Oppo Reno 15 Pro Mini: Oppo త్వరలో తన Reno 15 సిరీస్‌లో మినీ వెర్షన్ ను లాంచ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అధికారిక విడుదలకు ముందే, లీక్‌లు ఆన్‌లైన్‌లో రావడం మొదలయ్యాయి. ఈ లీక్‌లు ఫోన్ ఫీచర్స్, ధరపై స్పష్టమైన సమాచారం అందిస్తున్నాయి. టిప్‌స్టర్ ఇప్పుడు క్లెయిమ్ చేసిన రిటైల్ బాక్స్ ధరను కూడా షేర్ చేశారు. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రీమియం మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో ఎలా ఉంటుందో అంచనా వేయొచ్చు.
Oppo Reno 15 Pro Mini ఫోన్ ధర
లీక్ ప్రకారం, Oppo Reno 15 Pro Mini 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ బాక్స్ ధర రూ. 64,999 గా ఉంది. సాధారణంగా ఇండియాలో బాక్స్ ధర అసలు రిటైల్ ధర కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఫైనల్ ధర రూ. 59,999 దాకా ఉండవచ్చని అంచనా. బ్యాంక్ ఆఫర్లు, డిస్కౌంట్స్ తో ఈ ఫోన్ ధర మరింత తగ్గే అవకాశం ఉంది. కానీ, ఇంతవరకు అధికారిక ప్రకటన లేదు.
Oppo Reno 15 Pro Mini ఫీచర్స్
Oppo ఇప్పటికే ఫోన్‌లో 6.32-inch AMOLED డిస్‌ప్లే ఉంటుందని తెలిపింది. ఫోన్‌లో 1.6mm నారో బేజెల్‌లు ఉంటాయి, ఫలితంగా స్క్రీన్-టు-బాడీ రేషియో 93% పైగా ఉంటుంది. డివైస్ సుమారు 187 గ్రాముల బరువు ఉంటుంది.
ఫోన్ IP66, IP68, IP69 రేటింగ్స్‌తో డస్ట్ & వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటుందని Oppo తెలిపింది. USB Type-C పోర్ట్‌లో ప్లాటినం కోటింగ్ ఉంచడం ద్వారా కర్రోషన్ నుంచి రక్షణ ఇవ్వబడుతుంది.
ప్రాసెసర్, కెమెరా & బ్యాటరీ
మీడియా టెక్ Dimensity 8450 చిప్‌సెట్ తో 12GB RAM, 512GB వరకు స్టోరేజ్ కలిగిన Reno 15 Pro Mini, 200MP ప్రధాన కెమెరా, 50MP అల్ట్రావైడ్, టెలిఫొటో సెన్సార్లను కలిగి ఉంటుంది. ముందు భాగంలో 50MP సెల్ఫీ కెమెరా ఉండనుందని లీక్. ఫోన్‌లో 6,200mAh బ్యాటరీ ఉండి, 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుందని కూడా సమాచారం.
Oppo ఇంకా ఫోన్ యొక్క ఖచ్చితమైన లాంచ్ డేట్ ప్రకటించలేదు. ధర, అందుబాటులోకి వచ్చే వివరాలు లాంచ్ రోజున వెల్లడిస్తారు. ఫోన్ లాంచ్ అయిన తర్వాత, Flipkart, Amazon, Oppo అధికారిక ఆన్‌లైన్ స్టోర్ నుంచి కొనుగోలు చేసుకోవచ్చు.

