KCR: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కాంగ్రెస్ నిర్లక్ష్యాన్ని
KCR ( image credit: swetcha reporter)
Political News

KCR: పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుపై కాంగ్రెస్ నిర్లక్ష్యాన్ని ఎండగట్టాలి.. గులాబీ నేతలకు కేసీఆర్ దిశ నిర్దేశం!

KCR: రాష్ట్ర ప్రయోజనాలపై కాంప్రమైజ్ కావద్దని.. ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని ఎండగట్టాలని గులాబీ అధినేత కేసిఆర్ నేతలను ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పై బహిరంగ సభ షెడ్యూల్ ఖరారు చేయాలని సూచించారు. ఎర్రవెల్లిలోని నివాసంలో శుక్రవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, జగదీష్ రెడ్డి లతో భేటీ అయ్యారు. కృష్ణ, గోదావరి జలాల్లో తెలంగాణకు రావలసిన వాటా పై సుదీర్ఘంగా చర్చించారు. సుమారు ఐదు గంటల పాటు సాగిన ఈ చర్చలో అసెంబ్లీ, ప్రాజెక్టుల అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం.

Also Read: Congress Counters KCR: కేసీఆర్‌కు స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చిన మంత్రులు

కేంద్రానికి రాసిన లేకపై నిలదీయాలి

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో లబ్ధి చేకూరాలని ఉన్న పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కాంగ్రెస్ చేస్తున్న నిర్లక్ష్యాన్ని వివరించాలని సూచించారు. మండల గ్రామ స్థాయి వరకు ప్రభుత్వ ప్రాజెక్టుపై అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టాలని సూచించారు. అసెంబ్లీ సమావేశాల్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 45 టీఎంసీలు చాలని మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి కేంద్రానికి రాసిన లేక పై నిలదీయాలని సూచించారు. 90 టీఎంసీలు నీటిపై టిఆర్ఎస్ కొట్లాడితే.. కాంగ్రెస్ 45 టీఎంసీలు ఎలా చాలని లేఖ రాస్తుందని ఇది మూడు జిల్లాలకు మరణ శాసనం అవుతుందని దీనిపై అసెంబ్లీ సాక్షిగా కొట్లాడాలని ఆదేశించారు. ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. హరీష్ రావు అసెంబ్లీలో మాట్లాడే బాధ్యత అప్పగించినట్లు సమాచారం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేలా స్పీకర్ను కోరాలని సూచించారు. అదేవిధంగా ప్రజా సమస్యల పైన, కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, గ్యారెంటీ ల పైన, ఫీజు రీయింబర్స్మెంట్, ఎరువుల కొరత, రైతు భరోసా, ఉద్యోగుల సమస్యలు, జాబ్ క్యాలెండర్ తదితర అంశాలపై పట్టు పట్టాలని సూచించారు.

అసెంబ్లీకి కేసీఆర్

ఈనెల 29న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ సమావేశాలకు తొలి రోజు కెసిఆర్ హాజరవుతున్నట్లు సమాచారం. పార్టీ నేతలకు హింట్ ఇచ్చినట్లు తెలిసింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే వస్తారా రారా అనేదానిపై ఇంకా అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. ఏది ఏమైనా అసెంబ్లీ సమావేశాల తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పై టిఆర్ఎస్ పోరుబాటకు సిద్ధమవుతుంది.

Also Read: KCR On Chandrababu: ఆంధ్రప్రదేశ్ ఏర్పాటే తెలంగాణకు శాపం.. చంద్రబాబుపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

Just In

01

Shivaji Apology: విచారణ అనంతరం మీడియా ముందుకు వచ్చిన శివాజీ ఏం చెప్పారంటే?

Motorola: భారత మార్కెట్‌కు మోటరోలా ‘సిగ్నేచర్’ సిరీస్..

Accreditation Policy: అక్రిడిటేషన్ కొత్త జీఓను సవరించాలి.. రెండు కార్డుల విధానానికి స్వస్తి పలకాలి.. టియూడబ్ల్యూజే డిమాండ్!

Pakistan: పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. దేశం వీడిన 5 వేల మంది డాక్టర్లు, 11 వేల మంది ఇంజనీర్లు.. కారణం ఏంటంటే?

Toy Train Kailasagiri: బ్రేకులు ఫెయిలై.. వెనక్కి వెళ్లిన ట్రైన్.. తృటిలో తప్పిన ముప్పు!