Honor Power 2: హానర్ (Honor) కంపెనీ తన కొత్త ప్రీమియం మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ Honor Power 2ను వచ్చే వారం చైనాలో అధికారికంగా లాంచ్ చేయనుంది. Weibo వేదికగా విడుదల చేసిన టీజర్ పోస్టు నుంచి ఈ విషయాన్ని కంపెనీ ప్రకటించింది. గతేడాది ఏప్రిల్‌లో విడుదలైన Honor Powerకి సక్సెసర్‌గా ఈ ఫోన్ రానుండగా, భారీ బ్యాటరీతో ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
Honor Power 2ను జనవరి 5న చైనాలో ఆవిష్కరించనున్నారు. లాంచ్ ఈవెంట్ స్థానిక సమయం ప్రకారం సాయంత్రం 7:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకు) ప్రారంభమవుతుంది. ఈ ఫోన్‌లో 10,080mAh భారీ బ్యాటరీ ఉంటుందని హానర్ ప్రకటించింది. ఇది ఇప్పటివరకు హానర్ విడుదల చేసిన స్మార్ట్‌ఫోన్లలోనే అతిపెద్ద బ్యాటరీగా నిలవనుంది. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే 20 గంటలకు పైగా స్క్రీన్ టైమ్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది.
డిజైన్ విషయానికి వస్తే, Honor Power 2ను మూడు వేరియంట్లలో బ్లాక్, ఆరెంజ్, వైట్ రంగుల్లో విడుదల చేయనున్నారు. వెనుక భాగంలో పెద్ద కెమెరా ఐలాండ్‌తో మల్టీ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ డిజైన్ iPhone 17 Proను పోలి ఉన్నట్టుగా కనిపిస్తోందని టీజర్ చిత్రాలు సూచిస్తున్నాయి. ఫోన్ MediaTek Dimensity 8500 Elite ప్రాసెసర్‌తో రానుందని కంపెనీ నిర్ధారించింది.
ఛార్జింగ్ విభాగంలో కూడా Honor Power 2 బలంగా కనిపిస్తోంది. ఈ ఫోన్ 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 27W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రానుంది. లీక్‌ల ప్రకారం, ఇందులో 6.79 ఇంచుల LTPS ఫ్లాట్ డిస్‌ప్లే, 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 50 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండే అవకాశం ఉంది.
గత మోడల్ Honor Powerలో 8,000mAh బ్యాటరీ, Snapdragon 7 Gen 3 ప్రాసెసర్, 66W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే కొత్త Honor Power 2 ఈ అన్ని అంశాల్లో స్పష్టమైన అప్‌గ్రేడ్‌గా కనిపిస్తోంది. భారీ బ్యాటరీతో పాటు శక్తివంతమైన ప్రాసెసర్‌ను అందిస్తూ, మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌లో Honor Power 2 గట్టి పోటీని ఇవ్వనుందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

