MHSRB Recruitment News: నర్సింగ్ రిక్రూట్మెంట్‌లో దాదాపు 2 వేలకు పైగా అబ్జక్షన్స్ వచ్చినట్లు తెలిసింది. ఇందులో మెజార్టీ ఫిర్యాదులు వెయిటేజ్ మార్కులపైనే వచ్చాయి. ఇటీవల ఫస్ట్ ప్రోవిజనల్ మెరిట్ లిస్టును ఎంహెచ్ఎస్(MHS) ఆర్ బోర్డు రిలీజ్ చేసింది. 27 వరకు అభ్యంతరాలు స్వీకరించగా, అత్యధిక మంది వెయిటేజ్ అంశంపై కంప్లైంట్స్ ఇవ్వడం గమనార్హం. వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత సెకండ్ ప్రోవిజనల్ మెరిట్ లిస్టును విడుదల చేయనున్నారు. దీంతో లిస్టు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు ఆఫీసర్లు తెలిపారు. లీగల్ ఇష్యూస్ లేకుండా బోర్డు అధికారులు వచ్చిన అభ్యంతరాలను ఫిల్టర్ చేస్తున్నారు. ఈ రిక్రూట్ మెంట్ ప్రాసెస్ లో అత్యధిక మంది పోటీపడటం, వెయిటేజ్ మార్కులు, కోర్టు అంశాలు పరిశీలన వంటి వాటితోనే నియామక ప్రక్రియ ఆలస్యమవుతున్నట్లు ఆఫీసర్లు చెప్పారు.
కంప్లైంట్స్‌లో కొన్ని ఇలా..
అభ్యర్ధుల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో సింహభాగం వెయిటేజ్ మార్కులపైనే ఉండటం గమనార్హం. ఇందులో కోవిడ్ సమయంలో పనిచేసిన వారికి, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించిన వారికి ఇచ్చే వెయిటేజ్ పాయింట్ల కలవలేదనే అంశాన్ని ఫిర్యాదులు రూపంలో ఇచ్చారు. ఎక్స్ పీరియన్స్ సర్టిఫికేట్స్ సమర్పించినప్పటికీ, సాంకేతిక కారణాలతో కొందరికి మార్కులు కలవలేదని అభ్యంతరాలు రిపోర్టు చేశారు. అయితే బోర్డు అధికారులు సదరు ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి, తదుపరి నిర్ణయం తీసుకోనున్నది. గతంలో పలు నియామక ప్రక్రియలు న్యాయపరమైన చిక్కుల్లో పడి ఆగిపోయిన సందర్భాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది.వచ్చిన ప్రతి అభ్యంతరాన్ని మెడికల్ బోర్డు నిశితంగా పరిశీలిస్తోంది. ఒక్క చిన్న తప్పు ఉన్నా భవిష్యత్తులో కోర్టు కేసులకు దారితీసే అవకాశం ఉన్నందున, వడపోత ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తున్నారు.అర్హులైన ఏ ఒక్క అభ్యర్థికి అన్యాయం జరగకుండా చూడాలని ప్రభుత్వం కూడా బోర్డును ఆదేశించింది.
Also Read: Plane Crash: ఆకాశంలో బ్యానర్ ప్రదర్శిస్తూ సముద్రంలో కూలిన విమానం..
పుల్ మైలేజ్..?
సెకండ్ మెరిట్ లిస్టు ఆలస్యమైనప్పటికీ, కొత్త ఏడాదిలో నియామకాలను కొలిక్కి తీసుకురావాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. జనవరి నెలాఖరు నాటికి పూర్తి స్థాయి ఎంపిక జాబితాను విడుదల చేసి, అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇవ్వాలని సర్కార్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే 2 వేల అభ్యంతరాలను మాన్యువల్‌తో పాటు సాఫ్ట్‌వేర్ ద్వారా కూడా పరిశీలించనున్నది. అయితే వేలాది మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్న ఈ నర్సింగ్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ పారదర్శకంగా సాగాలని, వెయిటేజ్ మార్కుల గందరగోళాన్ని త్వరగా వీడదీయాలని అభ్యర్థులు కోరుతున్నారు. జనవరి లోపే రిక్రూట్ మెంట్ ప్రాసెస్ పూర్తవ్వాలని బోర్డుకు సర్కార్ టార్గెట్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో రిక్రూట్ మెంట్ ప్రాసెస్‌ను బోర్డు అధికారులు స్పీడప్ చేశారు. అపాయింట్ మెంట్ ఆర్డర్లు వేగంగా అందిస్తే సర్కార్‌కు కూడా మైలేజ్ రానున్నది. 2322 పోస్టుల కోసం ఏకంగా 40 వేలకు పైగా అభ్యర్ధులు పోటీపడటం గమనార్హం.
Also Read: Panchayat Grants: తెలంగాణ గ్రామ పంచాయతీలకు తీపి కబురు.. సీఎం కీలక ప్రకటన

