Allahabad HighCourt Verdict Education of Madarsa Children In Crisis
జాతీయం

UP : అలహాబాద్ హైకోర్టు తీర్పు, సంక్షోభంలో మదర్సా పిల్లల చదువు

Allahabad HighCourt Verdict, Education of Madarsa Children In Crisis: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పును ప్రకటించింది. ఈ తీర్పు అనంతరం లక్నోలోని 121 మదర్సా పాఠశాలలో చదువుతున్న పిల్లల చదువుపై సంక్షోభం నెలకొంది. లక్నోలో మొత్తం 121 మదర్సాలు పనిచేస్తాయి. వాటిలో 18 ఎయిడెడ్, మిగిలినవి ప్రభుత్వ గుర్తింపు పొందినవి. ప్రస్తుతం ఈ మదర్సాలలో దాదాపు 21 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. కోర్టు తీర్పుతో ఇక్కడ చదువుతున్న విద్యార్థులంతా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.

లక్నోలో మొత్తం 121 మదర్సాలు ఉన్నాయని మైనార్టీ సంక్షేమ అధికారి సన్ కుమార్ స్పష్టం చేశారు. ఇందులో 18 సబ్సిడీ కింద మరికొన్ని ప్రభుత్వం కింద గుర్తింపు పొందాయి. వీటిలో 21 వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు.. తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఇమామ్ ఈద్గా మౌలానా ఖలీద్ రషీద్ ఫరంగి మహలీ మాట్లాడుతూ.. మదర్సాలలో కేవలం ధార్మిక విద్య మాత్రమే జరుగుతుందనడం అపోహ అని అన్నారు. ఇప్పుడు మదర్సాలలో ఇంగ్లీష్, సైన్స్, గణితం, కంప్యూటర్ సహా అన్ని సబ్జెక్టులు బోధిస్తున్నారని అన్నారు.ఇక్కడ చదివిన విద్యార్థులు ఐఏఎస్, పీసీఎస్, ప్రొఫెసర్లు కావడమే అందుకు నిదర్శనమని స్పష్టం చేశారు. మాజీ రాష్ట్రపతి మిస్సైల్‌ మ్యాన్ APJ అబ్దుల్ కలాం మదర్సాలలో ప్రాథమిక విద్యను అభ్యసించిన వారుగా ఆయన గుర్తుచేశారు. గురుకులం, సంస్కృత పాఠశాల వంటి మత సంస్థలు కూడా ప్రభుత్వ సహాయం పొందుతాయి.

Read More: లిక్కర్ కేసులో కింగ్ పిన్..!ఆరు రోజుల కస్టడీ

ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం మదర్సా 2004 యాక్ట్‌ కింద ఈ మదర్సాలను ఆర్టికల్ 14 ప్రకారం.. ఈ మదర్సాలను కొనసాగింపును రద్ధు చేసింది. ఇదే అంశంపై రాజ్యాంగంలోని ఆర్టికల్ 13 ప్రకారం… మైనారిటీలు తమకు నచ్చిన విద్యాసంస్థలను స్థాపించే హక్కును పొందుతారు. ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేయాలి. కానీ..హైకోర్టు తీర్పు షాక్‌ని కలిగిస్తోందని నగర ఖాజీ ముఫ్తీ అబుల్ ఇర్ఫాన్ మియాన్ ఫరంగి ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయస్థానం కచ్చితంగా అవకాశం ఇచ్చి ఉండాల్సిందని, చట్టాన్ని రద్దు చేయడం సమస్యకు పరిష్కారం కాదని అన్నారు. మదర్సా బోర్డు పేద పిల్లలందరికీ ఉచిత విద్యను అందిస్తుంది.లేని పోనీ అపోహలను సృష్టించి మతాన్ని ఇందులోకి లాగి పేద విద్యార్థుల భవిష్యత్‌ని మధ్యలోనే తుడిచేయడం సబబు కాదని ఆయన అన్నారు.

Just In

01

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..