భూపాలపల్లి, స్వేచ్ఛ: జయశంకర్ భూపాలపల్లి (Bhupalapally ) జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలోని స్మశాన వాటిక సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహదేవపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తికి సంబంధించిన ఫోటోలు, మృతదేహంపై ఉన్న గుర్తులను సమీపంలోని పోలీస్ స్టేషన్లకు పంపించామని… ఇతర వివరాల కోసం మహాదేవపూర్ పోలీసులను ఆశ్రయించాలని పోలీసులు తెలిపారు.