Illegal Sand Mining: జోగుళాంబ గద్వాల జిల్లాలో అక్రమ ఇసుక దందా అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తోంది. జోగుళాంబ గద్వాల జిల్లా సరిహద్దు రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటక రాష్ట్రంతో పాటు వనపర్తి జిల్లా నుంచి రాత్రి వేళలో టిప్పర్ ల ద్వారా అక్రమ ఇసుకను రవాణ చేస్తూ గద్వాల జిల్లాకు తరలించి జేబులు నింపుకుంటున్నారు. రాత్రి అయిందంటే రహదారిపై ఇసుక టిప్పర్ ల మోత వినిపిస్తున్న పోలీస్, రెవెన్యూ, మైనింగ్ అధికారులు అధికారులు చోధ్యం చూస్తున్నారు. రాత్రి 8 గంటల నుంచే టిప్పర్‌ల ద్వారా అక్రమ ఇసుక రవాణ చేస్తున్నారని, ప్రతి టిప్పర్ కు అక్రమార్కుల ఎస్కార్ట్ వాహనాలు ఫాలో అవుతూ వస్తున్నాయి. ఒక కర్నూల్ జిల్లా నుంచే పదుల సంఖ్యలో టిప్పర్లు అక్రమ ఇసుక రవాణ కొనసాగిస్తుండటం విశేషం. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం విస్మయానికి గురిచేస్తున్నది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడంలో నిర్లక్ష్యం.. రెవెన్యూ, పోలీస్, మైనింగ్ శా ఖల అధికారుల తీరు, సర్కారు పనితీరుకు నిదర్శనమని జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు.
ఆంధ్రా నుంచి తెలంగాణకు ఇసుక
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్, అనంతపురం జిల్లాల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా పదుల సంఖ్యలో టిప్పర్ ల ద్వారా అక్రమ ఇసుక రవాణ చేస్తున్నారు. టోల్ ప్లాజా మీదుగా ఆయా పోలీస్ స్టేషన్ ల మీదుగా టిప్పర్ ల ద్వార ఇసుక రవాణ జరుగుతున్న పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయా పోలీస్ స్టేషన్‌ల ఎదుట నుంచే ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతున్నది. స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఫుటేజీలను తనిఖీ చేసినా ఈ ఇసుక తంతు బయట పడుతుంది. కానీ పోలీసులు తమకేమీ పట్టునట్లుగా వ్యవహరిస్తుడడం అనుమానాలకు తావిస్తున్నది. కండ్ల ముందే నుంచే రయ్య్ మంటూ దూసుకుపోతున్న ఇసుక వాహనాలను ఎందుకు పట్టించుకోవడంలేదనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
మైనింగ్ శాఖలో బినామిలదే హవా..?
అక్రమ ఇసుక రవాణ అడ్డుకోవలసిన మైనింగ్ శాఖ అధికారులు అదే శాఖలో పనిచే స్తున్న ఒప్పంద ఉద్యోగులు, ఒకరిద్దరు అధికారులు తమ బినామీల పేరుతో ఇసుక వ్యాపారం నడిపిస్తున్నట్లు ఆరోపణ లున్నాయి.
Also Read: Indian Army Alert: జమ్మూ కశ్మీర్‌లో యాక్టివ్ అయిన 30 మంది ఉగ్రవాదులు.. ఇంటెలిజెన్స్ బిగ్ అలర్ట్
బార్డర్ లో దర్జాగా రవాణ
జోగుళాంబ గద్వాల జిల్లా సరిహద్దు ప్రాంతాలైన కేటిదొడ్డి మండలం నందిన్నె, గట్టు మండలంలోని బల్గెర,అయిజ మండలం నాగల్ దిన్నె బ్రిడ్జి, పుల్లూరు వద్ద అక్రమ రవాణ నియంత్రించడానికి పోలీస్ చెక్‌పోస్టులు ఉన్నాయి. ఆయా చెక్ పోస్టుల పరిధిలోని పోలీస్ స్టేషన్ ల మీదుగా అక్రమ ఇసుక రవాణ చేస్తున్నా పోలీస్ అధికారులు కట్టడి చేయలేదంటూ విమర్శలు వస్తున్నాయి.
ఇసుక దళారుల ఇష్టారాజ్యం
జిల్లాలో అక్రమ ఇసుకకు ఆజ్యంపోస్తన్నది దళారులే. ప్రజల అమాయకత్వాన్ని ఆసరగా చేసుకుని ఇసుక కొరత ఉందని నమ్మబలికి కొందరు మద్యవర్తులు ఇసుకను ఇష్టానుసారంగా విక్రయిస్తున్నారన్నా ఆరోపణలు ఉన్నాయి. ప్రతి మండలంలో పదుల సంఖ్యలో ఉన్న దళారులు ఇండ్ల యజమానులను జేబులు కొలగొడుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా కర్ణాటక, కర్నూల్ నుంచి టిప్పర్ ల ద్వారా తీసుకవచ్చిన ఇసుకను దళారులు ఇంటి యజమానులకు విక్రయిస్తున్నారు. ముఖ్యంగా గోనుపాడు, సంగాల, వీరాపురం, చింతలకుంట, కేటిదొడ్డి గ్రామాలకు చెందిన దళారులు జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాలకు అక్రమ ఇసుక రవాణలో కీలకపాత్ర పోసిస్తున్నారు. ఇంటి కట్టడాలు నిర్మిస్తున్న మే స్త్రీలు, దళారులు తక్కువ రేటుకు టిప్పర్ ల ద్వారా ఇసుకను తీసుకవచ్చి ఇంటి యజమానులకు ఎక్కువ రేట్ కు విక్రయిస్తున్నారు. టిప్పర్ కు ఓవర్ లోడ్ తో కలిపి 30-32 టన్నుల ఇసుకను నింపుకొని సుమారు రూ.30 వేల వరకు విక్రయించాలి కాని దళారులు రూ.45 వేల నుంచి 50 వేల వరకు విక్రయించి ఇంటి యజమానుల జేబులు కొల్లగొడుతున్నారు.
అక్రమ ఇసుక డంప్‌లు
జిల్లాలో ఇసుక మాఫియా పెట్రేగి పోతుంది. ఇతర ప్రాంతాల నుంచి రాత్రి వేళలో టిప్పర్ ల ద్వారా ఇసుక తెప్పించి శివారు ప్రాంతాలలో నిల్వ చేస్తున్నారు. రెండవ రైల్వే గేట్ సమీపంలో, గట్టు, కేటిదొడ్డి మండలాలో వ్యవసాయ పొలాలో ఇసుక డంపులు నిల్వ చేస్తున్నారని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ అక్రమంగా ఇసుకను తరలించకపోతున్న వారిపై కఠిన చర్యలు తీసుకొని అక్రమ దందాకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.
Also Read: KTR: కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేయాలి.. నాగర్‌కర్నూల్‌లో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

