Yasangi Urea Distribution: యాసంగిలో యూరియా పంపిణీకి వ్యవసాయ శాఖ ప్రత్యేక అధికారులను నియమించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి నియామక ఉత్తర్వులు జారీ చేశారు. 9 మందిని ప్రత్యేక అధికారులు కానీ నియమించి.. ఒక్కొక్కరికి మూడు నుంచి ఐదు జిల్లాలు అప్పగించారు. వారికి కేటాయించిన జిల్లాలో యూరియా(Urea) పంపిణీ సక్రమంగా జరిగేలా మానిటరింగ్ చేయాలని ఆదేశించారు. పైలెట్ ప్రాజెక్టు కింద యూరియా యాప్(Urea App) కొనసాగుతున్న ఐదు జిల్లాల్లో కూడా పంపిణీకి పకడ్బందీ చర్యలు చేపట్టారు. విజయ్ కుమార్‌కు వరంగల్(Warangal), మహబూబాబాద్(Mehabuabada), జనగం(janagan), జయశంకర్ భూపాలపల్లి(Bhupalla pally), ములుగు(Mulugu), హనుమకొండ(Hanumakonda) జిల్లాల బాధ్యతలు అప్పగించారు.
Also Read: Medak District: మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాద మరణాలు 29 శాతం తగ్గుదల.. వార్షిక నివేదిక విడుదల
క్యూలైన్లో నిలబడకుండా..
నరసింహారావు కు నల్లగొండ(Nalgonda), సూర్యాపేట(Suryapet), యాదాద్రి భువనగిరి జిల్లా, గీతకు మెదక్(Medak), సంగారెడ్డి(Sangareddy), సిద్దిపేట జిల్లాలు, ఆశ కుమారి కి రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలు, సుచరితకు కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలు, బాలుకు మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలు, శైలజకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో, చంద్రశేఖర్ కు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లు, కనకరాజుకు ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లా బాధ్యతలు అప్పగించారు. యూరియా పంపిణీ కేంద్రం వద్ద రైతులు గంటలు తరబడి క్యూలైన్లో నిలబడకుండా ప్రత్యేక అధికారులు మానిటరింగ్ చేయనున్నారు. రాష్ట్రంలో యాసిన్ సీజన్ అవసరం మేరకు యూరియా అందుబాటులో ఉందని, రైతులు ఆందోళన చెందవద్దని, పైలెట్ ప్రాజెక్టు కింద యాప్ అమల్లో ఉన్న ఐదు జిల్లాల్లో కూడా యూరియా అందుబాటులో ఉందని, మిగతా జిల్లాలో కూడా సరిపడా ఏరియా ఉందని, అవసరం ఉన్నవారే తీసుకోవాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి కోరారు. ముందస్తు లైన్లో నిలబడి యూరియా తీసుకోవడం వల్ల అవసరం ఉన్న రైతులు ఇబ్బంది పడే అవకాశం ఉందని ఇది గమనించాలని విజ్ఞప్తి చేశారు.
Also Read: Bangladesh Violence: షాకింగ్.. బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి హత్య

