Emmanuel: బిగ్ బాస్‌ షో పై ఇమ్మానుయేల్ సంచలన వ్యాఖ్యలు
Emmanuel (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Emmanuel: బిగ్ బాస్‌ షో పై ఇమ్మానుయేల్ సంచలన వ్యాఖ్యలు

Emmanuel: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu Season 9) ముగిసి వారం అవుతున్నా, ఇంకా సోషల్ మీడియా వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఇమ్మానుయేల్ (Emmanuel) విషయంలో అన్యాయం జరిగిందంటూ, ఆయన అభిమానులు సోషల్ మీడియాలో ఫైర్ అవుతూనే ఉన్నారు. బిగ్ బాస్ విన్నర్‌గా కాకపోయినా, కనీసం రన్నరప్‌గా అయినా ఇమ్మానుయేల్ ఉండాలని, అంతా ఫిక్సింగ్ అంటూ.. బిగ్ బాస్ షోపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఇక బిగ్ బాస్ సీజన్ 9 ముగిసిన అనంతరం సోషల్ మీడియా వేదికగా టాప్ 5‌లో నిలిచిన అందరూ కృతజ్ఞతలు తెలుపుతూ పోస్ట్‌లు పెట్టారు. హౌస్‌లో అమ్మాకొడుకులుగా ఉన్న సంజన (టాప్ 5), ఇమ్మానుయేల్ (టాప్ 4) తాజాగా హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించి, బిగ్ బాస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఇమ్మానుయేల్ మాట్లాడుతూ..

Also Read- The Raja Saab Trailer: ‘ది రాజా సాబ్’ ట్రైలర్ 2.ఓ వచ్చేసింది. ఇది కదా కావాల్సింది!

నా గుండెల్లో పెట్టుకుంటాను

‘‘బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్‌గా నిలుస్తానని ఎంతో ఆశపడ్డాను. నేను విన్నర్‌ కావాలని ఎంతో మంది సపోర్ట్ చేశారు. కానీ, విన్నర్‌ని కాలేకపోయాను. అయితేనేం, టాప్ 5లో స్థానం పొంది, టాప్ 4గా నిలిచినందుకు హ్యాపీగా ఉంది. హౌస్‌లో ఉన్నన్ని రోజులు, అందరినీ ఎంటర్‌టైన్ చేశాననే అనుకుంటున్నాను. అప్పుడే కాదు, ఎప్పుడూ, నా కట్టె కాలే వరకు అందరినీ ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటాను. బిగ్ బాస్ జర్నీని, బిగ్ బాస్ అనుభవాన్ని నా గుండెల్లో పెట్టుకుంటాను. ఇక్కడ ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. మరీ ముఖ్యంగా ఓపిక ఎంతో ముఖ్యమో నాకు తెలిసి వచ్చింది. హౌస్‌లో ఆ స్థాయి వరకు వెళ్లాలంటే కచ్చితంగా చాలా ఓపిక కావాలి. ఈ సీజన్‌ హౌస్‌లోకి వచ్చిన సభ్యులందరూ నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. పార్టిసిపెంట్స్ అందరితోనూ నాకు మంచి అనుబంధం ఏర్పడింది. మరీ ముఖ్యంగా సంజనతో ప్రత్యేక అనుబంధం ఏర్పడిందని, ఆ బంధాన్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను’’ అని ఇమ్ము తెలిపారు.

Also Read- Director Maruthi: మొన్న అన్ని నీతులు చెప్పావ్.. ఇదేంటి మారుతి?

కళ్యాణ్ పడాలకు అభినందలు

ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘‘బిగ్ బాస్ హౌస్‌లో అంతా స్క్రిప్ట్ ప్రకారమే నడుస్తుందని, అంతా నటిస్తారని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారందరికీ నేను చెప్పేది ఒక్కటే. ఎవరైనా సరే.. ఒక గంట, ఒక వారం నటించగలరు. కానీ, రోజుల తరబడి నటించగలిగే మహానటులు ఈ ప్రపంచంలోనే ఎవరూ ఉండరు. మనం కష్టపడాల్సిందే. బిగ్ బాస్ జర్నీలో జీవితం అంటే ఏంటో తెలిసింది. ఈ జర్నీలో నాకు సపోర్ట్‌గా నిలిచిన ప్రతి ఒక్కరికీ, మరీ ముఖ్యంగా ‘విజనరీ వౌస్’కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ హౌస్‌లో ఎన్నో విలువైన విషయాలు నేర్చుకున్నాను. వాటన్నింటినీ ఇకపై నా కెరీర్‌కు, నా జీవితానికి అనుసరించే ప్రయత్నం చేస్తాను. నేను విన్నర్ కాలేకపోయాననే అసంతృప్తి నాలో ఏ కోశానా లేదు. విజేతగా నిలిచిన కళ్యాణ్ పడాల (Kalyan Padala)కు అభినందలను తెలియజేస్తున్నాను. మరొక్కసారి, ఈ జర్నీలో నన్ను అభిమానించి, నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను’’ అని అన్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

TS Politics: కేసీఆర్‌తో రేవంత్ మ్యాచ్ ఫిక్సింగ్.. బీజేపీ ఎమ్మెల్యే ఫైర్

ibomma Ravi Case: ‘ఐబొమ్మ రవి కేసు’.. సంచలన విషయాలు చెప్పిన సైబర్ క్రైమ్ డీసీపీ!

Viral News: కుక్క కాటుకు చనిపోయిన గేదె.. ఆస్పత్రికి పరుగులు పెట్టిన జనం, ఎందుకంటే?

Jr NTR: ఢిల్లీ హైకోర్టు‌కు కృతజ్ఞతలు తెలిపిన మ్యాన్ ఆఫ్ మాసెస్.. మ్యాటర్ ఏంటంటే?

January Bank Holidays: జనవరిలో భారీగా బ్యాంక్ హాలిడేస్.. ముందే జాగ్రత్త పడండి మరి.. తేదీలు ఇవే