Shivaji Apology: నటుడు శివాజీ ఇటీవల ‘దండోరా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ముఖ్యంగా మహిళా నటీమణుల వస్త్రధారణపై ఆయన వాడిన పదజాలం, పరోక్షంగా వారిని కించపరిచేలా ఉన్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద తనదైన శైలిలో స్పందిస్తూ శివాజీ తీరును తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. యాంకర్ అనసూయ కూడా స్పందించారు. దీనికి యాంకర్ ఝాన్సీ కూడా మద్ధతు పలుకుతున్నారు. ప్రస్తుతం ఇది తెలుగు రాష్ట్రీల్లో హాట్ టాపిక్ గా మారింది. శివాజీ బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పారు. అయినా మహిళా కమీషన్ కూడా విచారణకు హాజరు కావాలని తెలిపింది. దీనికి సమ్మతించిన శివాజీ తాజాగా మహిళా కమీషన్ ముందు హాజరయ్యారు.
Read also-Ariana Glory: వర్షతో కిసిక్ టాక్స్‌లో సందడి చేసిన అరియానా.. రూమ్ రెంట్ కోసం ఏం చేసేదంటే?
అనంతరం బయటకు వచ్చిన శివాజీ ఇలా చెప్పుకొచ్చారు. ‘నేను ఇప్పటికే సారీ చెప్పాను’ అని శివాజీ స్పష్టం చేశారు. అయితే, తప్పు చేయకపోయినా పరిస్థితుల వల్ల క్షమాపణ చెప్పాల్సి వచ్చిందని, తన మాటల వెనుక ఉన్న అసలు ఉద్దేశం వేరని ఆయన వివరించారు. నటులుగా సమాజంలో బాధ్యతాయుతంగా ఉండాలని, మన మాటలు లేదా ప్రవర్తన ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదని తాను నమ్ముతానని ఆయన చెప్పారు. తన వ్యాఖ్యలు కేవలం ఒక అభిప్రాయం మాత్రమేనని, ఎవరినీ కించపరచడానికి కాదని అన్నారు. కొన్ని యూట్యూబ్ ఛానెల్‌లు, మీడియా సంస్థలు థంబ్‌నెయిల్స్ కోసం విషయాన్ని అతిగా చూపిస్తున్నాయని, దీనివల్ల అనవసరమైన గొడవలు జరుగుతున్నాయని శివాజీ అసహనం వ్యక్తం చేశారు.
Read also-Jwala Gutta: శివాజీ వివాదంపై గుత్తా జ్వాల ఘాటు వ్యాఖ్యలు.. పోస్ట్ వైరల్!
అనసూయ తనకు మంచి స్నేహితురాలని, ఆమెపై తనకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదని ఆయన తెలిపారు. కేవలం ఒక సందర్భంలో తలెత్తిన అభిప్రాయ భేదాలను మీడియా పెద్దది చేసిందని చెప్పారు. శివాజీ ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ వివాదానికి పూర్తిస్థాయిలో ముగింపు పలకాలని కోరుకున్నారు. తాను చెప్పాలనుకున్నది చెప్పేశానని, ఇకపై దీని గురించి చర్చించాల్సిన అవసరం లేదని ఆయన మీడియాకు విజ్ఞప్తి చేశారు. దయచేసి ఇక్కడితో ఈ విషయానికి ముగింపు పలకాలని దీనిని ముందుకు తీసుకు వెళ్లే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు.

