Jr NTR: టాలీవుడ్ గ్లోబల్ ఐకాన్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Man Of Masses Jr NTR) తన కెరీర్‌లో మరో కీలకమైన మైలురాయిని అధిగమించారు. ఈసారి అది వెండితెరపై కాదు, న్యాయస్థానంలో! తన పేరు, గొంతు, ఫోటోలు, ఇంకా తన వ్యక్తిత్వానికి సంబంధించిన అంశాలను (Personality Rights) అనుమతి లేకుండా సోషల్ మీడియాలో లేదా వాణిజ్య ప్రకటనలలో దుర్వినియోగం చేయకుండా రక్షణ కల్పించాలని కోరుతూ ఎన్టీఆర్ డిసెంబర్ 2025లో ఢిల్లీ హైకోర్టు (Delhi High Court)ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం ఎన్టీఆర్ హక్కులను కాపాడుతూ కీలకమైన రక్షణ ఉత్తర్వులను (Protective Order) జారీ చేసింది. దీంతో కోర్టు ఉత్తర్వులకు ఎన్టీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
Also Read- Jagapathi Babu: షాకింగ్ లుక్‌లో జగపతిబాబు.. ‘పెద్ది’ పోస్టర్ వైరల్!
ట్విట్టర్ వేదికగా ఎన్టీఆర్ కృతజ్ఞతలు
కోర్టు తీర్పు వెలువడిన అనంతరం ఎన్టీఆర్ తన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘‘నేటి డిజిటల్ యుగంలో నా వ్యక్తిత్వ హక్కులను కాపాడే విధంగా రక్షణ ఉత్తర్వులు జారీ చేసిన గౌరవనీయ ఢిల్లీ హైకోర్టుకు నా ధన్యవాదాలు’’ అని ఆయన పేర్కొన్నారు. అలాగే ఈ చట్టపరమైన పోరాటంలో తనకు అండగా నిలిచిన సుప్రీంకోర్టు న్యాయవాదులు డాక్టర్ బాలజానకి శ్రీనివాసన్, డాక్టర్ అల్కా దాకర్, మిస్టర్ రాజేందర్, రైట్స్ అండ్ మార్క్స్ బృందానికి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీఆర్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. జస్టిస్, పర్సనాలిటీ రైట్స్, డిజిటల్ ఏజ్ వంటి హాష్ ట్యాగ్‌లతో ఎన్టీఆర్ చేసిన ఈ పోస్ట్‌కు.. ‘మంచి నిర్ణయం తీసుకున్నారు అన్న’ అంటూ అభిమానులు తమ హీరో నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. తన క్రేజ్‌ను తప్పుగా వాడే వారికి చెక్ పెట్టడంలో ఎన్టీఆర్ తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.
Also Read- The Raja Saab Trailer: ‘ది రాజా సాబ్’ ట్రైలర్ 2.ఓ వచ్చేసింది. ఇది కదా కావాల్సింది!
అసలు ఏమిటీ పర్సనాలిటీ రైట్స్?
సాధారణంగా సెలబ్రిటీల పేరును, వారి ఫోటోలను లేదా వారి గొంతును చాలామంది తమ వ్యాపారాల కోసం, సోషల్ మీడియా పేజీల కోసం అనుమతి లేకుండా వాడుతుంటారు. దీనివల్ల ఆ సెలబ్రిటీ ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉంది. ముఖ్యంగా AI టెక్నాలజీ వచ్చిన తర్వాత ‘డీప్ ఫేక్’ ఫొటోలు సెలబ్రిటీలను బాగా ఇబ్బంది పెడుతున్నాయి. ఈ టెక్నాలజీతో సెలబ్రిటీల వ్యక్తిత్వానికి తీరని నష్టం జరుగుతోంది. దీనిని అరికట్టడానికే ఎన్టీఆర్ ఈ చట్టపరమైన రక్షణను కోరారు. గతంలో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, చిరంజీవి వంటి దిగ్గజాలు కూడా ఇలాంటి హక్కులను పొందారు. ఇప్పుడు ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ కూడా వారి బాటలోనే కోర్టును సంప్రదించారు. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలతో ఇకపై ఎవరైనా ఎన్టీఆర్ పేరును లేదా ఆయన రూపాన్ని వాణిజ్యపరమైన ప్రయోజనాల కోసం వాడాలంటే ఖచ్చితంగా ఆయన అనుమతి తీసుకోవాల్సిందే. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే వారు కఠినంగా చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది కేవలం ఎన్టీఆర్‌కు మాత్రమే కాదు, డిజిటల్ యుగంలో తమ గుర్తింపును కాపాడుకోవాలనుకునే ప్రతి సెలబ్రిటీకి ఒక మార్గదర్శకంగా నిలుస్తుంది.
I thank the Hon’ble Delhi High Court for granting a protective order that safeguards my personality rights in today’s digital age.
My sincere appreciation to Supreme Court Advocates Dr. Balajanaki Srinivasan and Dr. Alka Dakar, along with Mr. Rajender and team of Rights & Marks,…
— Jr NTR (@tarak9999) December 29, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

