Gautam Adani: ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ మహారాష్ట్రలోని పుణె జిల్లా బారామతిలో ఏర్పాటు చేసిన ‘శరద్‌చంద్ర పవార్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ ను ఆదివారం ప్రారంభించారు. ఈ అత్యాధునిక కేంద్రాన్ని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ నిధులతో నిర్మించారు.
ఈ సెంటర్‌ను పవార్ కుటుంబం నిర్వహిస్తున్న విద్యా సంస్థ విద్యా ప్రతిష్ఠాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎన్‌సీపీ (శరద్ పవార్ వర్గం) అధ్యక్షుడు శరద్ పవార్, బారామతి ఎంపీ సుప్రియా సూలే, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, ఆయన భార్య, రాజ్యసభ ఎంపీ సునేత్ర పవార్‌తో పాటు పవార్ కుటుంబానికి చెందిన పలువురు సభ్యులు హాజరయ్యారు.
అలాగే ఎన్‌సీపీ (ఎస్‌పీ) ఎమ్మెల్యే రోహిత్ పవార్, విద్యా ప్రతిష్ఠాన్ ఖజానాదారు యుగేంద్ర పవార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఏఐ సెంటర్ నుంచి విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ అందించడంతో పాటు పరిశోధనలకు ప్రోత్సాహం కల్పించనున్నారు.
Also Read: Medaram Temple: ప్రతి చిహ్నానికి ఆదివాసీ చరిత్రే ఆధారం.. నమస్తే తెలంగాణ కథనంపై ఆదివాసి సంఘాల ఆగ్రహం!
ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, గౌతమ్ అదానీ ఇప్పటికే 2022లో బారామతిని సందర్శించి అక్కడి సైన్స్ అండ్ ఇన్నోవేషన్ యాక్టివిటీ సెంటర్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. పుణెకు సుమారు 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న బారామతి పవార్ కుటుంబానికి రాజకీయంగా కీలకమైన ప్రాంతం. శరద్ పవార్, గౌతమ్ అదానీ మధ్య సంబంధం దాదాపు రెండు దశాబ్దాలుగా కొనసాగుతుండటం విశేషం. తాజా ఏఐ సెంటర్ ప్రారంభంతో విద్య, సాంకేతిక రంగాల్లో బారామతి మరింత అభివృద్ధి సాధించనుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Wife Extramarital affair: పెళ్లైన 4 నెలలకే బయటపడ్డ భార్య ఎఫైర్.. ఫ్లెక్సీ వేయించి భర్త న్యాయపోరాటం!

