రమలో ఒక వెలుగు వెలుగుతానని ఆశించిన పూనమ్, తన కెరీర్ పతనం కావడానికి త్రివిక్రమ్ తీసుకున్న కొన్ని నిర్ణయాలే కారణమని బలంగా నమ్ముతారు. అవకాశాలు రాకుండా చేయడం, మానసిక ఇబ్బందులకు గురిచేయడం వంటి ఆరోపణలు ఆమె మాటల్లో తరచుగా వినిపిస్తుంటాయి. మలయాళ చిత్ర పరిశ్రమలో ‘హేమ కమిటీ’ నివేదిక వచ్చిన తర్వాత, తెలుగులో కూడా మహిళా వేధింపులపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో పూనమ్ చేసిన ట్వీట్ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. త్రివిక్రమ్ సినిమాల ద్వారా గొప్ప నీతులు చెబుతారని ఆయన అభిమానులు అంటుంటే, పూనమ్ మాత్రం ఆయన వ్యక్తిత్వంలోనే లోపం ఉందని వేలెత్తి చూపుతున్నారు. మొత్తానికి, ‘నువ్వు నాకు నచ్చావు’ తెచ్చిన గౌరవం కంటే, పూనమ్ కౌర్ వేసిన ప్రశ్నలు ఇప్పుడు త్రివిక్రమ్‌కు పెద్ద సవాల్‌గా మారాయి.

Just In

01

Dhurandhar Movie: అలా జరిగినందుకు రూ.90 కోట్ల వరకూ నష్టపోయిన ‘దురంధర్’ సినిమా.. ఎందుకంటే?

Anaganaga Oka Raju: సంక్రాంతికి ఉన్న భారీ పోటీపై నవీన్ పొలిశెట్టి ఏమన్నారంటే?

The RajaSaab: ‘ది రాజాసాబ్’ క్లైమాక్స్ గురించి మారుతీ చెప్పింది ఇదే.. అది 70 రోజుల కష్టం..

New Year 2026 Hyderabad: న్యూయర్ వేడుకలకు సిద్ధమైన హైదరాబాద్.. సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్!

Bengaluru: బెంగళూరులో విషాదం.. భవనం పై నుంచి దూకి యువ ఉద్యోగి ఆత్మహత్య